Ashwini Sri: నేనింకా సింగిల్.. అబ్బాయి ఎంత దరిద్రంగా ఉన్నా సరే.. కానీ ఆ ఒక్క క్వాలిటీ ఉంటే పెళ్లి చేసుకుంటా!
బిగ్ బాస్ తెలుగు 7 షో గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుని లక్షల్లో అభిమానుల్ని సంపాధించుకున్నారు. ఎక్కువ రోజులు ఉన్న వాళ్లకు వచ్చిన క్రేజ్ అయితే మామూలుగా లేదలెండి. ముఖ్యంగా అద్భుతమైన అందం కల్గిన అమ్మాయిల తెలుగు యువత ఫిదా అయిపోయింది. ఈసారి సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి రచ్చ చేసిన హాట్ బ్యూటీ అశ్విని శఅరీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అరేబియన్ గుర్రం అనే పేరు తెచ్చుకున్న ఈమె అలాగే కనిపిస్తూ సందడి చేసింది.
బిగ్ బాస్ షోలో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువ కాలం హౌస్ లో కొనసాగలేకపోయింది. ఈమె ఆట తీరుకంటే కూడా ఈమె అందాలకే ఎక్కువ మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలా మంది కోరుకున్నారు. అలాంటి వాళ్ల కోసమే అన్నట్లుగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ అనకడం కంటే కూడా తనకు ఎలాంటి వాడు కావాలో చెప్పి అందరికీ షాకిచ్చిందని చెప్పొచ్చు. అయితే ఆమె తనకు కాబోయే భర్తలో ఉండే క్వాలిటీస్ ఏం చెప్పిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అశ్విని శ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. మీరు చేసుకోబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలని అడిగింది. దానికి ఆమె వెంటనే స్పందించిన తెగ సిగ్గపుడిపోతూ సమాధానం చెప్పుకు వచ్చింది. తాను ఇంకా సింగిల్ అని.. ఇప్పటి వరకు తనకు నచ్చిన వాళ్లు కనిపించలేదని పేర్కొంది. తనకోసం తన వెంటనే తిరిగే వాళ్లు చాలా మందే ఉన్నా ఒక్కరు కూడా తన మనసులోకి రాలేకపోయారని వెల్లడించిందీ హాట్ బ్యూటీ. ఏ అమ్మాయి అయినా తనకు నచ్చితోనే ముందుకు స్టెప్ వేస్తుందని కూడా స్పష్టం చేసింది.
ముఖ్యంగా తనను చేసుకోబేయే వాడు ఎంత దరిద్రంగా ఉన్నా అంటే నల్లగా, అంద విహీనంగా, చెండాలంగా ఉన్నా తాను పట్టించుకోనని అశ్విని శ్రీ తెలిపింది. అలాగే అసలు అతడికి ఎలాంటి అస్తి పాస్తులు లేకపోయినా సరేనని.. అవన్నీ తాను చూసుకుంటానని చెప్పుకొచ్చింది. కానీ తనకు కాబోయే వాడికి కచ్చితంగా ఓ క్వాలిటీ ఉండాలని.. అదే మంచి మనసు కల్గి ఉండడం అని వెల్లడించింది. మంచి మనసు ఉంటే చాలని.. తనను బాగా అర్థం చేసుకుంటే అదే పది వేలని.. ఇంకేం అక్కర్లేదని పదే పదే చెప్పుకొచ్చింది.

అలాంటి వాళ్లు తనకు ఒక్కరు కలిసినా తాను వారిని పెళ్లి చేసుకుంటానని.. వెల్లడించింది. జీవితంలో అలాంటి వ్యక్తి కలిసే వరకు తాను ఇలాగే ఉంటానని.. తనను నచ్చిన వాడు, తాను మెచ్చినవాడు... అర్థం చేసుకునే వాడు దొరికిన తర్వాత పెళ్లి చేసుకుంటానని మరోసారి క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











