Nayani Pavani గౌతమ్, యావర్‌తో లవ్ ట్రాక్‌పై ఓపెన్.. అతడిని పెళ్లి చేసుకొనేంతగా.. నయని బోల్డ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో 6వ వారం అభిమానులకు షాకింగ్ కలిగించే ఎలిమినేషన్ జరిగింది. వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి వెళ్లిన నయని పవని తొలివారమే నామినేట్ అయింది. ఇంటిలోకి మెరుపు తీగగా వెళ్లిన ఏడు రోజుల్లోనే అదే మెరుపు వేగంతో వెనక్కి వచ్చింది. ఎలిమినేషన్ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె స్టార్ మా బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొన్నది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

బిగ్‌బాస్ తెలుగు షో ఆరు వారాల గేమ్‌ను చూసి వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి వెళ్లినప్పటికీ.. ఎలాంటి ప్లాన్‌తో వెళ్లలేదు. నేను గేమ్ ఆడటానికి మాత్రమే ప్రయత్నించాను. ఇంటిలోకి వెళ్లిన రోజే నేను నామినేట్ అయ్యాను. దాంతో నేను ఎక్కువగా ఆడియెన్స్‌కు కనెక్ట్ కాలేకపోయాను. అయితే నేను ఎలిమినేట్ అయ్యాననే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అని నయని పవని చెప్పింది.

Bigg Boss Telugu 7 Contestant Nayani Pavani bold comments on love track with Gowtham Krishna and Prince Yawar

బిగ్‌బాస్ తెలుగు షోలో నేను ఎవరితో లవ్ ట్రాక్ నడుపలేదు. నేను ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. గౌతమ్ నన్ను నీవు సింగిలా? అని అడిగితే.. అవును నేను సింగల్ అని చెప్పాను. మధ్యలో ప్రిన్స్ యావర్ వచ్చి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. దాంతో నేను చిన్నగా నవ్వాను. అంతేగానీ నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కాదు. ఎవరైనా నన్ను హెల్తీగా ఫ్లర్ట్ చేస్తే హ్యాపీగా ఫీలయ్యాను. గౌతమ్ మ్యారేజ్ మెటీరియల్. నేను ఎవరితో పులిహోర కలుపలేదు అని నయని పవని తెలిపింది.

నాతోపాటు ఇంటిలోకి వచ్చిన అశ్వినీ శ్రీతో నేను కనెక్ట్ కాలేకపోయాను. అశ్వినీ నెగిటివ్ అప్రోచ్ ఉంది. ఏదైనా చెబితే పాజిటివ్ వేలో తీసుకోవడం లేదు. ఈ వారం నేను కాకుండా అశ్వినీ శ్రీ ఎలిమినేట్ అవుతానని అనుకొన్నాను. ఇప్పటికి నేను ఎలిమినేట్ అయ్యాననే విషయాన్ని నమ్మకం కావడం లేదు. ప్రతీ చిన్న విషయానికి ఏడుస్తు ఉంటుంది. నాకు నచ్చని వాళ్లకు దూరంగా ఉంటాను అని నయని పవని చెప్పింది.

Bigg Boss Telugu 7 Contestant Nayani Pavani bold comments on love track with Gowtham Krishna and Prince Yawar

శివాజీతో నాకు మంచి కనెక్షన్ ఏర్పడింది. ఆయనతో నాకు ఎమోషనల్ బాండింగ్ కలిగింది. నా తండ్రి తర్వాత తండ్రిలాగా శివాజీ కనిపించాడు. నా తండ్రి చనిపోయిన తర్వాత ఓ వ్యక్తిని కౌగిలించుకోవడానికి సమయం పట్టింది. శివాజీ, తేజతోపాటు అందరూ నేను ఇంటి నుంచి వస్తుంటే.. ఏడ్చారు. ఇంటిలో కూడా ఏ ఒక్కరు కూడా నా ఎలిమినేషన్‌ను ఊహించలేదు అని నయని పవని చెప్పింది.

ఇంటిలో భోలా షవాలే, అశ్వినీ శ్రీ పనికి రాని వాళ్లు. ఒకరు ఎయిమ్ లెస్, మరొకరు బ్రెయిన్ లెస్. బుర్రలేని కంటెస్టెంట్ అశ్వినీ శ్రీ. తన గురించి ఏదో చెడు మాట్లాడుకొంటారనే ఫీల్‌లో ఉంటుంది అని చెప్పారు. శివాజీ, అంబటి అర్జున్, శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్ నాకు చాలా దగ్గరయ్యాను అని నయని పవని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X