Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ హౌస్‌లో బహుబలి ఎవరంటే? కంటెస్టెంట్ జాతకాలు బయటపెట్టిన నాగార్జున
బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక మరో వారం రోజుల్లో ఈ షో ముగియనుంది. ఈ వారం శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వనుండగా... టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇక అయితే బిగ్ బాస్ హౌస్ లో బహుబలి ఎవరు... ఏంటి అనేది తాజా ఎపిసోడ్ లో నాగార్జున చెప్పుకువచ్చాడు. ఇక డైరెక్టుగా విన్నర్ అతనే అన్నట్లు హింట్ ఇచ్చాడని తెలుస్తోంది. అసలు బిగ్ బాస్ బౌస్ లో బహుబలి ఎవరు.. మిగతా కంటెస్టెంట్స్ జాతకాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 మరో వారంలో ముగియనుంది. ఇక ఈ సీజన్ విన్నర్ పై స్పష్టత రానుంది. మొదటి నుంచి బిగ్ బాస్ తెలుగు 7ను రసవత్తరంగా సాగిస్తున్నారు మేకర్స్. మొదట 14 మంది కంటెస్టెంట్స్ ను లోపలికి పంపించగా.. ఆ తర్వాత ఐదు వారాలు గడిచాక మరో ఐదుగురిని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపించారు. ఇక అప్పటి నుంచి ఈ రియాలిటీ షో మరింత రంజుగా సాగుతోంది.

ఇక 14వారాలు పూర్తి చేసుకున్న ఈ షో.. తాజాగా ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో నాగార్జున మీమ్స్ వేసి హౌస్ లో నవ్వులు పూయించారు. అయితే ఆ మీమ్స్ ఒకసారి చూస్తే.. ప్రియాంకను మహానటిగా పోల్చారు. ఇక ఆ తర్వాత శోభాశెట్టిని చంద్రముఖితో పోల్చారు. అంటే వీరిలో ఆ సినిమా తాలుకూ వెరియెషన్స్ కనిపిస్తున్నాయని అర్థం అనుకోవచ్చు. వారికి నాగార్జున మీమ్స్ చూపించడంతో.. హౌస్ లో కంటెస్టెంట్స్ అంతా నవ్వుకున్నారు.
ఇక అమర్ దీప్ విషయానికి వస్తే... అతనికి సూర్య నటించిన గజిని పోస్టర్ వేశారు. గజినిలా అమర్ దీప్ ప్రవర్తన ఉంటుందని అలా డిసైడ్ చేశారని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ కు అపరిచితుడు పోస్టర్ వేశారు. ఇక ప్రశాంత్ యాక్టింగ్ లెవెల్స్ అయితే వెరె లెవెల్ అని చెప్పవచ్చు. నామినేషన్స్ లో అపరిచితుడు వస్తాడనే విషయం తెలిసిందే. ఇక నాగార్జున ముందు రాములాగా... హౌస్ లో రతిక ఉన్నప్పుడు రెమో.. నామినేషన్స్ లో అపరిచితుడులా ప్రవర్తిస్తాడు. అందుకే ఆయన్ని అలా పొల్చి ఉండవచ్చు.
ఇక అర్జున్ అంబటికి బహుబలి పోస్టర్ వేశారు. బహుబలి అంటే... ఇంటికి బహుబలి అని వేశారా.. లేదా నాగార్జున.. అర్జున్ బాడీ చూసి ఈ టైటిల్ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. అర్జున్ ను బహుబలితో పోల్చడంతో.. ఇక ఈ సీజన్ విన్నర్ అతనే అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అందుకే ఆ పోస్టర్ వేశారని చెప్తున్నారు. ఇక ఈ ప్రోమోలో శివాజీ, యావర్ పోస్టర్స్ రివిల్ చేయలేదు.
ఇక నాగార్జున వేసిన ఈ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆదివారం ఎపిసోడ్ కు గెస్టుగా ఎంఎం కీరవాణి కూడా హాజరయ్యారు. ఆయన గెస్టుగా వచ్చి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు కానున్నారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











