Priyanka Jain: బిగ్‌బాస్‌లో అలా... బయట ఇలా.. పెళ్లిపై ఇలా షాకిచ్చిందేంటి భయ్యా?

బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా అంటూ ప్రేక్షకులను బాగానే అలరించింది. అయితే అందులో ఫీమేల్ కంటెస్టెంట్స్ లో ఒకరైన అందమైన భామ ప్రియాంక జైన్ ఒకరు. అయితే ఈ భామ.. సీరియల్ యాక్టర్ శివ కుమార్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు 7లో కూడా శివ కుమార్ ఎంట్రీ ఇచ్చి.. పెళ్లెప్పుడు అంటూ రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బయటకు వచ్చాకా వీరి పెళ్లి గురించి నెటిజన్స్ అడిగితే.. మాట మార్చేసింది ఈ బ్యూటీ. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్టార్ మాలో ప్రసారం అయ్యే మౌనరాగం, జానకి కలగనలేదు అనే సీరియల్స్ ద్వారా బుల్లితెర మీద ఎంతో పాపులారిటినీ తెచ్చుకుంది ప్రియాంక జైన్. అయితే ప్రియాంక జైన్ కు ఆ సీరియల్స్ వల్లే బిగ్ బాస్ తెలుగు 7 లో ఛాన్స్ దక్కింది. అలా బిగ్ బాస్ సీజన్ 7 షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. ఇక బీబీ వంటలక్కగా ఇంట్లోని సభ్యులకు తన చేతి వంటను రుచి చూపించి.. అందరి మెప్పు పొందింది.

Bigg Boss Telugu 7 Beauty Priyanka Jain Comments on Marriage With Shiva Kumar News Goes Viral

మొదటి నుంచి సాఫ్ట్ నేచర్ తో హౌస్ లో ఉన్న ప్రియాంక జైన్... ఒకానొక సమయంలో టైటిల్ ఫెవరెట్ గా మారింది. కానీ అమర్,శోభాశెట్టితో ఉన్న స్నేహం కాస్త ఆమెను దెబ్బ కొట్టిందనే చెప్పాలి. బిగ్ బాస్ ఇంట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అబ్బాయిలకు ధీటుగా పోటీ ఇచ్చింది ఈ బ్యూటీ. బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో, ఆటల్లో.. ఆడపులిలా విజృంభించి ఆటను ఓ ఆడేసుకుంది. బిగ్ బాస్ తెలుగు 7 లో టాప్ 5కి వచ్చిన ఏకైక లేడీ కంటెస్టెంట్ గా ప్రియాంక నిలిచింది.

బిగ్ బాస్ తెలుగు 7 లో ఫైనాలిస్టులుగా ఆరుగురు నిలవగా... ఈసారి సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అయిన సంగతి తెలిసిందే. అయితే రన్నరప్ గా అమర్ దీప్ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో శివాజీ, యావర్ ఉండగా.. ప్రియాంక జైన్ ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆరో స్థానంలో అర్జున్ అంబటి నిలిచాడు. అయితే ఇదంతా పక్కన పెడితే ప్రియాంక హౌస్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ వీక్ లో తన ప్రియుడు శివకుమార్ వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu 7 Beauty Priyanka Jain Comments on Marriage With Shiva Kumar News Goes Viral

ఇక వీరి ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారు. ఇక బిగ్ బాస్ ఇంటికి వచ్చిన శివ కుమార్... కిస్సులు, హగ్గులు ఇస్తూ.. ప్రియాంకను పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అంటూ అడిగాడు. హౌస్ లోనే పెళ్లి చేసుకుందాం అంటూ ప్రియాంక చెప్పడం ఆసక్తి కలిగిచింది. అయితే శివకుమార్ మాత్రం నువ్వు బిగ్ బాస్ నుండి రాగానే పెళ్లి చేసుకుందామని చెప్తాడు. అప్పట్లో ఆ వీడియో వైరల్ గా కూడా మారింది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది.

Bigg Boss Telugu 7 Beauty Priyanka Jain Comments on Marriage With Shiva Kumar News Goes Viral

ఇక అలా చాట్ చేస్తున్న సమయంలో ఒక నెటిజన్ మీ పెళ్లెప్పుడు అని ప్రియాంకను అడిగారు. దానికి ప్రియాంక జైన్ ఈ ప్రశ్న మీరు శివని అడగాలి.. నన్ను కాదు... అంటూ సమాధానం ఇచ్చింది. .ఎందుకంటే ప్రస్తుతం నా చేతిలో ఏమీ లేదని షాక్ ఇచ్చింది. మొత్తం శివ చేతుల్లోనే ఉందంటూ తెలిపింది. ఆయన ఎప్పుడు పెళ్లి అంటే అప్పుడే రెడీ అని వివరించింది. అలాగే శివ కూడా జాయిన్ అవ్వచ్చు కదా అని మరో నెటిజన్ ప్రశ్న అడిగితే ప్రస్తుతం శివ షూటింగ్స్ లో ఉన్నాడంటూ చెప్పుకువచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X