Bigg Boss Telugu 7: బయటపడ్డ బిగ్ సీక్రెట్... ఆ కంటెస్టెంట్‌కు పెళ్లై విడాకులు అయ్యాయని మీకు తెలుసా?
బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి విడుతలో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా.. రెండో విడుతలో 5 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఇక వీరిలో అశ్వినీ శ్రీ ఒకరు. ఈమె బిగ్ బాస్ కు ముందు.. ఎవరు అనేది చాలా మందికి తెలియదు. అయితే ఈ భామకు ఇదివరకే పెళ్లై విడాకులు అయినట్లో ఓ బిగ్ సీక్రెట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరి అశ్వినీ శ్రీకి పెళ్లై విడాకులు ఎందుకు తీసుకుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఆరోజున 14 మంది కంటెస్టెంట్స్ హౌసులోకి అడుగుపెట్టారు. ఇక ఐదు వారాల తర్వాత మరో ఐదుగురు కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఇక వారిలో అందరి చూపును తన అందంతో ఆకట్టుకుంది అశ్వినీ శ్రీ. ఈ భామ గురించి మొదట ఎవరికీ అంతగా తెలియదు. ఎవరో అని నెట్టింట తెగ సెర్చ్ చేశారు. ఇక హౌస్ లోకి ఎంటర్ అయ్యాక మొదటి రోజునే ఏడ్చి.. ఏంటబ్బా ఈమె ఇలా ఉంది అనుకున్నారు.

అయితే అశ్వినీ శ్రీ.. మహేశ్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఈ సినిమాలో రష్మిక అక్కగా ట్రైన్ సీన్ లో కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత రవితేజ రాజ ది గ్రేట్ సినిమాలో ఓ పాటలో కనిపిస్తుంది. హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన అశ్వినికి అవకాశాలు లేక.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి.. తన దైన శైలితో ఆటను ఆడుతోంది.
ఇదిలా ఉంటే... ఈ భామ హీరోయిన్ గా చేసిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఆ సినిమాలు రిలీజ్ అయినట్లు కూడా చాలా మందికి తెలియదు. అవేంటంటే... అమీర్ పేట్ లో, బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ వంటి చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అవి అంత సక్సెస్ కాకపోవడంతో అశ్విని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది. అలా కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా.. ఈ భామకు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది.
మిడిల్ క్లాస్ లో పుట్టిన అశ్విని శ్రీ.. వరంగల్ నిట్ లో బీటెక్ పూర్తి చేసి జాబ్ చేద్దామనుకుందట. అయితే అదే సమయంలో ఫ్రెండ్స్ అందరూ హీరోయిన్ లా ఉన్నావంటూ చెప్పడంతో.. సినిమాల్లో ట్రై చేసేందుకు వచ్చిందని తెలుస్తోంది. కానీ ఇండస్ట్రీ గురించి అంతా తెలిసి అశ్విని పేరెంట్స్ దీనికి ఒప్పుకోలేదని సమాచారం. కానీ పట్టుబట్టి అశ్వినీ శ్రీ ఇండస్ట్రీ లోకి వచ్చిందట. కానీ చేసిన సినిమాలు సక్సెస్ కాలేదు.

ఇక ఇండస్ట్రీలోకి వెళ్తే.. ఏం అవుతుందోననే భయంతోనే.. ముందే అశ్విని పేరెంట్స్ 2013లోనే పెళ్లి చేశారని తెలుస్తోంది. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అశ్విని భర్తతో ఎక్కువ రోజులు కలిసి ఉండలేక అతనికి విడాకులు ఇచ్చిందని సమాచారం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు కానీ... న్యూస్ మాత్రం నెట్టంట హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











