Bigg Boss Telugu 7: పుష్ప సినిమాను మిస్ చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఎందుకో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రికార్డు స్థాయి టీఆర్పీతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గత 13వారాలుగా బిగ్ బాస్ ప్రేక్షకులను ఉల్టా పుల్టా అంటూ అలరిస్తుంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఐదో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీగా ఇచ్చిన అర్జున్ అంబటి గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ పుష్ప సినిమాలో నటించే ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడట. అసలు ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ మిస్ చేసుకున్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టిన అర్జున్ అంబటి గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో అర్జున్ అంబటి కూడా ఒకరిగా ఉన్నారు. అర్జున్ అంబటి సీరియల్ హీరోగా అందరికీ సుపరిచితమే. పలు సినిమాల్లోనూ నటించాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. టాప్ 5లో చోటు దక్కించుకునే దిశగా అర్జున్ తన ఆటను ఆడుతున్నాడు.

ఇక ఈ క్రమంలో అర్జున్ అంబటి పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆయనకు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో నటించే అవకాశం కోల్పోయారట. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకోల్పింది. అలాంటి సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకోవడం బ్యాడ్ లక్ అని చెప్పవచ్చు. ఒకవేళ ఆ సినిమాలో ఛాన్స్ వచ్చి ఉంటే అర్జున్ అంబటి గ్రాఫ్ మరోలా ఉండేది.
ప్రస్తుతం అర్జున్ అంబటి కూల్ గా తన ఆటను ఆడుతూ వస్తున్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా పేరుతెచ్చుకున్న అర్జున్.. పలు సీరియల్స్, సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అర్జున్ కు పుష్ప సినిమా నుంచి ఆఫర్ వచ్చిందట. సుకుమార్.. అల్లు అర్జున్ ఆడిషన్స్ కోసం పిలిచారట. అయితే అంత ప్రాజెక్టులో అర్జున్ కు ఆడిషన్స్ కు పిలిస్తే మొదట నమ్మలేదని ఓ ఇంటర్వ్లూలో చెప్పుకువచ్చాడు.

ఇక ఆడిషన్ కు వెళ్లిన అర్జున్ అంబటి.. ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధపడినట్లు చెప్పుకువచ్చాడు. ఇక అక్కడ ఆడిషన్ కు వెళ్లాక అర్జున్ అంబటిని చూసి సుకుమారే భయపడ్డారట. ఏంటి సీరియల్స్ అన్నీ పూర్తి అయ్యాయా? అని సుకుమార్ అడిగ్గా... తానూ ఒక సీరియల్ హీరో అని , తన సీరియల్స్ ని సుకుమార్ ఫాలో అవుతున్నాడని తెలిసి తాను హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలుపాడు. ఇక సుమార్ సినిమాలో ఆ పాత్ర చేసే ఛాన్స్ రాలేదని చెప్పుకువచ్చాడు. దానికి కారణం ఆ పాత్రకు తను సెట్ కాలేకపోవడమని తెలుస్తోంది.

సుకుమార్ పుష్ప సినిమాలో అర్జున్ అంబటికి వచ్చిన పాత్ర పోలీస్ ఆఫీసర్ పాత్ర. ఆ పాత్రను ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు శత్రు పోషించారు. ఇక ఇది చిన్న పాత్ర ఏమి కాదని తెలుస్తోంది. ఆ పాత్ర చేసి ఉంటే.. ఈరోజు ఇలా బిగ్ బాస్ కు వచ్చే వారు కాదని అంటున్నారు నెటిజన్స్. ఇక ఆర్సీ 16సినిమాలో ఛాన్స్ అయితే కొట్టేశాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో అర్జున్ కు మంచి క్యారెక్టర్ వచ్చింది. స్వయంగా డైరెక్టర్ చెప్పుకువచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











