Bigg Boss Telugu 7: బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
తెలుగులో ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. అయితే గత వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయి... ప్రస్తుతం 13మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ 13మందిలో శుభ శ్రీ తనదైన శైలిలో ఫెర్మామెన్స్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇంతకీ ఈ శుభ శ్రీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తిగా సాగుతుంది. ఇక రేటింగ్ విషయంలోనూ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఇక ఈ షో ప్రారంభం అయి రెండు వారాలు కావొస్తుంది. ఇక మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు. ఇప్పటికే మొదటివారం పూర్తి అయింది. ఇక సీనియర్ నటి కిరణ్ రాథోడ్ తొలివారమే ఎలిమినేట్ అయింది.

రెండో వారంలో హౌస్ మేట్స్ కు బిగ్ బాస్ కొత్త కొత్త టాస్కులు ఇస్తునే.. షోను ఆసక్తికరంగా సాగిస్తున్నారు. ఇకపోతే హౌస్ లో గ్లామరస్ బ్యూటీల్లో శుభశ్రీ ఒకరు. ఇక ఈ అమ్మడు బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకముందు ఈ బ్యూటీ బుల్లితెరపై, వెండితెరపై అంతగా కనిపించలేదు. కానీ హౌజ్ లోకి ఎంట్రి ఇచ్చిన మొదటి నుంచి ఈ అమ్మడు చాలా తెలివిగా గేమ్ ఆడుతోంది.

హౌస్ మేట్స్ అందరితోనూ దగ్గరవుతూ... నామినేషన్స్ లోకి రాకుండా సేఫ్ గేమ్ అయితే ఆడుతోంది. అలాగే శుభశ్రీ లాయర్ అని నాగార్జున మొదటి రోజే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె గురించి మరెన్నో విస్తుపోయే విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. శుభశ్రీ బ్యాక్ గ్రౌండ్ కూడా పెద్దదేదని నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.
శుభశ్రీ రాయగురు ఒడిశాలో పుట్టిపెరిగింది. ఇక రాయగురు వసంత్ కుమార్, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన శుభశ్రీ.. చిన్నతనం నుంచి చదువుల్లో ముందుండేది. ముంబైలో ఈ భామ ఎల్.ఎల్.బి కోర్స్ పూర్తి చేసింది. అలాగే చదువుకునే రోజుల్లో పలు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ సహా అన్ని ఆటల్లో ముందుండేది. కాలేజీ చదువు పూర్తైన తర్వాత శుభశ్రీ అనూహ్యంగా మోడలింగ్ లో అడుగు పెట్టింది.
2020లో శుభ శ్రీ విఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిషా టైటిల్ ను గెలుచుకుంది. ఆ తరువాత యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి.. దాదాపు 3000 లైవ్ షోలను విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలోనే శుభశ్రీకి నటిగా అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. గత ఏడాది విడుదలైన రుద్రవీణ మూవీతో శుభశ్రీ.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్ మూవీలో పోలీసు అధికారి పాత్రలో నటించింది.

తమిళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది శుభశ్రీ. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ మూవీలో శుభశ్రీ నటిస్తోందని తెలుస్తోంది..అన్నట్లు శ్రీభశ్రీ ఫ్యామిలీలో అందరూ లాయర్లు ఉండటం విశేషం. అయితే శుభశ్రీ మాత్రం ఓవైపు లాయర్ వృత్తిని కొనసాగిస్తూ.. మరోవైపు నటిగా, మోడల్‌గా, డ్యాన్సర్‌గా, యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టి.. మరింత క్రేజ్ కొట్టేసింది ఈ భామ.


Click it and Unblock the Notifications











