Bigg Boss Telugu 7 Winner కప్ కంటే ముందే విలువైన ఆఫర్ కొట్టేసిన అమర్ దీప్.. ఏంటో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టాపుల్టా.. ఈరోజుతో ముగియనుంది. డిసెంబరు 17, రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలేలో విజేత ఎవరో తెలిసిపోనుంది. ఇప్పటికే ఫైనాలిస్టులుగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో నుంచి నలుగురు ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఇక తాజా సమాచారం మేరకు అమర్ దీప్, ప్రశాంత్ వీరు ఇద్దరిలో ఎవరో ఒకరు కప్ కొట్టి విన్నర్ గా నిలవనున్నారు. మరొకరు రన్నర్ గా నిలవనున్నారు. ఇదంతా ఓకే కానీ.. అమర్ దీప్ కు ఫినాలే గెలవకముందే బంపర్ ఆఫర్ వచ్చింది. అసలు అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈరోజుతో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. 'బిగ్ బాస్' గ్రాండ్ ఫినాలే ఇప్పటికే కొంత వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో లీకులు సైతం వచ్చాయి. బిగ్ బాస్ 7 షోలో ఇప్పటి వరకు 19 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా.. అందులో ఆరుగురు ఫైనల్స్ కు చేరుకున్నారు. వారిలో ప్రియాంక, యావర్, అమర్ దీప్, ప్రశాంత్, శివాజీ, అర్జున్ అంబటి ఉన్నారు.

అయితే నిన్న జరిగిన షూటింగ్ లో ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. వారిలో మొదట అర్జున్ అంబటి ఎలిమినేట్ అవ్వగా.. ఆ తర్వాత ప్రియాంక టాప్ 5 స్థానంలో ఎలిమినేట్ అయింది. ఇక ఆ తర్వాత సూట్ కేస్ ఆఫర్ తో హౌస్ నుంచి యావర్ బయటకు వచ్చేశాడు. చివరిగా శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఉండగా... వారిలోంచి శివాజీ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఇక విన్నర్ రేసులో ప్రశాంత్, అమర్ దీప్ మిగిలారు.
ఇదిలా ఉంటే అమర్ దీప్ కప్ కొట్టక ముందే ఓ బంపర్ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది. అమర్ దీప్ కు మాస్ మహారాజ్ రవితేజ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన్నీ ఎన్నో సార్లు తన అభిమాన హీరో అంటూ బిగ్ బాస్ రాకముందే నుంచే చెప్పుకువచ్చాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా చాలా సార్లు రవితేజ డై హార్ట్ ఫ్యాన్ అంటూ వెల్లడించారు.

అంతే కాదు.. బిగ్ బాస్ హౌస్ లో పోలీస్ గెటప్ వేసి.. రవితేజను ఆ మార్క్ కామెడీ పండించాడు. అయితే ఈరోజు ఫినాలేలో రవితేజ ఈగల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ షోలో పాల్గొన్నాడు. మాస్ మహారాజా రవితేజ సంక్రాంతికి విడుదల చేయనున్న తన 'ఈగల్' చిత్రాన్ని 'బిగ్ బాస్ 7' ఫినాలేలో ప్రమోట్ చేశాడు. ఇక రవితేజ రాగానే అమర్ దీప్ ఎగిరి గంతేశాడు. అమర్ దీప్ ఇప్పుడే నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే రవితేజ సినిమాలో ఛాన్స్ లభిస్తుందని నాగార్జున అమర్ దీప్ కు ఆఫర్ ఇచ్చాడు.
అయితే అమర్ దీప్ క్షణం ఆలోచించకుండా బయటకు వచ్చేందుకు రెడీ అయిపోతాడు. అయితే అమర్ దీప్.. రవితేజ పట్ల ఉన్న గౌరవం చూసి.. అందరూ షాక్ అవుతారు. ఇక తాజా సమాచారం ప్రకారం అమర్ దీప్ బయటకు రాలేదని తెలుస్తోంది. అంతే కాదు రవితేజ నెక్ట్స్ మూవీలో కూడా అమర్ దీప్ కు ఛాన్స్ ఇచ్చారట. దీంతో కప్ కొట్టకముందే బంపర్ ఆఫర్ కొట్టేశాడు అమర్ దీప్. ఈ న్యూస్ తెలుసుకున్న అమర్ ఫ్యాన్స్ పుల్ ఖుషి అవుతున్నారు. మరి టైటిల్ విన్నర్ అవుతాడో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











