Pallavi Prashanth Parents: రతిక మా కొడుకుని వాడుకుంది... పల్లవి ప్రశాంత్ తల్లి షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3వ తేదీన గ్రాండ్ గా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ లో 14మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక గతవారం ఒకరు ఎలిమినేట్ అవ్వగా.. 13మందితో షో నడుస్తోంది. ఇక ఆ 13మందిలో ఓ కామన్ మ్యాన్ గా పల్లవి ప్రశాంత్ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. అయితే పల్లవి ప్రశాంత్ గురించి ఆయన తల్లిదండ్రులు షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుకుని రతికా వాడుకుందని ఆరోపించారు. ఆ వివరాల్లోకి వెళితే...
కామన్ మ్యాన్ కోటాలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ హౌజ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక రైతు బిడ్డ ట్యాగ్ తో సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోయాడు. ఆయన యూట్యూబ్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆ వీడియోల్లో బిగ్ బాస్ షోకు వెళ్లాలంటూ తన కోరికను చెప్పుకు వచ్చాడు. అందుకుతగ్గట్లుగా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టి.. తనదైన శైలిలో ఆట ఆడుతున్నాడు.

ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ పై ఇటీవల కాలంలో ట్రోలింగ్ ఎక్కువ అయింది. ఆయన ఓవరాక్షన్ చేస్తున్నారంటూ కామెంట్స్ వినిపించాయి. ఇక రతికా రోజ్ తో లవ్ ట్రాక్ చూసి రైతు బిడ్డ అని చెప్పి... అందులోకి వెళ్లి ఏం చేస్తున్నావని కామెంట్స్ వినిపించారు. ఇక మొదటి వారం నామినేషన్స్ లో8 మంది నామినేట్ చేయగా... ప్రేక్షకులు రికార్డు స్థాయిలో ఓట్లు వేసి ప్రశాంత్ ను సేఫ్ చేశారు.
ఇక సెకండ్ వీక్ నామినేషన్స్ విషయానికి వచ్చేసరికి... పల్లవి ప్రశాంత్ ను హౌజ్ మొత్తం టార్గెట్ చేసింది. ఇక రైతుబిడ్డ అయితే ఏంటి? అందరూ కష్టపడుతున్నారని అమర్ దీప్ మండిపడిన విషయం తెలిసిందే. రతికా రోజ్ అయితే మరీ దారుణంగా కుక్కలాగా తిరిగితే.. హౌజ్ లోకి వచ్చి ఏం చేశావని అడిగింది. దీంతో రతికాతో పల్లవి ప్రశాంత్ లవ్ ట్రాక్ కాస్త... రివర్స్ అయిపోయింది.

అయితే ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొని.. షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుకును అమర్ దీప్ చౌదరి ఏరా పోరా అని గౌరవం లేకుండా మాట్లాడటం బాధ కలిగించిందని తండ్రి చెప్పుకువచ్చారు. రైతుబిడ్డ అనే కారణంతోనే తక్కువగా చూస్తున్నారంటూ ఆరోపించారు. బిగ్ బాస్ హౌస్లో అందరూ సమానమేనని.. నా కొడుకు బిగ్ బాస్ హౌజ్ లోకి పోవడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పుకువచ్చారు.

ఇక పల్లవిప్రశాంత్ తల్లి మాట్లాడుతూ.... రతికా రోజ్ మా అబ్బాయిని వాడుకుంది. అతనితో ఉంటే తనకు కూడా ఓట్లు పడతాయని అనుకుంది. పల్లవి ప్రశాంత్ అందరినీ అక్కా చెల్లి అంటాడు. అతనికి అలాంటి దురుద్దేశం లేదు. బిగ్ బాస్ హౌజ్ నుంచి వచ్చాకా పల్లవి ప్రశాంత్ పెళ్లి చేస్తాం. ఆయన కప్ కొట్టుకొచ్చినా ఓకే... కొట్టుకురాకపోయినా పర్వలేదు. నాగార్జునను కలవడమే మాకు విజయమంటూ చెప్పుకువచ్చారు.


Click it and Unblock the Notifications











