మోనాల్‌కు క్షీణించిన ఆరోగ్యం.. కుమార్, సోహైల్ ఫైట్.. ఎలిమినేషన్‌కు 10 మంది నామినేట్
బిగ్‌బాస్ ఇంటిలో ఐదోవారాంతం తర్వాత 36వ రోజు పరిస్థితి గంభీరంగా మారింది. ఇంటి సభ్యుల మధ్య కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నామినేషన్ ప్రక్రియలో సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకొన్నాయి. అయితే అనూహ్యం పరిస్థితుల్లో మోనాల్ గజ్జర్ ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు చికిత్స చేశారు. 36వ రోజు ఇంటిలో ఏమి జరిగిందంటే..

వంట పాత్రల క్లీనింగ్‌పై రచ్చ
ఇంటిలో వంట పాత్రలు క్లీన్ చేయడంపై సోహైల్, అరియానా, అమ్మా రాజశేఖర్ మధ్య గొడవ చోటుచేసుకొన్నది. వంట పాత్రలు కడిగి విషయంలో సోహైల్ తీసుకొన్న నిర్ణయాన్ని అరియానా, అమ్మా రాజశేఖర్ వ్యతిరేకించడంతో సోహైల్ కాస్త దురుసుగా ప్రవర్తించాడు. దాంతో అరియానా, సోహైల్ మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. ఈ క్రమంలో నీకు పొగరు అని అరియానా అంటే.. ఏందీ అంటూ గట్టిగా సోహైల్ అరిచారు. ఆ వివాదంపై డైనింగ్ టేబుల్ వద్ద చర్చ జరిగింది.

కుమార్, సోహైల్ మధ్య ఫైట్
వంట పాత్రల కడిగే విషయంపై డైనింగ్ టేబుల్ వద్ద చర్చ జరిగిన సమయంలో కుమార్ సాయి ఏదో చెప్పబోగా సోహైల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కెప్టెన్ అంటే అందరి మాటలు వినాలి. గద్దించి ఏదో చేయాలనుకొంటే సరికాదు అంటూ కుమార్ చెయ్యిత్తి సూచించాడు. దాంతో వేలు చూపించకు అంటూ సోహైల్ ఆగ్రహించాడు. అయినా కుమార్ సాయి అలాగే తన వేలిని చూపిస్తూ నిలిచున్నాడు. ఆ విషయంపై గొడవ కాస్తగా ఎక్కువగానే జరిగింది.

అభిజిత్, మోనాల్ మళ్లీ వాగ్వాదం
ఇక ఇంటిలో నామినేషన్ ప్రక్రియ విషయంలో నాగ్ ముందు అఖిల్‌ను, తనను తప్పు పట్టడంపై అభిజిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. నీవు చెప్పిన తీరు నాకు నచ్చలేదనే విషయంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇక మన మధ్య రిలేషన్ లేకపోతేనే మంచిగా ఉంటుందని అభిజిత్ తెలిపారు. అయితే నా విషయంలో నీ అభిప్రాయం ఏమిటో చెప్పమని అభిజిత్ అడిగితే.. కాస్త ఆలోచించి చెబుతాను అని మోనాల్ అన్నారు. ఆ తర్వాత గుడ్ మార్నింగ్, హాయ్ అని చెబితే ఒకేనా అని మోనాల్ అడిగితే కొంచెం టైమ్ ఇస్తే ఆలోచించి చెబుతానని అభిజిత్ జవాబిచ్చాడు.

మోనాల్‌కు ఆరోగ్యం క్షీణించడంతో
అభిజిత్ జరిగిన వాగ్వాదం జరిగిన తర్వాత మోనాల్ గజ్జర్ మనస్తాపానికి గురయ్యారు. దాంతో మానసికంగా డిస్ట్రబ్ అయినట్టు కనిపించారు. అర్ధరాత్రి ఒంటరిగా కూర్చొన్నారు. ఆ తర్వాత ఆమెకు ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు చికిత్స అందించారు. సెలైన్ ఎక్కించినట్టు బిగ్‌బాస్ చెప్పారు. అనారోగ్యంతో ఉన్న మోనాల్ వద్దకు వచ్చి అఖిల్ ముద్దు పెడుతూ కనిపించాడు.

నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత
నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కెప్టెన్ సోహైల్‌కు ప్రత్యేక అధికారం ఇచ్చాడు. నామినేట్ అయిన సభ్యుల్లో ఒకరిని నీవు సేఫ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. దాంతో మెహబూబ్‌ను సేఫ్ చేస్తూ సోహైల్ నిర్ణయం తీసుకొన్నాడు. ఆ తర్వాత మెహబూబ్ సంతోషంలో మునిగిపోయాడు. ఫ్రెండ్ అంటే వీడురా అంటూ సోహైల్‌పై ప్రశంసలు గుప్పించాడు. దాంతో ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ నుంచి తప్పించుకొన్నాడు.
Recommended Video

ఎలిమినేషన్ ప్రక్రియ కోసం 10 మంది
6వ వారంలో జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ కోసం 10 మంది నామినేట్ అయ్యారు. అత్యధికంగా 5 ఓట్లు పొందిన అరియానా, దివి, 4 ఓట్లు పొందిన అభిజిత్, రెండేసి ఓట్లు పొందిన కుమార్, మోనల్, కుమార్, ఒక్కో ఓటు పొందిన అఖిల్, నోయల్, లాస్య, హారిక నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం అత్యధికంగా సభ్యులు నామినేట్ కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











