Bigg Boss Nominations: 12వ వారం నామినేషన్స్ లీక్.. తొలిసారి ఆ ముగ్గురికి షాక్.. ఆమెకు ఓటు పడ్డా సేఫ్

రియాలిటీ ఆధారంగా నడుస్తూ.. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన ఏకైక షో బిగ్ బాస్. దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. ఇది తెలుగులో మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ సాధించింది. ఫలితంగా నిర్వహకులు ఆరు సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకుని.. ఇప్పుడు ఏడో దాన్ని కూడా రసవత్తరంగా నడుపుతున్నారు. ఇది దాదాపుగా చివరి దశకు చేరడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో 12వ వారం నామినేషన్స్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. మరి ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారో మీరే చూసేయండి మరి!

ఎవరూ ఊహించని సీజన్:బిగ్ బాస్ అనే షో కొత్త కంటెంట్‌తోనే వచ్చింది. కానీ, దీనికి ప్రతిసారీ భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఆరో సీజన్ మాత్రం చప్పగా సాగడంతో.. ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకొచ్చారు. దీనికి ఆరంభం నుంచే అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇందులో ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, నామినేషన్స్, ఎలిమినేషన్స్, కెప్టెన్సీ టాస్కులు జరుగుతూ మజా ఇస్తున్నాయి.

 Bigg Boss Telugu 7 12th Week Nominated Contestants List Leaked

ఏ వారం ఎవరు వెళ్లారు?:ఏడో సీజన్‌లోకి తొలి రోజు 14 మంది, ఆ తర్వాత ఐదుగురు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, 2వ వారంలో షకీలా, 3వ వారం దామిని, 4వ వారం రతికా రోజ్, 5వ వారంలో శుభశ్రీ రాయగురు, 6వ వారంలో నయని పావని, 7వ వారంలో పూజా మూర్తి, 8వ వారంలో సందీప్, 9వ వారంలో తేజ, 10వ వారం భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు.

సింహానికి ఆహారం వేస్తూ:ఉల్టా పుల్టాగా సాగే ఈ సీజన్‌లో బిగ్ బాస్ నిర్వహకులు నామినేషన్స్ టాస్కులను కొత్త కాన్సెప్టులతో తీసుకు వస్తున్నారు. అయితే, 12వ వారం జరగబోయే నామినేషన్స్ ప్రక్రియను 'సింహానికి ఆహారం' అనే కొత్త టాస్కును తీసుకు వచ్చారు. దీని ప్రకారం.. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తూ వాళ్ల ఫొటోలను సింహం బొమ్మ నోట్లో వేయాలి. తర్వాత కారణాలను చెప్పాలి.

వాళ్ల మధ్య పెద్ద గొడవలే:సాధారణంగా నామినేషన్స్ టాస్క్ అంటేనే బిగ్ బాస్ షో మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఇది జరిగే సమయంలో కంటెస్టెంట్ల మధ్య భారీ స్థాయిలో గొడవలు జరుగుతాయి. ముఖ్యంగా పన్నెండో వారం నామినేషన్స్‌లో అమర్ - ప్రిన్స్, గౌతమ్ - ప్రశాంత్, గౌతమ్ - శివాజి సహా పలువురు గొడవలు పెట్టుకున్నారని తెలిసింది. దీంతో ఈ నామినేషన్స్ రచ్చ రచ్చగానే సాగాయి.

మళ్లీ ఎనిమిది మందేగా:ఏడో సీజన్‌లోని పన్నెండో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ షూట్ ఆదివారమే కంప్లీట్ అయింది. విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మొత్తం ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలిసింది. అందులో ప్రిన్స్, శివాజి, అమర్‌దీప్, అంబటి అర్జున్, ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, అశ్విని, రతికా రోజ్‌లు ఉన్నారని సమాచారం.

 Bigg Boss Telugu 7 12th Week Nominated Contestants List Leaked

శివాజి బ్యాచ్‌కు ఎక్కువ:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లు మొదటి నుంచీ స్నేహంగా ఉంటున్నారు. వీళ్లు ముగ్గురికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అయితే, ఈ సీజన్‌లో ఈ ముగ్గురు కంటెస్టెంట్ కలిసి ఒకేసారి నామినేట్ అయిన సందర్భం లేదు. కానీ, పన్నెండో వారంలో మాత్రం శివాజి, ప్రిన్స్, ప్రశాంత్ నామినేషన్‌లోకి రావడం ఓటింగ్‌పై ప్రభావం చూపనుంది.

ఆమెకు ఓటు పడినా సేఫ్:పన్నెండో వారానికి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ప్రియాంక కెప్టెన్ కావడంతో అతడికి ఓట్లు వేయకూడదు. అయితే, శోభా శెట్టికి కూడా ఒకరు నామినేట్ చేశారు. కానీ, ఒక్క ఓటును పరిగణలోకి తీసుకోని బిగ్ బాస్.. అతడు నామినేట్ అయినట్లు ప్రకటించలేదని తెలిసింది. మొత్తానికి ఈ వారం టాప్ ప్లేయర్లు నామినేషన్స్‌లో ఉండడంతో ఓటింగ్ రసవత్తరంగా జరగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X