Bigg Boss Telugu 7: 12వ వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే.. సెల్ఫ్ నామినేషన్‌తో హాట్ బ్యూటీ ఔట్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రియాలిటీ షో.. 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్స్ కూడా హాట్ హాట్ గా సాగాయి. ఇక ఈ వారం నామినేషన్స్ లో 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో అశ్విని సెల్ఫ్ నామినేషన్ తో హైలెట్ గా నిలిచింది. ఇక ఈ వారం హాట్ బ్యూటీ వెళ్లిపోవడం ఖాయమని అంటున్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఉన్నారు.. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు.. అనేది ఈ స్టోరీలో చూద్దాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తిగా సాగుతోంది. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్నది కేవలం 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే. ఇక గత వారం ఎలిమినేషన్ లేకుండా షో సాగింది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని నాగార్జున చెప్పాడు. మరోవైపు ఈ వారం నామినేషన్స్ హీటెక్కించేలా సాగాయి. గోడవలు నువ్వా నేనా అన్నట్లుగా కంటెస్టెంట్స్ పడ్డారు. హౌస్ లో శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్ అంబటి, గౌతమ్, అశ్విని, శోభా శెట్టి, ప్రియాంక జైన్, రతికా రోజ్ ఉన్నారు.

ఇక ఈ వారం కెప్టెన్ గా ప్రియాంక జైన్ కావడంతో సేఫ్ అయిపోయింది. ఈ వారం పూర్తి నామినేషన్స్ లిస్ట్ ఒకసారి గమనిస్తే... 12వ వారం నామినేషన్స్ లో 6 మంది టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అమర్ దీప్, గౌతమ్, రతికా రోజ్, అర్జున్ అంబటి, ప్రశాంత్, అశ్విని ఉన్నారు. అయితే వీరిలో అశ్వీని మాత్రం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో సెల్ఫ్ నామినేషన్ చేసుకుంది.
దీంతో ఈ వారం ఈ బ్యూటీ ఔట్ అంటున్నారు నెటిజన్స్. గతంలో యావర్ ఇలాగే చేసుకుని బయటపడ్డాడు. దానికి కారణం అతనికి ఉన్న క్రేజ్. ఇక ఈ బ్యూటీ ఈ వారం ఎలిమినేట్ కానుందని నెటిజన్స్ అంటున్నారు. ఇక అమర్ దీప్ ను ఇద్దరు నామినేట్ చేశారు. ఒకరు యావర్ కాగా.. మరోకరు రతికారోజ్. గౌతమ్ ను ప్రశాంత్, శివాజీ నామినేట్ చేశారు.
అయితే ఇక్కడ ప్రశాంత్ వర్సెస్ గౌతమ్ గోడవ హైలెట్ గా నిలిచింది. రతికను అమర్ దీప్, ప్రశాంత్ నామినేట్ చేశారు. అర్జున్ ను యావర్, శివాజీ నామినేట్ చేయగా.. ప్రశాంత్ ను గౌతమ్, రతిక రోజ్ నామినేట్ చేశారు. అశ్విని ఓవర్ కాన్ఫిడెన్స్ తో సెల్ఫ్ నామినేషన్ చేసుకుంది.
సిల్లీ కారణాలతో ఎవరినీ నామినేట్ చేయలేను అని అశ్విని చెప్పగా.. ఒకవేళ పేర్లు చెప్పకపోతే సెల్ఫ్ నామినేట్ అయిపోతారని బిగ్ బాస్ చెప్తాడు. అలాగే అని అశ్విని ఓకే చెప్పి... నామినేట్ అయిపోతుంది. ఆమెకి ఇంట్లో ఉండటం ఇష్టం లేకనే ఇలా చేసిందా.. ఎలాగూ డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఈ వారం వెళ్లిపోతాను అని ఇలా చేసిందా అనేది తెలియట్లేదు. మొత్తానికి ఈ హాట్ బ్యూటీ ఔట్ అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











