Bigg Boss Telugu 7: కర్మ హిట్స్ బ్యాక్.. తేజ ఎలిమినేషన్‌పై మాజీ కంటెస్టెంట్ సంచలన పోస్టు

బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ఇక 9వ వారం ఎలిమినేషన్ కూడా అయిపోయిందని తెలుస్తోంది. ఇక ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారని సమాచారం. ఈరోజు ఎపిసోడ్ లో ఆయన ఎలిమినేట్ కానున్నాడు. ఇక తేజ.. ఆట సందీప్ ను నామినేట్ చేసి బయటకు పంపించేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య తేజపై ఆట సందీప్ ఫైర్ కూడా అయ్యారు. ఇక ఇదిలా ఉండగా.. తేజ ఎలిమినేషన్ పై మాజీ కంటెస్టెంట్ ఆట సందీప్ సంచలన పోస్టులు పెడుతున్నాడు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. ఇక చివరి దశకు చేరుకున్న ఈ ప్రోగ్రామ్.. ప్రేక్షకులను మరింత అలరిస్తూ వస్తుంది. ఇక చివరి దశకు చేరుకోబోతుంది ఈ షో. ఇక ఇప్పటికే ఈ షో నుంచి కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతికా రోజ్, శుభ శ్రీ రాయగురు, నయని పవని, పూజా మూర్తి, ఆట సందీప్ ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వనున్నారు.

Bigg Boss Telugu 7 Aata Sandeep Sansational Post on Teja Elimination Goes Viral

ఇక హౌస్ లో ఉండేది కేవలం 10 మంది మాత్రమే. రతికా రీ ఎంట్రీతో హౌస్ లో రతికా రోజ్, యావర్, ప్రశాంత్, శివాజీ, గౌతమ్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభా శెట్టి, బోలే షవాలి, అశ్వినీ శ్రీలు ఉంటారు. ఇక ఈ వారం తేజ ఎలిమినేట్ కానుండగా.. తేజ గురించి ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిిసందే. ఆయన ఎవరిని నామినేట్ చేస్తే.. వారు ఎలిమినేట్ అవుతారంటూ నెట్టింట వైరల్ అయింది.

ఇక ఆట సందీప్ విషయంలో కూడా.. ఆయన గత 7 వారాలుగా నామినేషన్స్ లో లేకుండా వస్తున్నాడు. ఇక తేజ.. సందీప్ ను నామినేట్ చేస్తూ.. నామినేషన్స్ లోకి వస్తేనే.. కన్ఫిడెంట్ పెరుగుతుంది.. ఆత్మ విశ్వాసం పెరుగుతుందంటూ నామినేట్ చేశాడు. ఇక ఇటీవల నామినేషన్స్ లో సందీప్ కావాలనే తనకు చెప్పి నామినేట్ చేయించుకున్నాడు అంటూ తేజ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆట సందీప్ కూడా దీనిపై స్పందించాడు.

Bigg Boss Telugu 7 Aata Sandeep Sansational Post on Teja Elimination Goes Viral

నేను ఎందుకు చెప్తాను.. ఆయన హౌస్ లో లేని వ్యక్తి గురించి తప్పుగా స్ప్రేడ్ చేయడం తప్పు. ఎందుకు అలా చెప్పాడో తెలియదు.. తేజ బయటకు వస్తే కానీ అసలు విషయం తెలియదు... అంటూ ఆట సందీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చాడు. ఇక వీరి మధ్య ఈ మాటలు వైరంలా సాగాయి. తేజ పీఆర్ టీమ్స్.. సందీప్ వీడియోలు వైరల్ చేస్తూ. ఆయనకు సరిగ్గా మాట్లడం రాదు.. గుర్తుండదు అనేలా వీడియోలు వైరల్ చేశారు.

Bigg Boss Telugu 7 Aata Sandeep Sansational Post on Teja Elimination Goes Viral

ఇక ఇదిలా ఉండగా... తేజ ఎలిమినేట్ అయినట్లుగా ప్రచారం జరుగుతుండడంతో సందీప్ మాస్టర్ తన ఇన్ స్టాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు. తేజ ఎలిమినేటెడ్ అంటూ ఓ మీమ్ పేజీని షేర్ చేస్తూ.. 'అందర్ని ఎలిమినేట్ చేస్తూ తనే ఎలిమినేట్ అయ్యాడు. పాజిటివ్ వైబ్స్' అంటూ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ లో రాసుకువచ్చాడు. ఇక కర్మ హిట్స్ బ్యాక్.. గతవారం మంచి ప్లేయర్ నీవల్ల ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు నీవంతు తేజ " అంటూ స్టోరీలో సందీప్ రాసుకువచ్చాడు. ప్రస్తుతం సందీప్ ఇన్ స్టా స్టోరీస్ నెట్టింట వైరలవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X