Bhole Shavali: పల్లవి ప్రశాంత్ ర్యాలీలో పిచ్చిగా వ్యవహరించడానికి కారణం అదే.. తొలిసారి షాకింగ్ విషయాలు చెప్పిన
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో పాల్గొన్న కంటెస్టెంట్లు, విన్నర్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన హంగామా గురించి అక్కడ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన రచ్చ కూడా మామూలుగా లేదు. వాళ్లు బిగ్ బాస్ కంటెస్టెంట్ల కారు అద్దాలు పగుల గొట్టడం, బస్సుల అద్దాలు పగులగొట్టడం ఆ తర్వాత దానికి రైతుబిడ్డే కారణం అంటూ అతడిని అరెస్ట్ చేయడం ఇదంతా పాత విషయాలే. అయితే ఈ తతంగం అంతా జరగక ముందు అంటే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు రాగానే పల్లవి ప్రశాంత్ కూడా కాస్త ఎక్కువ చేశాడనే కామెంట్లు వినిపించాయి.
ముఖ్యంగా ఆరోజు జరిగిన ర్యాలీలో పల్లవి ప్రశాంత్ పోలీసులనే తప్పుబట్టడం.. అభిమానుల అండ చూసుకొని అతి చేయడం.. మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం అందరికీ షాకిచ్చాయి. ఆయన వ్యవహరించిన తీరు చూసిన చాలా మంది ఆయన ఫ్యాన్సే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బయటి వాళ్లు అయితే అతడి తీరును చాలా తప్పు బట్టారు. అయితే ఆరోజు రైతుబిడ్డ అలా ఎందుకు ప్రవర్తించాడో పాట బిడ్డ భోలె షవాళి తెలిపాడు. అతడు అలా ప్రవర్తించడానికి కారణం ఉందని చెప్పుకొచ్చాడు.

తొలిసారి రైతుబిడ్డ అలా ప్రవర్తించడం చూసి తానే షాక్ కు గురయ్యాయని భోలె తెలిపాడు. అలా పిచ్చిగా వ్యవహరిస్తున్నాడేంటని అనుకున్నట్లు వివరించాడు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ తన ఇంటికి వచ్చాడని.. ఆక్రమంలోనే అతడు చేసిన అతిని అతడికే చూపించి నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తించావని అడిగానని కూడా అన్నాడు. అయితే అందురు పల్లవి ప్రశాంత్ ఓ కారణం చెప్పాడని.. బిగ్ బాస్ తెలుగు షోలో కామన్ మ్యాన్ గెలవడం ఇదే తొలిసారి కావడం, అందులోనూ రైతుబిడ్డగా రావడంతోనే తాను గెలిచానని.. అందుకు వారంతా సపోర్ట్ చేశారనే ఆనందంలో ఉన్నానని అన్నాడట.

అది తన ఒక్కడి గెలుపు కాదని.. అది రైతులందరి గెలుపు అని భావించిన పల్లవి ప్రశాంత్ ఆ ఊపులో చాలా ఎక్కువ చేయాలని అనుకున్నాడట. దానికి అక్కడున్న వారంతా కూడా సపోర్ట్ చేయడంతో తానలా ప్రవర్తించానని చెప్పాడట. కానీ చాలా మంది అతడి తీరు చూసి కోప్పడ్డారని, తప్పుగా అర్థం చేసుకున్నారని.. వాస్తవానికి ప్రశాంత్ అలా ఉండడని.. అందరి వద్ద అనిగి మణిగి ఉంటాడని భోలె షవాళి చెప్పుకొచ్చాడు. అలాగే బిగ్ బాస్ టాప్ 5లో తాను కూడా ఉంటానని.. హౌస్ మేట్స్ అంతా అనుకున్నారని కూడా చెప్పుకుచ్చాడు.

కానీ తెలుగు ప్రేక్షకులు తనను ఎందుకు ఎలిమినేట్ చేశారో తనకు తెలియదని.. భోలె షవాళి వివరించాడు. అలాగే శివాజి రన్నరప్ అవుతాడని అంతా అనుకున్నామని.. కానీ మొత్తం తేడాగా వచ్చాయి రిజల్ట్స్ అంటూ తన మనసులోని మాట చెప్పాడు. పల్లవి ప్రశాంత్ చాలా మంచి వ్యక్తి అంటూ మరోసారి వివరించాడు బోలె షవాళి.


Click it and Unblock the Notifications











