Bigg Boss Telugu 7: తనకు కప్పు రాదని శివాజికి ముందే తెలుసా.. మరెందుకు అలా చేశారు.. అసలు సీక్రెట్ రివీల్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ముగిసిన ఆ ఫీవర్ మాత్రం ఇంకా తగ్గట్లేదు. ముఖ్యంగా విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ సంబురాలు చేసుకుంటుండగా... శివాజి మాత్రం చాలా బాధ పడిపోతున్నాడు. కేవలం ఆయన మాత్రమే కాదు ఆయన అభిమానులు అంతా కూడా తెగ ఫీలైపోతున్నారు. అసలు విన్నర్ గా గెలుస్తాడు అనుకున్న ఇతడు ఓడిపోవడం ఏంటని అంతా షాకవుతున్నారు. ఇప్పటికీ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా విన్నర్ కాకపోయినా రన్నరప్ అయినా కావాల్సిందే కదా అంటూ చెప్పుకొస్తున్నారు.

కానీ తాను గెలవట్లేదని శివాజికి ముందే తెలుసిందని చెప్పి ఓ కంటెస్టెంట్ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా వారి కోసమే దీని గురించి మాట్లాలదేంటూ అసలు సీక్రెట్ ను బయట పెట్టింది. అయితే బిగ్ బాస్ ట్రోఫీని కూడా వదులుకోవడానికి కారణం ఏంటి, మరెందుకు ఆయన అలా చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bigg Boss Telugu 7 Contestant Nayani Pavani Revealed The Reason Behind Sivaji Defeat

బిగ్ బాస్ మొదటి వారంలోనే హౌస్ లో అడుగు పెట్టిన శివాజి అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హౌస్ మేట్స్ అంతా కలిసి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను కార్నర్ చేస్తే.. ఏమాత్రం ఆలోచించకుండా అతడికి అండగా నిలబడ్డాడు. అలాగే యావర్ కు అండగా ఉంటూ వారిద్దరి ప్రేమాభిమానాలను పొందాడు. వారిని ఎవరు ఏమన్నా వారికి గట్టిగా ఇస్తూ కాపాడుకుంటూ వచ్చాడు. అలాగే వాళ్లు కూడా శివాజిని తమ సొంత అన్నగా భావిస్తూ ఆయనకు బాగా సాయం చేశారు. చేయి నొప్పితో బాధ పడుతుంటే ఆయన పనులు అన్నీ వీళ్లే చేశారు. ముఖ్యంగా ఆయనకు తరచుగా మసాజ్ చేస్తూ ఆయన వెంటే ఉన్నారు.

Bigg Boss Telugu 7 Contestant Nayani Pavani Revealed The Reason Behind Sivaji Defeat

వీరి ముగ్గురి బాండింగ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే ముందు నుంచి అంతా శివాజియే గెలుస్తారని అనుకున్నారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ విన్నర్ అని శివాజి రన్నరప్ అని కూడా పెద్ద ఎత్తున చర్చ సాగింది. అమర్ దీప్ టాప్ 3కే పరిమితం అవుతాడనుకోగా.. ఆయన టాప్ 2కి రావడంతో శివాజికి అన్యాయం జరిగిందని అంటున్నారు. ఇదే విషయాన్ని శివాజి కూడా చెప్పుకొచ్చారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో శివాజి కూతురుగా పేరు తెచ్చుకున్న నయని పావని.. అసలు విషయాన్ని చెప్పేసింది. దేవుడు ఇచ్చిన తన నాన్న శివాజి.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవడం కోసమే ఓడిపోయాడని చెప్పుకొచ్చింది.

Bigg Boss Telugu 7 Contestant Nayani Pavani Revealed The Reason Behind Sivaji Defeat

పల్లవి ప్రశాంత్ కు సాయంగా నిలిచిన రైతులను గెలిపించాలని అనుకున్నాడని.. అందుకే ఆయన టైటిల్ కూడా వదులుకోవాలనుకున్నారని నయని పావని వెల్లడించింది. కానీ శివాజి సెకండ్ ప్లేస్ లో ఉంటే బాగుండేదని కానీ టాప్ 3కి వస్తారని తాను అస్సలే ఊహించలేదని చెప్పుకొచ్చింది. శివాజికి కూడా రైతుబిడ్డ గెలుస్తాడని తెలిసినట్లే అనిపిస్తోంది. కానీ రన్నరప్ గా ఉంటాడనుకుంటే బిగ్ బాస్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్ కే సెంకడ్ ప్లేస్ ఇచ్చుకున్నారంటూ చాలా మంది అభిమానులు రచ్చ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X