Bigg Boss Telugu 7 బిగ్‌బాస్‌ ఇంట్లో పాటబిడ్డ బూతులు.. బోలే చెల్లెలి రియాక్షన్ ఏంటంటే?

బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఇక 7వ వారం నామినేషన్స్ సైతం హీటెక్కించేలా సాగాయి. ముఖ్యంగా బోలే షవాలి ప్రవర్తనపై కంప్లైంట్ చేస్తూ.. ఇంటి సభ్యులు అంతా ఆయనకు నామినేషన్ గుద్ది పడేశారు. దీంతో బోలే కూడా ఇంట్లో బూతులు మాట్లాడారు. ఇక ఈ విషయంపై ఆయన చెల్లెలు రియాక్ట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన వ్యక్తి బోలే షవాలి. ఐదో వారంలో బోలే షవాలితో పాటు అర్జున్ అంబటి, పూజా మూర్తి, నయని పవని, అశ్విని శ్రీ ఎంటర్ అయ్యారు. లోపల రైతు బిడ్డ ఉన్నాడు.. నేను పాట బిడ్డను ఇద్దరం కలిసిపోతామంటూ లోపలికి అడుగుపెట్టిన బోలే షవాలి... ఇంట్లోకి వచ్చాక మాత్రం పిచ్చిగా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు. ఎవరు ఏం అడిగిన వంకరగా సమాధానాలు చెప్పడం.. దానికి తోడు.. ఆ అశ్వినితో పులిహోర కలపడం.. చూసేవాళ్లకు చిరగ్గా అనిపిస్తూ ఉంటుంది.

Bigg Boss Telugu 7 Contestant Bhole Shawali Sister Fires on Shobha Shetty, Priyanka Jain, Arjun Ambati Video Goes Viral

ఇక బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయి ఏడు వారాలు కావొస్తుంది. దీంతో 7వ వారం నామినేషన్స్ సైతం హీటెక్కించేలా జరిగాయి. ముఖ్యంగా ఇంట్లో సభ్యులంతా బోలేషవాలిపై నామినేట్ గుద్ది పడేశారు. ఆయన పిచ్చిగా బిహేవ్ చేయడం.. ఆటలో ఇన్ వాల్వ్ కాకపోవడం... ఇద్దరు గొడవ పడుతుంటే ఎంటర్ అవ్వడం ఇలాంటి రీజన్స్ చెప్పి ఇంట్లోని సభ్యులంతా నామినేట్ చేశారు.

ఇక నిన్నటి నామినేషన్స్ ప్రక్రియలో బోలే షవాలి.. శోభా శెట్టిపై రెచ్చిపోయి మాట్లాడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మా రైతు బిడ్డ బరాబార్ మాటను వాడుకుంటున్నావ్.. .రైతు బిడ్డ ఇచ్చిండు అంటూ నోరు జారి బూతులు మాట్లాడాడు. దీంతో ప్రియాంక కూడా ఇన్ వాల్వ్ అయింది. బోలేపై ఈ ఇద్దరు విరుచుకు పడ్డారు. మధ్యలో అర్జున్ సైతం బోలేకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఈ వీడియోలు నెట్టింట కూడా వైరల్ గా మారాయి.

Bigg Boss Telugu 7 Contestant Bhole Shawali Sister Fires on Shobha Shetty, Priyanka Jain, Arjun Ambati Video Goes Viral

ఇక నిన్నటి ఎపిసోడ్ పై బోలే సిస్టర్ రియాక్ట్ అయింది. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోలేపై ఇలా విరుచుకుపడటం సరికాదని చెప్పుకువచ్చింది. ఎవరు పిచ్చోళ్లు అంటూ ఫైర్ అయింది. బోలే మంచి వ్యక్తి ఎంతో మందికి అన్నం, ఉద్యోగం ఇప్పించాడు అంటూ చెప్పకువచ్చింది. బోలే సిస్టర్ మాట్లాడుతూ... ఎక్కడ దొరకరు అండి... అలాంటి అన్నయ్య మా అన్నయ్య.. కానీ మా అన్నయ్యను ఇలా బ్లేమ్ చేసి మాట్లాడటం మాకు నచ్చడం లేదు. రాత్రి బిగ్ బాస్ చూస్తుంటే చాలా ఎమోషనల్ అయ్యాం. నాకైతే రక్తం మరిగిపోతుంది. ఆ శోభా శెట్టి, ప్రియాంక... ఆ అర్జున్.. మాటలు వింటుంటే... అంటూ చెప్పుకువచ్చింది.

Bigg Boss Telugu 7 Contestant Bhole Shawali Sister Fires on Shobha Shetty, Priyanka Jain, Arjun Ambati Video Goes Viral

ఆ అర్జున్ అంటున్నాడు ఎందుకు వచ్చావ్ బిగ్ బాస్ కి అని... ఎందుకు వస్తారు అండి బిగ్ బాస్ లోకి.. పనిలేక వస్తారా... నిరూపించుకోడానికే కదా బిగ్ బాస్ లోకి వెళ్లేది. మంచితనంతోనే వెళ్లాడు. ఇలా అందరి చేత మాటలు పడటానికి కాదు కదా వెళ్లింది. వాడు పిచ్చోడు అంటున్నారు.. ఎవరండి పిచ్చోడు.. వంద మందికి అన్నం పెడుతాడా... వందమందికి పని ఇప్పిస్తాడా.. ఎవరు పిచ్చోడు.. అసలు ఆ మాట ఎలా వస్తుంది. అలా ఎలా అంటారు... తప్పు కదా.. ప్రజలంతా చూస్తున్నారు కదా.. మా అన్నయ్య ఎలాంటి వాడు అనేది ప్రజలకు తెలిస్తే చాలు... అని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X