Bigg Boss Telugu 7: 14వ వారం షాకింగ్ నామినేషన్స్... ఆ ఒక్కరు తప్ప అంతా నామినేషన్స్‌లోకి వచ్చేశారుగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కాని అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని విధంగా టీఆర్పీని సొంతం చేసుకుంటూ బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ కిక్కిస్తోంది. ముఖ్యంగా రాత్రి 9 గంటలు అయిందంటే చాలు అందరూ టీవీల ముందు వాలిపోయేలా చేస్తోంది. ఎప్పుడూ వచ్చే సీజన్ల కంటే కూడా ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతోంది. మొదటి వారం 14 మంది కంటెస్టెంట్లు ఇంట్లో అడుగు పెట్టారు. నాలుగు వారాల పాటు నలుగురిని ఎలిమినేట్ చేశారు.

ఆ తర్వాత గౌతమ్ ఎలిమినేట్ అవుతున్నట్లుగా చెప్పి అతడిని సీక్రెట్ రూంకు పంపించారు. ఆ తర్వాత ఒక్కరోజులోనే తిరిగి ఇంట్లోకి రప్పించారు. అసలు అతడిని ఎందుకు పంపారో, ఎందుకు తెచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. ఇదిలా ఉండగా... ఐదో వారం ఐదుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను ఇంట్లోకి తీసుకొచ్చారు. అది చాలదు అన్నట్లు గత వారాల్లో నామినేట్ అయిన రితికా రోజ్, శుభ శ్రీ, సింగర్ ధామినిలను స్టేజీపైకి తీసుకొచ్చి ఇంట్లోకి రీఎంట్రీకి ఓటింగ్ పెట్టారు. అందులో అతి తక్కువ ఓట్లు వచ్చిన రతికా రోజ్ ను ఎవరూ ఊహించని విధంగా ఇంట్లోకి పంపారు.

Bigg Boss Telugu 7 14th Week Nominations List Details Leak Check Here

ఇలా ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు ఇస్తూ షోను మరింత రసవత్తరంగా మలుస్తున్నారు. అలాగే అదిరిపోయే టాస్క్ లు ఇస్తూ ఫుల్లుగా కంటెస్టెంట్లతో ఆడుకుంటున్నారు. కేవలం వీకెండ్స్, నామినేషన్స్ టాస్క్ లను మాత్రమే చూసే బుల్లితెర ప్రేక్షకులు.. ప్రితిరోజూ ఎపిసోడ్ చూసేలా చేస్తున్నారు. ఇప్పటికే 13 వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. 14వ వారంలోకి అడుగు పెట్టింది. ముఖ్యంగా 13వ వారం ఎవరూ ఊహించని విధంగా గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. అలాగే 14వ వారం కోసం నామినేషన్స్ కూడా నిర్వహించేశారు.

అయితే 14వ వారం నామినేషన్స్ కు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నామినేషన్స్ లోకి వచ్చిన వాళ్ల లిస్టు లీకైంది. అయితే ఈ వారం ఎలిమినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 14వ వారం నామినేషన్స్ లో.. శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్ లు ఉన్నారట. ముఖ్యంగా ఈవారం ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచిన అంబటి అర్జున్ ఎలిమినేషన్స్ లోకి రాలేదట. ఆయన తప్ప మిగతా ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారట.

చక్కగా గేమ్ ఆడి.. ఎవరి సాయం లేకుండా ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో.. ఆయనను ఏ ఒక్కరూ నామినేట్ చేయలేదట. అలాగే బిగ్ బాస్ కూడా ముందుగానే ఆయన్ను ఎవరూ నామినేట్ చేయొద్దని చెప్పారట. ఇలా సేవ్ అయిన ఈయన ఒక్కడే టాప్ లోకి వెళ్తున్నాడు. మిగతా హౌస్ మేట్స్ అంతా ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. చూడాలి మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవాతరనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X