Bigg Boss Telugu 7: రైతుబిడ్డతో ఉంటే అమర్ దీప్ గెలుపు ఖాయం.. నాగార్జున అదే ప్రూవ్ చేశాడుగా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. అదిరిపోయే టాస్కులు, అంతకు మించిన ఎమోషన్లతో షోను చాలా ఆసక్తిగా మలుస్తున్నారు బిగ్ బాస్. అయితే నామినేషన్లతో పాటు వీకెండ్స్ వచ్చే ఎపిసోడ్లు ఎవర్ గ్రీన్. వారం మొత్తం ఎపిసోడ్ లు చూసిన చూడకపోయినా చాలా మంది నామినేషన్లు, ఎలిమినేషన్లను చూస్తుంటారు. అయితే ఈరోజు ఆదివారం కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు. అందులో ఓ అద్భుతమైన దృష్యాన్ని మనం ఈ రోజు చూడొచ్చు.
అదేంటీ అనుకుంటున్నారా... నేరుగా నాగార్జున కనిపించడంతో ప్రోమో ప్రారంభం అయింది. ఈరోజు నేను మీకు ఇచ్చే టాస్కు... డైలాగ్ కొట్టు గురూ అని టాస్కు ఇచ్చాడు నాగార్జున. ముందుగా ఏం టీంని పిలిస్తే ఈ టీం నుంచి ఓ వ్యక్తి వచ్చి హెడ్ సెట్ పెట్టుకోవాలి. అదే టీం నుంచి మరో వ్యక్తి వచ్చి ఓ డైలాగ్ చెప్పాలి. అయితే వీళ్లు చెప్పే డైలాగ్ ను హెడ్ సెట్ పెట్టుకున్న వాళ్లు కెర్టుగా చెప్పగలగాలి. ఇది టాస్కు. అయితే ఇందులో నాగార్జున ముందుగా అమర్ దీప్ ను, పల్లవి ప్రశాంత్ ను కలిపి పిలిశాడు. పల్లవి ప్రశాంత్ హెడ్ సెట్ పెట్టుకోగా.. అమర్ దీప్ ఓ చీటీని తీసుకున్నాడు.

అందులో మేడం సార్ మేడం అంతే అనే డైలాగ్ రాసి ఉంది. దాన్ని అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ కు అర్థం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న ఆడ వాళ్లను చూపిస్తూ డైలాగ్ ను తెలిపాడు. దీన్ని పల్లవి ప్రశాంత్ కరెక్టుగా గెస్ చేసి చెప్పాడు. మేడం సార్ మేడం అంతే అంటూ చెప్పి వీరిద్దరూ ఈ టాస్కులో గెలిచారు. దీన్నింతటినీ చూస్తుంటే అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ లు కలిసి ఏదైనా గేమ్ ఆడితే.. ముఖ్యంగా అమర్ దీప్, రైతుబిడ్డ వెంట ఉండే ఏ గేమ్ అయినా గెలుస్తాడని అంతా అనుకుంటున్నారు. కామెంట్లు రూపంలో ఇదే విషయాన్ని చెబుతున్నారు.
పల్లవి ప్రశాంత్ తో ఉన్న ఎవరైనా సరే గేములో కచ్చితంగా గెలుస్తారని... ఏమీ తెలియని, సరిగ్గా గేమ్స్ ఆడని అమర్ దీప్ కూడా గేమ్ గెలిశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ మీద కోపం, కసితో నీ గేమ్ ను కూడా నీవు సరిగ్గా ఆడలేకపోతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతుబిడ్డ ఫ్యాన్స్. మరోవైపు ఈ ఫన్నీ టాస్కు చాలా సరదాగా సాగింది. వీరిద్దరి తర్వాత వచ్చిన టేస్టీ తేజ, అశ్వినీ శ్రీలు రాములో రాములా సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ముఖ్యంగా తేజ అయితే చాలా కామెడీగా డ్యాన్స్ చేశాడు. అది చూసిన నాగార్జున.. పిడకలేశావా తేజ అంటూ ఏడిపించారు.

ఇక ఆ తర్వాత యావర్, శోభాశెట్టి రాగా.. యావర్ డైలాగ్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. ఓవైపు శోభా నోటికొచ్చినట్లు వాగుతూనే ఉంది. ఇదంతా చూసిన నాగార్జున.. శివాజి ఈరోజు అంతా వీళ్లకు టైమ్ ఇచ్చినా ఇది పూర్తి కాదంటూ చెబుతాడు. ఇక అనంతరం వచ్చిన రతికా, టేస్టీ తేజలు కూడా చాలా కామెడీ చేశారు. ఆ తర్వాత ప్రియాంక జైన్.. ఈ క్వశ్చన్ నిజంగానే నన్ను అడుగుతున్నావా రాధికా అనే డైలాగ్ చెబుతుంది. రాధికా పేరు తప్ప అన్ని కరెక్టుగా చెప్పిన సందీప్ మాస్టర్... రాధికకు బదులుగా తాతయ్యా అంటాడు. ఇలా ఈ ఫన్నీ టాస్కు చాలా సరదాగా సాగింది.


Click it and Unblock the Notifications











