Bigg Boss Telugu 7: యమా క్రేజీగా బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ, హీటెకెక్కిస్తున్న కంటెస్టెంట్ల మాటల యుద్ధం
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 2.0 వర్షన్ తో ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారు ఇంట్లోకి వచ్చిన మరుసటి రోజే నామినేష ప్రక్రియ ఉండడం... బిగ్ బాస్ వారికి పవర్స్ కల్పించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని కల్గిస్తోంది. ఆదివారం రోజు కంటెస్టెంట్ల అందరిలోనూ ఫుల్ జోష్ నింపిన బిగ్ బాస్ మరుసటి రోజే అంటే సోమవారమే మంట పెట్టేశాడు. ముందుగా పోటుగాళ్లు నామినేటే చేయాలంటూ తెలిపిన ప్రోమోను ఈరోజు ఉదయం విడుదల చేశారు. తాజాగా మరో ప్రోమోను వదిలి జనాల్లో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో ఇక ఆటగాళ్లు నామినేట్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు. ఈక్రమంలోనే ఆటగాళ్లు.. పోటుగాళ్లలోంచి ఒకర్ని, ఆటగాళ్ల లోనుంచి ఒకర్ని నామినేట్ చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియను ప్రారంభించమని ముందుగా శివాజీని పిలిచాడు. నామినేట్ చేసేందుకు వెళ్లిన శివాజీని చూసి అమర్ దీప్ తల పట్టుకోగా.. కంటెస్టెంట్లు అంతా ఫుల్లుగా నవ్వారు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ... రోజూ బాగానే ఉంటాడు, ఏదైనా గేమ్ వచ్చినప్పుడు మాత్రం అంటూ ఏదో అంటాడు. వీడు ఇప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడంటూ అమర్ దీప్ ఫొటో తీస్తాడు. ఇదంతా చూస్తే శివాజీ అమర్ దీప్ ను నామినేట్ చేశాడని అర్థం అవుతంది.

ఇక ఆ తర్వాత వచ్చిన వచ్చిన టేస్టీ తేజ నయని పావని ని నామినేట్ చేశాడు. తనను నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ నచ్చలేదని.. తేజ ఆమెను నామినేట్ చేశాడు. అది నచ్చని నయని పావని అతడితో గొడవకు దిగింది. వీరిద్దరి మధ్య బాగానే మాటల యుద్ధం సాగినట్లు కనిపిస్తోంది. అలాగే అమర్ దీప్ పూజా మూర్తిని నామినేట్ చేస్తూ... ఆడడానికి వచ్చిన ప్రతీ ఒక్కడూ సెల్ఫిష్ గానే ఉంటాడు, ఉండాలి అని చెప్పాడు. కానీ పూజా మూర్తి మాత్రం అతని మాటలకు ఒప్పుకోలేదు. వీరితో పాటు అంబటి అర్జున్.. అమర్ దీప్ ను నువ్వు ఎవరి మాట వినట్లేదు, అర్థం చేసుకోలేదని అనడం హైలెట్ గా నిలిచింది.
ఆ తర్వాత వచ్చి అశ్విని శ్రీకి.. శోభా శెట్టికి కాసేపు చర్చ సాగింది. ప్రియాంకను నువ్వు మ్యానిపులేట్ చేశావని ఎవరో శోభాకు చెప్పారు. దీనిపై ఆమె గట్టిగానే సీరియస్ అయింది. ఆ తర్వాత నిలబడ్డ ప్రియాంక.. నన్నెవరూ మానిప్యులేట్ చేయలేరని చెప్పుకొచ్చింది. ఇక ప్రోమో చివర్లో ఆశ్విని గుక్కపెట్టి ఏడ్చింది. బిగ్ బాస్ నన్ను నామినేట్ చేయండి, ఇంటికి పంపించేసేయండి అంటూ కన్నీరు కార్చింది. ఐ వాంట్ టు గో హోమ్ అంటూ తెలిపింది. పక్కనే ఉన్న పూజా మూర్తి ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత టేస్టీ తేజ రావడం ప్రోమోలో చూడవచ్చు.
ఫైనల్ గా ఏమయింది, ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలిపి ఇంట్లో మొత్తం 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారంతా కన్ఫర్మ్ హౌజ్ మేట్స్ అని క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇప్పటి నుంచి హోస్ట్ ఆఫ్ బెడ్స్ యే... ఎవరు ఎక్కడ పడుకోవాలో నిర్ణయిస్తారు. ఈరోజు ఎపిసోడ్ పూర్తిగా చూస్తే తప్ప ఎవరి మనసులో ఏముంది, ఎవరికి ఎవరిపై కోపం ఉందో కొంచెం అర్థం అవుతుంది.


Click it and Unblock the Notifications











