Bigg Boss Telugu 7: నాగార్జున బిగ్ బాస్ షోను రోజూ చూస్తారా?, ముక్కుసూటిగా నిజం చెప్పిన కింగ్!
తెలుగు బిగ్‌బాస్ ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రియాల్టీ షో వచ్చి ఏడేళ్లు పూర్తవుతోంది. ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ, ఏటికేడు కొత్తదనంతో దూసుకుపోతోంది బిగ్‌బాస్ షో. గత ఐదు సీజన్ల నుంచి తెలుగు బిగ్‌బాస్ కు అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తొలి బిగ్‌బాస్ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత నాని ఆ ప్లేస్ లోకి వచ్చారు. ఈ యంగ్ హీరోలిద్దరూ కేవలం ఒక్కో సీజన్‌కు మాత్రమే హోస్ట్‌గా చేశారు. ఆ తర్వాత బిగ్‌బాస్‌కు హోస్ట్ గా వచ్చారు అక్కినేని నాగార్జున.
మూడో సీజన్ నుంచి ప్రస్తుతం వస్తున్న ఏడో సీజన్ వరకు నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఒక రకంగా బిగ్‌బాస్ రియాల్టీ షోను నాగ్ తన భుజాలకెత్తుకున్నారు అనే చెప్పాలి. వారమంతా ఎలాగోలా గోలగోలగా నడిచినా.. అందరూ ఎదురుచూసేది వీకెండ్ మస్తీ కోసమే. శని, ఆది వారాల్లో నాగార్జున వచ్చి బిగ్‌బాస్ ను షో మరో రేంజ్‌కు తీసుకెళ్తారు. తప్పు చేసిన కంటెస్టెంట్ల తాట తీస్తారు. తన కమాండింగ్‌తో హౌజ్‌మేట్స్ తో ఆటాడుకుంటారు. మంచి చేసిన వారిని మంచి చేశారని, చాలా బాగా ఆడారని ప్రోత్సహిస్తూనే.. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా చీటింగ్ చేసే కంటెస్టెంట్లను ఉతికారేస్తారు. అందుకే శని, ఆది వారాల్లో వచ్చే బిగ్‌బాస్‌ను ఎక్కువ మంది చూడటానికి ఇష్టపడతారు.

ఎలాంటి షో అయినా హోస్ట్‌గా వ్యవహరించడం అంటే కొద్దిగా సవాల్‌గానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే హోస్ట్ హుషారు, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, అందర్నీ కోఆర్డినేట్ చేసుకుని ఆ షోను నడిపించేది హోస్టే కాబట్టి.. హోస్ట్ చేసే వ్యక్తి చాలా కీలకం. బిగ్‌బాస్ విషయానికి వస్తే.. ఇదో రియాల్టీ షో కాబట్టి, ఇలాంటి షోకు హోస్ట్‌గా చేయడం మరింత సవాల్ అనే చెప్పాలి. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండే కంటెస్టెంట్లను ఎప్పటికప్పుడు గమనించడం, వారిని సరైన దారిలో పెట్టి వారి నుంచి ఔట్‌పుట్ తీసుకోవడం, వారి తప్పొప్పులను బేరీజు వేస్తూ.. ప్రోత్సహించడం, దండించడం చేస్తూ ఉండాలి. ఈ సమయంలో హోస్ట్ తీసుకునే నిర్ణయాలు, చేసే చర్యలు, హావభావాలు, పదాల వాడకం అన్నీ ఆకర్షణీయంగా ఉంటూ షోపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేయాలి. ఎవరికీ సపోర్ట్ చేయకుండా న్యూట్రల్‌గా ఉంటూ షోను ముందుకు నడిపించాలి. ఈ అన్ని అంశాల్లో నాగార్జున పర్‌ఫెక్ట్ గా చేస్తున్నారు కాబట్టే.. ఇన్నేళ్లుగా హోస్ట్ గా కొనసాగుతున్నారు.
కంటెస్టెంట్లు ఎలా ఆడుతున్నారు, ఎలాంటి వాటికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు, తోటి కంటెస్టెంట్లతో ఎలా ఉంటున్నారు లాంటివన్నీ గమనిస్తూ ఉంటేనే హోస్ట్‌గా సరిగ్గా వ్యవహరించవచ్చు. నాగార్జున వచ్చే ఎపిసోడ్లలో.. కంటెస్టెంట్లు ఏమేం చేశారు, ఎప్పుడు ఎలా ఉన్నారు, ఎలా ఆడారు లాంటివన్నీ ప్రస్తావిస్తూ తన గేమ్ ఎలా ఇంప్రూవ్ కావాలో సజెషన్స్ ఇస్తుండటం చాలా మంది చూసే ఉంటారు. రోజూ బిగ్‌బాస్ ఫాలో అయ్యే వారికి కూడా తెలియని విషయాలను నాగార్జున ప్రస్తావిస్తుంటారు. ఇదెప్పుడు జరిగింది, నేను చూడలేదే అని ప్రేక్షకులు సందేహిస్తుంటారు కొన్ని సందర్భాల్లో. నాగార్జున బిగ్‌బాస్ అన్ని ఎపిసోడ్లు చూస్తారా అని చాలా మందికి సందేహం రావొచ్చు. దీనిపై నాగార్జున తాజాగా క్లారిటీ ఇచ్చారు.

'బిగ్‌బాస్ షోలో ప్రతి ఒక్కటీ నోటీస్ చేయాలి. వీక్ మొత్తం బిగ్‌బాస్ ఫాలో కాకపోతే.. హోస్టింగ్ చేయడం చాలా కష్టం. అందుకే రోజూ ఉదయం హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్ ఎపిసోడ్స్ చూస్తాను. రాత్రి ఏం జరిగిందో కూడా తెలుసుకుంటా. ప్రేక్షకులు చూడనివి కూడా చూస్తుంటాను. బిగ్‌బాస్ ఎపిసోడ్లలో హౌజ్‌లో జరిగే చాలా విషయాలు చూపించరు. వీకెండ్ ఎపిసోడ్ కు ముందు ఆ వారం హైలెట్స్ అన్నీ మరోసారి ప్రత్యేకంగా చూపిస్తారు. హోస్టింగ్‌కు ముందు కూడా హైలెట్స్ చూసిన తర్వాతే హోస్ట్ చేస్తాను. బిగ్‌బాస్ మంచి అనుభవం. బిగ్‌బాస్ హౌజ్‌లో కొన్ని రోజులు నటించినా, ఆ తర్వాత తమ ఒరిజినాలిటీ బయటపెడతారు. ఎంత చక్కగా ఉన్నారు అనుకున్న వారంతా.. ఆ తర్వాత మారిపోవడం చూస్తుంటా. ఇదో కొత్త ఎక్స్‌పీరియన్స్ నాకు' అని నాగార్జున పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











