Animal యానిమల్ సినిమా కోసం బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ వర్క్ చేశారని తెలుసా?
ఇప్పుడు దేశం అంత యానిమల్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసిన ఈ సినిమా వీడియోలు వైరల్ గా మారాయి. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ పై ప్రేక్షకులు ప్రశంసలు, విమర్శలు కురిపిస్తున్నారు. అయితే కొంత మంది సెలబ్రెటీలు ఈ సినిమాపై నోరువిప్పడం లేదు. దానికి కారణం.. ఈ సినిమాలోని బోల్డ్ కంటెంట్ వల్లే. ఈ సినిమాపై నోరు విప్పితే ఎక్కడ విమర్శల పాలవుతామని అందరూ సైలెంట్ అయిపోతున్నారు. ఆ విషయం పక్కన పెడితే.. ఈ సినిమా కోసం బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ వర్క్ చేశారు. అసలు అతను ఎవరు.. ఏంటి అనేది ఈ వివరాలు స్టోరీలో తెలుసుకుందాం.
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ అవైటెట్ ఫిల్మ్ యానిమల్. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, తృప్తి డిమ్రి హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్.

బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ రణబీర్ తండ్రి పాత్రలో కనిపించగా... బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమాను సందీప్ వంగా తెరకెక్కించారు. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మించారు. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది.

ఇక ఈ సినిమాకు విశాల్ మిశ్రా, జానీ, జామ్8 (పాటలు), హర్షవర్దన్, రామేశ్వర్ (బీజీఎం) అందించారు. ఇక ఈ సినిమాలోని పాటలు, బీజీఎం ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలోని ఓ పాటకు బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ ఆట సందీప్ కంపోజ్ చేశారు. నమ్మడానికి వీలుగా అనిపించకపోయినా.. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకువచ్చారు.
ఆట సందీప్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేస్తూ... యానిమల్ సినిమాలోని ఈ పాటలోని ఈ స్టేప్పులకు తానే కంపోజ్ చేసినట్లు చెప్పుకువచ్చారు. తప్పకుండా అందరూ యానిమల్ సినిమా చూడండి అంటూ క్యాప్షెన్ ఇచ్చారు. ఇక ఆ వీడియోలో రణబీర్ సాంగ్ కు స్టేప్పులు వేస్తున్నారు. ఇక ఆయన పోస్ట్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఆట సందీప్ ఇటీవల బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఏడు వారాలుగా ఆయన షోలో అలరించి.. 8వ వారంలో ఆయన ఎలిమినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ షోలో ఆయన ఆటతో మరింత పాపులర్ అయ్యారు ఆట సందీప్. ప్రస్తుతం ఆట సందీప్.. సినిమాల కొరియోగ్రఫితో బిజీగా ఉండిపోయారు. పాన్ ఇండియా సినిమాలో ఆట సందీప్ వర్క్ చేయడంపై ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.


Click it and Unblock the Notifications











