Bigg Boss Telugu 7: ఓటింగ్‌లో షాకింగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ రసవత్తరంగా సాగుతోంది. ఇక ఈ వీక్ మొత్తం బిగ్ బాస్ ఫ్యామిలీని దించి కంటెస్టెంట్స్ నే కాదు.. చూసే ప్రేక్షకులను ఎమోషనల్ చేశాడు. ఇక వీకెండ్ దగ్గరకు వచ్చేస్తుంది. 10వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్ లో ఐదుగురు ఉన్నారు. ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్, రతికా రోజ్ ఈ వారం నామినేట్ అయ్యారు. నిన్నటి వరకు యావర్ చివరి స్థానంలో ఉండగా.. ఒక్కసారిగా ఓటింగ్ ఉల్టా పుల్టాగా మారిపోయింది. ఇక తాజా ఓటింగ్ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7ను గత సీజన్స్ కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఈసారి ఉల్టా పుల్టా అంటూ కొత్తగా మొదలు పెట్టారు. దీంతో అందరి చూపు దీనిపై పడింది. ఇక అందుకు తగ్గట్లుగానే బిగ్ బాస్ కొత్త కొత్త ట్విస్టులు, షాకులు ఇస్తూ వస్తున్నారు. ఇక బిగ్ బాస్ 10వ వారంలోకి అడుగుపెట్టేసింది. ఇంకో ఐదు వారాల్లో షోకి ఎండ్ కార్డ్ పడనుండి. ఈ నేపథ్యంలో ఆట మరింత రసవత్తరంగా మారింది. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఉండదు అని మొదటి నుంచి అంతా అనుకుంటున్నారు.

Bigg Boss Telugu 7 10th Week Eliminations: Rathika Rose, Bhole Shavali, Prince Yawar in danger zone

ఇక ఈ వారం కూడా ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్... ఉన్నారు. శివాజీ, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, రతికా రోజ్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అశ్విని శ్రీ, బోలే షవాలి ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ రాజమాతలు అనే కాన్సెప్ట్ తో జరిగాయి. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఐదుగురు ఉన్నారు. ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్, రతికా రోజ్ ఈ వారం నామినేట్ అయ్యారు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో ప్రిన్స్ యావర్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. దీంతో ఆయన రిస్కులో పడినట్లే అనిపిస్తుంది. మొన్నటి వరకు ప్రిన్స్ యావర్ చివరి స్థానంలో ఉన్నారు. ఆయనకు తక్కువ ఓట్స్ వచ్చాయి. ఇక తాజా ఓటింగ్ లో ప్రిన్స్ యావర్ మూడో స్థానానికి వచ్చారు. ఇక మొదటి స్థానంలో మాత్రం శివాజీ ఉన్నారు. ఆయన గత కొద్ది వారాలుగా మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు.

Bigg Boss Telugu 7 10th Week Eliminations: Rathika Rose, Bhole Shavali, Prince Yawar in danger zone

ఇక రెండో స్థానంలో గౌతమ్ కృష్ణ వచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్ గౌతమ్ కు బాగా కలిసివచ్చింది. దీంతో ఆయనకు ఓటింగ్ కూడా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. మదర్ సెంటిమెంట్ తో కాస్త ఓటింగ్ పెరిగింది. ఇక మూడో స్థానంలో యావర్ ఉన్నారు. ఇక ఈరోజు యావర్ బ్రదర్ ఎపిసోడ్ ప్లే అయితే కనుక మళ్లీ ఆయనకు ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. యావర్ ఈ ఎపిసోడ్ లో బాగా ఎమోషనల్ అయ్యాడు. అంతే కాదు.. చూసే వారు కూడా అవుతారు.

Bigg Boss Telugu 7 10th Week Eliminations: Rathika Rose, Bhole Shavali, Prince Yawar in danger zone

ఇక నాలుగవ స్థానంలో బోలే షవాలి ఉన్నాడు. ఐదో స్థానంలో రతికా రోజ్ ఉంది. వీరు ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీరి ఇద్దరిలో ఒకరే అని తెలుస్తోంది. ఇక ఈ వారం రతికా రోజ్ ఎలిమినేట్ కానుందని బిగ్ బాస్ వర్గాల సమాచారం. ఇక ఈ వారం దివాళి స్పెషల్ ఎపిసోడ్ ఉండనుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం.. సెలబ్రేటిలు రానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X