Bigg Boss Telugu 7 దటీజ్ భోలే షవాలీ.. అవమానాలు ఎదుర్కొన్న చోటే.. కంటెస్టెంట్ల మనసు గెలుచుకొంటూ!

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు, రచయిత భోలే షవాలీ ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఇంటిలో అడ్జస్ట్ కావడానికి చాలా తంటాలు పడ్డాడు. ఆయన ఆట తీరుపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. ఇంటిలో చాలా అవమానాలు, దూషణలకు గురయ్యాడు. అలాంటి పరిస్థితుల నుంచి ఇంటిలో తనదైన మార్కును చూపిస్తూ.. ఎవరైతే తనను దూషించారో.. వారి ప్రేమను, అభిమానాన్ని సొంతం చేసుకొనే ప్రయత్నాలు ఉన్నాడు. తాజాగా ఇంటిలో భోలే షవాలే అరుదైన రికార్డును సొంతం చేసుకొన్న వివరాల్లోకి వెళితే...

భోలే షవాలీ గత దశాబ్దానికిపైగా సినిమా పరిశ్రమలో ఉన్నారు. గాయకుడిగా, ఫ్రీలాన్స్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నం చేశాడు. ఇటీవల మంత్రి మల్లారెడ్డి డైలాగ్స్‌ను స్పూర్తిగా తీసుకొని చేసిన కష్టపడ్డా.. ఇష్టపడ్డా అనే లవ్ బ్రేక్ సాంగ్‌ను పాడి ట్రెండింగ్‌లోకి వచ్చాడు.

Bigg Boss Telugu 7 Contestant Bhole Shavaii wins Best Worker Kashta Jeevi Award in House

ఇక వాస్తవానికి బిగ్‌బాస్ తెలుగు 7 షోలోకి ఆరంభంలోనే రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇంటిలోకి అడుగుపెట్టలేకపోయాడు. ఇటీవల ఉల్టాపుల్టాలో భాగంగా జరిగిన 2.0 సిరీస్‌లో భోలే ఇంటిలోకి అడుగుపెట్టాడు. ఇంటిలోకి వచ్చిన భోలేను దాదాపు సీరియల్ గ్యాంగ్ వెలివేసినట్టు చూశారు.

బిగ్‌బాస్ తెలుగు నామినేషన్‌లో భాగంగా భోలే షవాలనే టార్గెట్ చూసి నోటికి వచ్చినట్టు దూషించారు. ఓ దశలో సహనం కోల్పోయిన ఆయన బూతు పదాన్ని ఉపయోగించారు. వెంటనే తన తప్పును తెలుసుకొని క్షమాపణలు కోరాడు. ప్రియాంక జైన్ తూ అంటూ ముఖం మీదే ఉమ్మి అవమానించింది. అయినా భోలే షవాలీ దిల్‌పైకి తీసుకోలేదు. శోభాశెట్టి, ప్రియాంక జైన్‌ను పదే పదే క్షమించమని కోరినా వారు స్పందించకుండా అవమానించారు. అయినా తాను నమ్ముకొన్న ఆటను, స్ట్రాటజీని వదులుకోలేదనే పలు సంఘటనలు స్పష్టం చేశాయి.

Bigg Boss Telugu 7 Contestant Bhole Shavaii wins Best Worker Kashta Jeevi Award in House

ఇక ప్రస్తుతం 9 వారంలో ఇంటికి కెప్టెన్‌గా గౌతమ్ కృష్ణ వ్యవహరిస్తున్నాడు. ఆయన ఇంటిలో బాగా పనిచేసిన వారికి బెస్ట్ వర్కర్‌గా కష్టజీవి.. పనిచేయని వారికి పనిదొంగ అవార్డు ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో ఇంటిలో బాగా కష్టపడిన భోలే షవాలీకు కష్టజీవి అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకు కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చి ప్రశంసించారు.

బిగ్‌బాస్ తెలుగు షోలో కష్టజీవి అవార్డును భోలే షవాలీకు ఇస్తున్నట్టు గౌతమ్ ప్రకటించగానే కంటెస్టెంట్లు అందరూ అభినందించారు. ఈ సందర్భంగా భోలే మాట్లాడుతూ.. కష్టపడే వాళ్లకు ఇష్టపడే వాళ్లు తోడుగా ఉంటారు. కష్టపడ్డా.. స్ప్రైట్ గెలుచుకొన్నాను. నా కంటే రవ్వంత కష్టపడే తేజాకు నాకు లభించిన స్ప్రైట్ బాటిల్‌ను ఇస్తాను అని భోలే ఇంటి సభ్యులు మనసు గెలుచుకొనే ప్రయత్నం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X