అతడితో కలిసి అలా ఎటాక్ చేసింది.. దేత్తడి హారికపై మండిపడ్డ కుమార్ సాయి
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో నుంచి అనూహ్య పరిస్థితుల్లో వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ కుమార్ సాయి ఎలిమినేట్ కావడం మరోసారి చర్చనీయాంశమైంది. ఎలిమినేట్ ప్రక్రియ సజావుగా సాగడం లేదంటూ నెటిజన్ల ఆగ్రహం మధ్య కుమార్ సాయి బయటకు వచ్చి బిగ్‌బాస్ తెలుగు 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో మాట్లాడారు. ఆయన తన అనుభవాలను పంచుకొంటూ..
Recommended Video

రాహుల్ సిప్లిగంజ్‌తో కుమార్ సాయి
ఎలిమినేషన్ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ చూపించిన దేత్తడి హారిక ఫోటోను చూసి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె బలం, బలహీనత గురించి మాట్లాడుతూ.. తన కంటూ ఓ గ్రూప్‌ను క్రియేట్ చేసుకొని ఇతరులను టార్గెట్ చేసుకొంటారు. నోయల్‌తో ఫ్రెండ్‌షిప్ పెట్టుకొని అతడిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు అని కుమార్ సాయి అన్నారు.

నోయల్‌కు నాకు పడటం లేదనే కారణంతో
తనను నామినేట్ చేయడంపై అభిజిత్ కూడా తప్పు తెలుసుకొన్నాడు. హారిక ఇన్‌ఫ్లూయెన్స్ కారణంగానే నామినేట్ చేయాల్సి వచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి అందుకు వివరణ ఇచ్చారు. నోయల్‌కు తనకు పడటం లేదనే కారణంతో నన్ను హారిక నామినేట్ చేసింది. కానీ నోయల్‌కు నాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు అని కుమార్ సాయి పేర్కొన్నారు.

ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు
నాపై నోయల్ ఎలాంటి కామెంట్స్ చేయరు. కానీ హారిక నన్ను ఎటాక్ చేయడానికి లీడ్ తీసుకొంటుంది. అయితే మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తుందనే విషయాన్ని తెలుసుకోలేకపోతాం. ఎందుకు ఈమె నన్ను టార్గెట్ చేస్తుందనే విషయం బుర్ర బద్దలు కొట్టుకొన్న అర్ధం కాదు. ఇదంత గ్రూప్ పాలిటిక్స్‌లో భాగంగా జరుగుతున్నాయనే విషయం అర్ధమైంది అని కుమార్ తెలిపారు.

ఇంటిలో ఫేక్ రిలేషన్స్
ఇంటిలో ఫేక్ రిలేషన్స్ ఉన్నాయి. మనం మనం కలిసి ఆడుదామనే గేమ్ ప్లాన్ నడుస్తున్నాయి. ఒకరికోసం ఒకరు ఆడటం మంచిదే కానీ.. సరైన గేమ్ ప్లాన్ లేదు. ఒకవేళ ఈ షోలో కలిసి అవార్డును పంచుకొంటారా అనేది వారికి అర్ధం కావడం లేదు. పరిస్థితి విషమిస్తే వారి మధ్య కూడా గొడవలు రావడం ఖాయం. గేమ్ చివరికి వచ్చే సరికి ఒకరికి ఒకరు పోటీగా మారుతారనే విషయాన్ని గ్రహించడం లేదు అని కుమార్ సాయి అభిప్రాయపడ్డారు.

హారిక వంకాయ లాంటింది అంటూ
ఎలిమినేషన్ తర్వాత కూరగాయలు తెప్పించి.. ఒక్కో కూరగాయ ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలి అంటూ నాగార్జున అడిగితే.. వంకాయ అంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి వంకాయ కచ్చితంగా దేత్తడి హారికకు సరిపోతుంది అంటూ కుమార్ సాయి కామెంట్ చేశాడు. వంకాయ అంటే క్వీన్ ఆఫ్ వెజిటేబుల్ అంటూ తనకు తాను హారిక సమర్ధించుకోవడం కనిపించింది. హారికకు నాకు ఎందుకు పడదో రీజన్ తెలియదు అంటూ కుమార్ సాయి చెప్పడం గమనార్హం.


Click it and Unblock the Notifications











