హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్‌బాస్ బెస్ట్ సంచాలక్.. పోస్టర్ రిలీజ్‌తోనే ట్రోలింగ్ స్టార్ట్.. ఎందుకంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి అందులో పాల్గొన్న 19 మంది కంటెస్టెంట్లు అందరి గురించి చాలా మందికే తెలిసి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ వారాలు కొనసాగిన కాస్త ఫేమ్ ఉన్న వారకి అయితే బిగ్ బాస్ బాగానే ప్లస్ అయినట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా మొదటి వారంలో హౌస్ లో అడుగు పెట్టిన ఆట సందీప్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ బ్యాచ్ తో కలిసి గేమ్ ఆడిన ఇతడు బయటకు వచ్చిన తర్వాత నుంచి బాగానే ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా మారాడు. ఆయన భార్య కూడా చాలానే ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ రచ్చ చేసింది.
సందీప్ మాస్టర్ హౌస్ లో ఉన్నప్పుడు చాలానే ఫౌల్ గేమ్స్ ఆడారు. అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ లతో కలిసి ఉంటూ కాస్త నెగిటివిటీని కూడా మూట కట్టుకున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హౌస్ మేట్ అయి, కెప్టెన్ అయి చాలానే రచ్చ చేశారు. ఏడు వారాల పాటు అసలు నామినేషన్స్ లోకే రాని ఆయనను.. టేస్టీ తేజ నామినేట్ చేశాడు. పాజిటివ్ రీజన్స్ చెప్పే నామినేట్ చేసినప్పటికీ.. ఆయన మాత్రం అదే వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. కొంచెం నెగిటివిటీ ఉన్నప్పటికీ మంచి పేరుతోనే హౌస్ లోంచి బయటకు వచ్చాడు.

బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అన్ని ఎపిసోడ్ లు చూసి... ప్రజల ఇష్టానికి తగ్గట్లుగా శివాజి అండ్ గ్రూపుకు సపోర్ట్ చేయడం ప్రారంభించాడు. అలాగే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయితే కూడా ఆయనకు అండగా నిలిచి తన మంచి మనసును చాటుకున్నాడు. అయితే తాజాగా ఈయన హీరోగా ఓ సినిమా రాబోతుంది. ది షార్ట్ కట్ అనే పేరుతో ఓ సినిమా చేస్తుండగా.. సందీప్ మాస్టర్ హీరోగా కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా పోస్టర్ ఇటీవలే విడుదల అయింది. అయితే పోస్టర్ విడుదల అయినప్పటి నుంచి సందీప్ మాస్టర్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పోస్టర్ పై సందీప్ మాస్టర్.. బెస్ట్ సంచాలక్ అని పెట్టుకున్నారు. బిగ్ బాస్ తెలుగు లోగోతో పాటుగా బెస్ట్ సంచాలక్ అని పోస్టర్ పై రాయడంతో ఈ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఎక్కువ సార్లు సంచాలక్ గా సందీప్ మాస్టర్ వ్యవహరించారు. కానీ చాలా సార్లు తప్పుడు డెసీషన్లు తీసుకున్నారు. అయినా సరే సంచాలక్ అనగానే అందరికీ ఈయన పేరే గుర్తుకు వస్తుంది. ఎక్కువ సార్లు చేయడం వల్లే ఇలా అయింది. అయితే ఫినాలే రోజు చాలా మందికి ఫన్నీ, ఫన్నీ అవార్డులను ఇచ్చారు. ఈక్రమంలోనే సందీప్ మాస్టర్ కు సంచాలక్ అవార్డును ఇచ్చారు. అయితే దీన్నే ఆయన తన కొత్త సినిమా పోస్టర్ పై పెట్టుకోవడంతో అంతా ఎద్దేవా చేస్తున్నారు.
అదేమైనా ఆస్కార్ లెవెల్ అవార్డా.. అయినా తప్పుడు డెసీషన్లు తీసుకున్న నీకు ఆ అవార్డు ఇవ్వడమే ఎక్కువ, ఇంకా నువ్వు దాన్ని సినిమా పోస్టర్ పై పెట్టుకోవడం ఏంటంటూ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట మొత్తం ఈ పోస్టర్ గురించి చర్చ చేస్తున్నారు. మరి దీనిపై ఆట సందీప్ స్పందిస్తారా.. లేక సైలెంట్ గా పోస్టర్ పై ఉన్న దాన్ని తొలగించి మరో కొత్త పోస్టర్ ను విడుదల చేస్తారా లేదా తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications










