Bigg Boss Telugu 7: 4వ వారం నామినేషన్ లిస్టు ఇదే.. ఎలిమినేట్ అయ్యేది ఊహించని కంటెస్టెంట్

బిగ్ బాస్ సీజన్ 7 ఈ సారి కాస్త డిఫరెంటుగానే ఉంది. బిగ్ బాస్ హౌజ్ లోకి మామూలుగా 20 మంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్తారు. ఈసారి మాత్రం కేవలం 14 మంది కంటెస్టెంట్స్ లోపలకి వెళ్లారు. ఇక అందులో ముగ్గురు ఎలిమినేట్ అవ్వగా మిగిలింది కేవలం 11 మంది కంటెస్టెంట్స్. ఇక 4వ వారం దగ్గరకు వచ్చింది. ఇక నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో నుంచి ఎలిమినేట్ అయ్యేది మాత్రం ఊహించని కంటెస్టెంట్ అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇక ప్రేక్షకులు ఈ సీజన్ ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈసారి ఉల్టా పుల్టా అంటూ గేమ్ అంతా కొత్తగా నిర్వహిస్తున్నారు. నామినేషన్స్ సైతం ఆసక్తిగా సాగుతున్నాయి. ఇక మూడు వారాలు కంప్లీట్ చేసుకుని.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నాలుగవ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి.

Bigg Boss Telugu 7 4th Week Nominations contestants List and Elimination Full Details Here

గత వారంతో పొలిస్తే... ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి. నామినేషన్స్ ప్రక్రియకు ముందే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో రతిక అయితే హౌజ్ లో గొడవలు పెట్టుకునే కార్యక్రమంలో మునిగిపోయింది. ఇప్పటికే తను ప్రశాంత్, యావర్ లతో లవ్ ట్రాక్ నడిపి... ఇప్పుడు కాస్త వారికి బ్రేక్ ఇచ్చి సీరియల్ బ్యాచ్ తో తిరుగుతుంది. ఇక ఆ సీరియల్ బ్యాచ్ సైతం రతికను రెచ్చగొట్టే పనిలో పడిపోయారు.

ఇక హౌజ్ లో 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అవ్వగా... మిగిలింది 11 మంది కంటెస్టెంట్స్. ఇక వీరిలో పవర్ అస్త్ర సాధించుకుని ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి హౌజ్ మేట్స్ గా గుర్తింపు పొందారు. ఇక మిగిలిన 8 మంది కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్ లో పాల్గొన్నారు.

Bigg Boss Telugu 7 4th Week Nominations contestants List and Elimination Full Details Here

ఇక ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు నామినేట్ అయ్యారని తెలుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో ముగ్గురు అవ్వగా... తాజాగా అందుతున్న బిగ్ బాస్ వర్గాల సమాచారం మేరకు మరో ముగ్గురు కూడా అయ్యారని తెలుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో సందీప్, శివాజీ, శోభా శెట్టి... నామినేషన్స్ ప్రక్రియలో జడ్జిలుగా వ్యవహరించారు. కంటెస్టెంట్స్ అంతా వారు నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరినీ బోణులో నిలబెట్టి దానికి తగిన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడు జడ్జిలుగా ఉన్న వీరు... నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు కంటెస్టెంట్స్‌లో ఎవరిని నామినేట్ చేయాలి అని నిర్ణయిస్తారని డిసైడ్ చేశారు.

Bigg Boss Telugu 7 4th Week Nominations contestants List and Elimination Full Details Here

ఇక నిన్నడి ఎపిసోడ్ లో గౌతమ్, ప్రిన్స్, శుభ శ్రీ నామినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ వర్గాల సమాచారం మేరకు తేజ, రతిక, ప్రియాంక సైతం నామినేషన్స్ లో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. ఇక వీరిలో నుంచి ఎలిమినేట్ అయ్యేది మాత్రం టేస్టి తేజ అంటున్నారు. దానికి కారణం ఆయనకు తక్కువగా ఓటింగ్ నమోదు అవుతోంది. ఇక మరో సమాచారం ఏంటంటే... ఈ వారం ఎలిమినేషన్స్ ఉండవని బిగ్ బాస్ ఇన్ సైడ్ వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X