పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌పై నోరు విప్పిన శివాజి: ఆ సమాచారం నా దగ్గర ఉంది.. వాళ్లతో టచ్‌లో ఉన్నానంటూ!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేర్లు రెండే రెండు. అందులో ఒకటి ప్రభాస్ నటించిన సినిమా 'సలార్' కాగా.. రెండోది బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్‌గా నిలిచిన 'పల్లవి ప్రశాంత్' పేరే. దీనికి కారణం అతడు టైటిల్ గెలిచిన కొన్ని గంటల్లోనే జైలు పాలు కావడమే అని తెలిసిందే. ఈ అంశంపై చాలా మంది స్పందిస్తున్నారు. కానీ, ప్రశాంత్‌కు అత్యంత ఆప్తుడైన హీరో శివాజి మాట్లాడలేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అతడు ఓ వీడియోను విడుదల చేశాడు. అసలు అందులో ఏం మాట్లాడాడో మీరే చూసేయండి మరి!

పల్లవి ప్రశాంత్ జైలులో : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన గొడవలు, అల్లర్లకు బాధ్యుడిని చేస్తూ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రోజుల తర్వాత అంటే బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్ నివాసానికి చేరుకుని అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Bigg Boss Telugu 7 Contestant Hero Sivaji First Reaction On Pallavi Prashanth Arrest

శివాజిపై విమర్శలతో : బిగ్ బాస్ ఏడో సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌కు హీరో శివాజి అండగా ఉన్న విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే అతడిని కంట్రోల్ చేస్తూ కాపాడుతూ విజేతగా నిలిచేలా చేశాడు. అలాంటిది పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం శివాజి స్పందించలేదు. దీంతో అతడు కావాలని షోలో రైతు బిడ్డను వాడుకున్నాడని విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి.

శివాజి ఫస్ట్ రియాక్షన్ : పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై తాజాగా శివాజి స్పందించాడు. ఈ మేరకు ఓ వీడియోను వదిలాడు. అందులో 'అందరికీ నమస్కారం. చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతున్నారు. నేను చెప్పేది ఒక్కటే.. ప్రశాంత్ ఎలాంటి వాడో నాలుగు నెలలు ఒక హౌస్‌లో ఉండి చూశాను. వాడు చాలా మంది కుర్రాడు' అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ అవసరం లేదంటూ : ఆ తర్వాత శివాజి 'ఒక్కోసారి గెలిచాను అన్న ఆనందం మనిషిని డామినేట్ చేయొచ్చు. నేను ప్రశాంత్ గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ ఇష్యూ అయిన మొదటి గంట నుంచి ఈ క్షణం వరకూ ప్రశాంత్ విషయంలో ఏం జరుగుతుందో ప్రతి సమాచారం నా దగ్గర ఉంది. కాబట్టి నేను ప్రతీది ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు' అని వివరించాడు.

వాడు బయటకొస్తాడు : శివాజి కొనసాగిస్తూ.. 'పల్లవి ప్రశాంత్‌కు నేనేంటో తెలుసు. నాకు వాడేంటో తెలుసు. ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి. చట్ట ప్రకారమే వాడు బయటకు వస్తాడు. రేపు కాకపోతే ఎల్లుడి.. లేకపోతే సోమవారం రిలీజ్ అవుతాడు. చట్టానికి లోబడిని అంశం కాబట్టి, చట్టాన్ని మనం గౌరవించాలి. ప్రశాంత్ నేరస్తుడు కాదు.. ప్రశాంత్ క్రిమినల్ కాదు' అంటూ తన అభిప్రాయం చెప్పాడు.

వాళ్లతో టచ్‌లో ఉన్నా : చివర్లో శివాజి 'ప్రశాంత్ చట్టాన్ని అతిక్రమించాడు అనే నెపం మోపిన వ్యక్తి. అతిక్రమించాడో లేదో గౌరవనీయులైన జడ్జ్‌గారు నిర్ణయిస్తారు. కచ్చితంగా ప్రశాంత్ నిర్దోషి. వాడు బయటకు వస్తాడు. ప్రశాంత్ గురించి భయపడాల్సిన పని లేదు. వాళ్ల నాన్న గారు, వాళ్ల బావగారు, వాళ్ల కుటుంబ సభ్యులు నాతో టచ్‌లోనే ఉన్నారు. మనందరం కూడా చట్టాన్ని గౌరవిద్దాం' అని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X