Bigg Boss Telugu 7: రామ్ చరణ్ మూవీలో బిగ్ బాస్ అర్జున్.. ఏ రోల్ చేస్తున్నాడో తెలిస్తే!

తెలుగు బుల్లితెరపై కొత్త కాన్సెప్టుతో నడుస్తూనే భారీ స్థాయిలో స్పందనను సొంతం చేసుకుంటోంది బిగ్ బాస్ షో. ఇందులో గొడవలు, ప్రేమలు, ఎమోషన్స్, సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈ షోకు ఆదరణ పెరుగుతూనే ఉంటోంది. ఫలితంగా తెలుగులో ఇది వరుసగా సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ వస్తోంది. ఇక, ఈ షో వల్ల ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారడంతో పాటు ఆఫర్లను భారీగా పట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా సీజన్ కంటెస్టెంట్ అంబటి అర్జున్.. రామ్ చరణ్ మూవీలో ఛాన్స్ పట్టేశాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి మరి!

బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో గతంలో ఎప్పుడూ చూడని కొత్త కొత్త అంశాలను చూపిస్తూ ప్రసారం చేస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్‌కు ఆరంభం నుంచే మంచి స్పందన లభిస్తోంది. తద్వారా దీనికి మరింత ఎక్కువ రేటింగ్ వస్తోంది. దీంతో నిర్వహకులు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ వెళ్తున్నారు.

Bigg Boss Telugu 7 Contestant Ambati Arjun Key Role in Ram Charan Movie

ఏడో సీజన్‌ను గతంలో కంటే వినోదాత్మకంగా నడిపించే దానిలో భాగంగా గత ఆదివారం ఎపిసోడ్‌ను దీపావళి స్పెషల్‌గా నిర్వహించారు. ఇందులో ఎంతో మంది సెలెబ్రిటీ గెస్టులు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, కొందరు హీరోయిన్లు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టేశారు. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ కుటుంబ సభ్యులు, స్నేహితులు స్టేజ్ మీదకు వచ్చి తెగ సందడి చేశారు.

దీపావళి ఎపిసోడ్‌లో భాగంగా అంబటి అర్జున్ కోసం అతడి ఫిట్‌నెస్ ట్రైనర్‌తో పాటు 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సన బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చారు. వీళ్లిద్దరినీ చూసి అతడు ఎంతగానో సంతోషించాడు. ముఖ్యంగా పెద్ద డైరెక్టర్ తన కోసం రావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆ సమయంలోనే బుచ్చిబాబు మూవీకి నేషనల్ అవార్డు వచ్చిన విషయాన్ని నాగార్జున తెలిపాడు.

అంబటి అర్జున్ తన కోసం వచ్చిన బుచ్చిబాబు సనతో 'థ్యాంక్స్ బుచ్చన్నా నాకోసం వచ్చినందుకు. మిమ్మల్ని కలవడానికి ఆఫీస్‌కు రెండు సార్లు వచ్చాను. మీరు చెన్నై వెళ్లారని చెప్పారు' అన్నాడు. అప్పుడు బుచ్చిబాబు సన 'అర్జున్ నువ్వు చరణ్ గారి సినిమాలో సూపర్ క్యారెక్టర్ చేస్తున్నావు' అంటూ ప్రకటించాడు. దీంతో అర్జున్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Bigg Boss Telugu 7 Contestant Ambati Arjun Key Role in Ram Charan Movie

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన తెరకెక్కిస్తోన్న సినిమాలో తనకు అవకాశం రావడంతో అర్జున్ 'థ్యాంక్స్ బుచ్చన్నా. సార్.. ఈయన ఎప్పుడూ ఇలాగే ఉంటారు. మరో పది హిట్లు కొట్టినా ఇలాగే ప్రవర్తిస్తారు. ఉప్పెన లాగే ఈ సినిమాకు కూడా నాలుగైదు నేషనల్ అవార్డులు రావాలి' అని కోరుకున్నాడు.

ఆ తర్వాత అదే వేదికపై మాటల మాటగా అర్జున్‌లో విలన్ క్వాలిటీ ఉందని బుచ్చిబాబు అన్నాడు. దీంతో రామ్ చరణ్ సినిమాలో అతడు నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌ను చేయబోతున్నట్లు పరోక్షంగా తెలిపాడు. దీంతో పాన్ ఇండియా సినిమాలో అర్జున్ చేసే రోల్ గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కలయికలో రాబోయే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X