Bigg Boss Telugu 7: లక్కి ఛాన్స్ పట్టేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. విన్నర్ కాకముందే పవర్ స్టార్ మూవీలో ఆఫర్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది. ఇక ప్రస్తుతం హౌస్ లో 8 కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ఓ వ్యక్తి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి.. టాప్ ప్లేస్ లో నిలుస్తున్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ఇక ఈ సీజన్ టైటిల్ విన్నర్ రేసులో ఉన్నాడు పల్లవి ప్రశాంత్. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ విన్నర్ కాకముందే ప్రశాంత్ కు బంపర్ ఆఫర్ వచ్చింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీలో నటించే అవకాశం పట్టేశాడు ఈ కామన్ మ్యాన్. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మరో రెండు వారాల్లో ముగియనుంది. ఫినాలే ఎపిసోడ్ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్, శోభా శెట్టి, ప్రియాంక, గౌతమ్.. ఉన్నారు. టైటిల్ గెలిచేందుకు వీరంతా పోటా పోటీగా పోరాడుతున్నారు.

ఇక ఈ వారం ఫినాలే అస్త్ర కోసం పోటీలు నిర్వహించగా.. అర్జున్ గెలిచుకున్నాడు. అర్జున్ అంబటి ఫస్ట్ ఫైనాలిస్ట్ అయ్యాడు. ఆ విషయం పక్కన పెడితే.. కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టాప్ 5 కంటెస్టెంట్స్ లో అర్జున్ అంబటి, అమర్ దీప్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేసులో ఉన్న పల్లవి ప్రశాంత్ కు బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఇంకా టైటిల్ కూడా గెలువలేదు.. అప్పుడే ఈ కంటెస్టెంట్ కు లక్కీ ఛాన్స్ వచ్చింది. పల్లవి ప్రశాంత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో ఛాన్స్ కొట్టేశాడని తెలుస్తోంది. ఈ న్యూస్ తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.

ఒక కామన్ మ్యాన్ గా, రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగు పెట్టిన ప్రశాంత్.. టైటిల్ రేసులో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదట రతికతో పులిహోర కలిపినా.. ఆ తర్వాత తప్పు తెలుసుకుని కరెక్టు దారిలోకి వచ్చాడు. స్ట్రాటజీలు, సెంటిమెంట్లను ప్లే చేస్తూ.. దూసుకుపోతున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో దుమ్ము దులిపేస్తున్నాడనే చెప్పాలి.
పవన్ కల్యాణ్ హారీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. బిగ్ బాస్‌ను డైలీ ఫాలో అయ్యే వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒకరని తెలుస్తోంది. ఆయనకు ప్రశాంత్ గేమ్ బాగా నచ్చేసిందని.. అందుకే హరీష్ శంకర్ తాను ప్రస్తుతం చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో ప్రశాంత్ కు ఓ పాత్ర ఇవ్వాలని అనుకుంటున్నారని ఫిలిం వర్గాల సమాచారం. ఫినాలే ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్చి హరీష్ ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తాడని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ ఫ్యాన్స్ లక్కంటే ఇదే అంటూ కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











