Bigg Boss Telugu 7: రతిక, శివాజీని బలి చేసిన సీరియల్ బ్యాచ్... మొత్తం నామినేషన్స్ లిస్ట్ ఇదే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 10వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్స్ హీటెక్కించేలా ఉన్నాయి. బిగ్ బాస్ మొత్తానికి భారీ ప్లాన్ వేసి.. నామినేషన్స్ ప్రారంభించాడు. ఇక నామినేషన్స్ లో ఐదుగురు టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఇక 10వ వారం నామినేషన్స్ ప్రక్రియలో సీరియల్ బ్యాచ్ మొత్తం రతికా రోజ్ ను నామినేషన్ లోకి తీసుకువచ్చింది. దీంతో రతికా రోజ్ బలి కావాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది.. ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారు అనేది ఈస్టోరీలో చూద్దాం.
ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ హీటెక్కించేలా ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్స్ ను రాజమాతలను చేశాడు బిగ్ బాస్. ఇక వారిలో సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభా శెట్టి ఉన్నారు. ఇక రతికా రోజ్, అశ్విని. ఇక ప్రతిసారి ఇద్దరు క్యాండెట్లు వెళ్లి తాము నామినేట్ చేసే కంటెస్టెంట్ ను వారి కారణాలు చెప్పి నామినేట్ చేయాలి. అందులో ఎవరి రీజన్ వారికి న్యాయంగా అనిపిస్తే వారి నామినేషన్లను రాజమాతలు ఏకాభిప్రాయంతో అంగీకరించాలి.

ఇక రాజమాతాల కోసం సింహాసనాలు ఏర్పాటు చేశారు. మొదట అర్జున్, అమర్ దీప్ వస్తారు. ఇక వారిలో భోలే తాను వీక్ అని ఒప్పుకొని గత వారం మా టీమ్‌లోకి వచ్చేయడం కరెక్ట్ అనిపించలేదని అమర్ దీప్ రీజన్ చెప్పి నామినేట్ చేశాడు. ఇక అర్జున్.. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా టీమ్ మొత్తాన్ని శివాజీ ఇన్‌ఫ్లుయెన్స్ చేశాడని గౌతమ్ చెప్పడం కరెక్ట్ కాదంటూ నామినేట్ చేస్తాడు. ఇక వీటికి రాజమాతలు బోలేను నామినేట్ చేస్తారు.
ప్రిన్స్.. అమర్ దీప్ ను, ప్రశాంత్.. గౌతమ్‌ను నామినేట్ చేసేందుకు రెడీ అయ్యారు. రాజమాతలు..ప్రశాంత్ కు మద్దతుగా నిలబడి గౌతమ్ ను నామినేట్ చేశారు. తర్వాత భోలె షావళి.. అమర్ నన్ను వీక్ అనడం నచ్చలేదంటూ నామినేట్ చేశాడు. గౌతమ్.. శివాజీ ఎవరినో కొట్టేసి పోతానన్నాడు. నాగ్ దాని గురించి అడిగితే తనను తాను కొట్టుకుని పోతానని మాట మార్చాడని చెప్పాడు. ఇక దీనిపై చర్చించిన రాజమాతలు... గౌతమ్ కు మద్దతుగా నిలిచి.. శివాజీని నేరుగా నామినేషన్ లోకి పంపించేశారు. ఇది సహించలేకపోయిన శివాజీ.. వాడి పాయింట్స్ మీకు కరెక్ట్‌గా అనిపించాయా? అని శివాజీ ఫైర్ అవుతాడు.

ఇక ఇంతలో ప్రియాంక, శోభ.. అశ్విని గొడవపడగా... తనను అసలు మాట్లాడనివ్వట్లేదని అశ్విని ఏడుస్తుంది. కాసేపు వాళ్లు గొడపడుతారు. ఇక అశ్విని అయితే ఏడుస్తుంది. ఇక చివరకు బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చేడు. రాజమాతలు చర్చించుకుని వారిలో ఒకరు నామినేట్ అవ్వాలన్నారు. రతిక, అశ్విని.. ప్రియాంకను నామినేట్ చేయగా.... ప్రియాంక, శోభ.. రతికను నామినేట్ చేశారు. ప్రియాంక, రతికకు టై అవడంతో నామినేషన్ బాధ్యతను కెప్టెన్‌కు అప్పగించాడు బిగ్‌బాస్. శోభకు మరో ఆప్షనే లేదు, ప్రియాంకను సేవ్ చేసి రతికను నామినేట్ చేసింది. ఇక రతికను బలి చేసింది సీరియల్ బ్యాచ్. ఇక ఈ వారం భోలె షావళి, శివాజీ, గౌతమ్, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్‌లో ఉన్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











