Bigg Boss 7: జబర్దస్త్ యాంకర్ కు ఆఫర్.. రెమ్యునరేషన్ లో శ్రీముఖి రికార్డ్ బ్రేక్ అయ్యేలా?
బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ నుంచి చూసుకుంటే మెల్లమెల్లగా రేటింగ్ స్థాయి పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా నాగర్జున వరుసగా నాలుగు సీజర్లతో చాలా బాగా హోస్ట్ గా చేసి నడిపించారు అయితే ఇప్పుడు ఏడవ సీజన్ కోసం ఎవరు హోస్ట్ గా వస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఇప్పుడు హోస్ట్ కంటే ముందు కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లుగా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఒక జబర్దస్త్ యాంకర్ కు ఆఫర్ రావడంతో ఆమె ఊహించని స్థాయిలో ర్రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ 7వ సీజన్
ఇటీవల కాలంలో బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకోవాలి అని చాలామంది సెలబ్రిటీలు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా టెలివిజన్ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే వారి స్థాయిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్న యాంకర్స్ తో పాటు కమెడియన్స్ సీరియల్ యాక్టర్స్ అందరూ కూడా బ్ఇగ్ బాస్ లో తదుపరి సీజన్ లో అవకాశం అందుకోవాలని స్టార్ మా ప్రతినిధులను సంప్రదిస్తున్నారు.
ఇప్పటికే కొంతమందిని బిగ్ బాస్ నిర్వాహకులు ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక పరిస్థితులను బట్టి అంతా సెట్టయితే 7వ సీజన్ ను సమ్మర్ లో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

మళ్ళీ పొరపాటు జరగకుండా..
ముఖ్యంగా 6వ సీజన్లో చేసిన పొరపాట్లు మాత్రం ఈసారి ఏడవ సీజన్లో చేయకూడదు అని కూడా నిర్వాహకులు డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఎవరిని తీసుకువచ్చిన షోను జనాలు చూస్తారు అని ఆలోచించిన బిగ్ బాస్ నిర్వాహకులు 6వ సీజన్ తో గట్టి దెబ్బలు ఎదుర్కొన్నాడు. అసలు రేటింగ్స్ రాకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పెద్దగా పేరు ఉన్న సెలబ్రిటీలు రాకపోవడంతో జనాలు బిగ్ బాస్ 6వ సీజన్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.

జబర్దస్త్ యాంకర్ కోసం..
అందుకే ఈసారి కాస్త పేరు ఉన్న యాంకర్స్ తో పాటు సినిమా యాక్టర్స్ ను అలాగే సినిమా టెక్నీషియన్స్ ను తీసుకురావాలి అని అనుకుంటున్నారు. ఇక అందులో జబర్దస్త్ యాంకర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్మి గౌతమ్ ను తీసుకురావాలి అని అనుకుంటున్నారు. రష్మీ ప్రస్తుతం కొన్ని రియాల్టీ షోలకు యాంకర్ గా ఉన్న విషయం తెలిసిందే. అలాగే కొన్ని చిన్న సినిమాలలో కూడా నటిస్తోంది.

శ్రీముఖి కంటే ఎక్కువ డిమాండ్
అయితే యాంకర్ రష్మీకి ఒక ఆఫర్ చేయడంతో ఆమె మాత్రం ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధికంగా శ్రీముఖి ఒక వారానికి దాదాపు 5 లక్షలకి పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో యాంకర్ రష్మి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె ఒక వారానికి దాదాపు ఏడు నుంచి 8 లక్షల వరకు కావాలి అని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది.

అలా అయితే కోటికి పైనే..?
యాంకర్ రష్మీ వారానికి 8 లక్షలు డిమాండ్ చేసి బిగ్ బాస్ కు ఒప్పుకుంటే మాత్రం ఆమె ఫైనల్ ఎపిసోడ్ కు వచ్చేసరికి టోటల్ పేమెంట్ కోటి రూపాయలకు పైగానే వస్తుంది అని చెప్పవచ్చు. నిజానికి బిగ్ బాస్ లో అన్ని రోజులు ఉండాలి అంటే చాలా కష్టమైన పని. ఇక బయట ప్రపంచంలో రష్మీ కూడా ఇప్పుడు టెలివిజన్ షోల ద్వారా గట్టిగా సంపాదిస్తోంది కాబట్టి డిమాండ్ కు తగ్గట్టుగానే అడిగినట్లు తెలుస్తోంది. మరి ఆ ఆఫర్ కు ఆమె చెప్పిన రేటుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఒప్పుకుంటారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











