పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై నోరు విప్పిన అమర్: అందుకే అలా జరిగింది.. ఆరోజే మొత్తం బయటపెడతానంటూ!
తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను రాబడుతూ.. తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ కార్యక్రమం ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులను పెద్ద సెలెబ్రిటీలుగా మార్చేసింది. అందులోనూ కామన్ మ్యాన్‌గా వచ్చి ఏకంగా సీజన్ విజేతగా నిలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.
ఆ ఆనందాన్ని ఎంతో సేపు లేకుండా చేస్తూ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై అమర్‌దీప్ చౌదరి మొదటిసారి స్పందించాడు. అతడు ఏమన్నాడో మీరే చూసేయండి మరి!

అమర్‌పై దాడి.. న్యూసెన్స్: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్‌దీప్ చౌదరి ఫ్యామిలీపై దాడి చేసిన విషయం తెలిసింది. అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న సమయంలో కారును ధ్వంసం చేశారు. ఆ తర్వాత కూడా చాలా న్యూసెన్స్ చేశారు. వీటికి బాధ్యుడిని చేస్తూ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ప్రశాంత్ జైలుకు.. బెయిల్: న్యూసెన్స్ కేసులో అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత అతడి కోసం దాదాపు 50 మంది లాయర్లు స్వచ్చందంగా వచ్చి బెయిల్ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేశారు. ఈ మేరకు కొన్ని షరతులను కూడా విధించింది.
స్పందించిన అమర్‌దీప్: బిగ్ బాస్ విజేతగా నిలిచినా ఆనందం లేకుండా అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ గురించి కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమర్‌దీప్ చౌదరి కూడా ఈ అంశంపై మాట్లాడాడు. ఈ విషయంపై అతడు పెద్దగా మాట్లాడకపోయినా పల్లవి ప్రశాంత్ తప్పు లేదు అన్నట్లుగానే అతడు చెప్పాడు. ఇప్పుడీ ఇంటర్వ్యూ బాగా హైలైట్ అవుతోంది.
అంతా బ్లాంక్ అయింది: తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన అమర్‌దీప్ చౌదరి.. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవపై తొలిసారిగా స్పందించాడు. 'షో రిజల్ట్ ఎలా ఉన్నా చాలా మంది మనసులు గెలిచానన్న సంతోషంలో ఒక మైండ్ సెట్‌తో బయటకు వచ్చాను. అంతలోనే అక్కడ జరిగిన ఇష్యూతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు' అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ ఆఫర్‌తోనే గెలిచాను: ఆ తర్వాత అమర్‌దీప్ చౌదరి మాట్లాడుతూ.. 'ఈ బిగ్ బాస్ ఫలితం ఎలా ఉన్నా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాను. అదే నా విజయంగా భావిస్తున్నాను. దీనికితోడు నా అభిమాన హీరో రవితేజ గారి సినిమాలో ఆఫర్ వచ్చింది. ఇది అంతకంటే పెద్ద గెలుపుగా అనుకుంటున్నా. ఇంతకంటే నా లైఫ్‌కు ఇంకెం కావాలి చెప్పండి' అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు.

కాల్ కోసమే.. త్వరలోనే: బిగ్ బాస్ షో వల్ల తన రేంజ్ పెరిగిపోయిందన్న అమర్‌దీప్ చౌదరి.. ఆ తర్వాత 'ఈ షో వల్ల నాకు చాలా ప్లస్ అయింది. అప్పుడు మామూలు ఆర్టిస్టు అనుకునేవాడిని. ఇప్పుడు పెద్ద స్టార్‌ను అయ్యాను. రవితేజ గారి కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా చాలా ఆఫర్లు వచ్చాయి. వాటన్నింటినీ మంచి రోజు చూసుకుని బయటపెడతాను' అంటూ ప్రకటించాడు.
ప్రశాంత్ అరెస్ట్ గురించి: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవడంపై అమర్‌దీప్ చౌదరి స్పందిస్తూ... 'అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిందంతా పక్కన పెడితే.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ మాత్రం మిస్ అండర్‌స్టాండ్ వల్లే జరిగింది. ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయిందిలేండి. ఎవరూ ఏం టెన్షన్ పడనవసరం లేదు. అందరూ బాగానే ఉన్నారు. మేము కూడా చాలా హ్యాపీగా కలిసే ఉన్నాము' అంటూ వివరించాడు.


Click it and Unblock the Notifications











