Bigg Boss Telugu 7 9th Week Elimination క్రేజీగా ఓటింగ్.. డేంజర్ జోన్‌లో టాప్ లేడి కంటెస్టెంట్!
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో 9వ వారంలోకి ప్రవేశించింది. గత ఎనిమిది వారాలుగా ట్విస్టులు, టర్నులు, ఉల్టాపుల్టా వ్యవహారాలతో అభిమానులకు వినోదాన్ని పంచుతున్నది. అయితే తొమ్మిదో వారం ఎలిమినేషన్ కోసం ఇంటిలో నామినేషన్ల ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య జరిగింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది? నామినేషన్‌లోకి ఎవరు వచ్చారంటే?
గత ఎనిమిది వారాలుగా ఎలిమినేషన్‌లో మూస ధోరణికి బిగ్‌బాస్ స్వస్తి పలికాడు. గత 8 వారాల్లో మొత్తం 7 గురు లేడీ కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఫ్యాన్స్‌కు అనుమానం వచ్చింది. అయితే తాజాగా ఈ సీజన్‌లో తొలిసారి మేల్ కంటెస్టెంట్‌ను ఇంటికి పంపించి అనుమానాలకు తెరదించారు.

బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటి నుంచి ఆట సందీప్ ఎలిమినేట్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావించిన ఆయన ఎలిమినేట్ కావడం ప్రేక్షకులకు షాక్ తగిలింది. అయితే సందీప్ ఎలిమినేషన్ తర్వాత ఇంటిలో ఇతర కంటెస్టెంట్లు కూడా రియలైజ్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో నామినేషన్ ప్రక్రియ ఘాటుగా జరిగింది.
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 9వ వారం నామినేషన్ ప్రక్రియ ఎప్పటిలానే వాడీవేడిగా జరిగింది. రతిక, ప్రియాంక జైన్ మధ్య, అమర్ దీప్, భోలే షవాలే మధ్య గట్టిగా వాగ్వాదం జరిగింది. అలాగే శివాజీ, ఇతర కంటెంస్టెంట్ల మధ్య ఆరోపణలు, పత్యారోపణలు చోటుచేసుకొన్నాయి. ఈ క్రమంలో నామినేషన్లు ఆసక్తికరంగా మారాయి.

బిగ్‌బాస్ తెలుగు 7 షో 9వ వారంలో నామినేషన్లు ముగిసిన తర్వాత నామినేట్ అయిన వారి జాబితా ఇలా ఉంది. ఈ వారం ఎలిమినేషన్ కోసం 8 మంది నామినేట్ అయ్యారు. ప్రిన్స్ యావర్, భోలే షవాలే, అమర్ దీప్, రతిక రోజ్, అంబటి అర్జున్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, టేస్టీ తేజ నామినేట్ అయ్యారు. అయితే బిగ్‌బాస్ మాత్రం నామినేషన్లను అధికారికంగా ప్రకటించలేదనేది గమనార్హం.
నామినేషన్ ప్రక్రియ తర్వాత గూగూల్ సర్వేలో ఓటింగ్ రంజుగా ప్రారంభమైంది. ఈ సర్వేలో అత్యధికంగా ప్రిన్స్ యావర్ 27 శాతం ఓట్లు, భోలే షవాలే 20 శాతం, అమర్ దీప్ 17 శాతం ఓట్లు సాధించారు. అంబటి అర్జున్ 9 శాతం, ప్రియాంక జైన్ 7 శాతం, శోభా శెట్టి 5 శాతం, టేస్టీ తేజ 4 శాతం ఓట్లు సాధించారు.

అయితే బిగ్‌బాస్ తెలుగు 7 షో ముగింపు దశకు చేరుకొన్న క్రమంలో టాప్ కంటెస్టెంట్లపై ఎలిమినేషన్ వేటు పడుతున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ కోసం ఇంటి నుంచి అర్హత లేని జాబితాలో శోభాశెట్టి, టేస్టీ తేజా ఉన్నారు. శోభా శెట్టి, టేస్టీ తేజా ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











