Prince yawar: ప్రిన్స్ యావర్‌కు హ్యాండిచ్చిన నయని పావని.. స్టేజీమీదే కన్నీరు పెట్టుకున్న కుర్రాడు!

బిగ్ బాస్ తెలుగు 7షో గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరి మనుసులు గెలుచుకున్న టాప్ 5 కంటెస్టెంట్లను అయితే అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా స్పై బ్యాచ్ లో ఒకడిగా తిరిగిన ప్రిన్స్ యావర్ గురించి.. ఆయన నయని పావనితో కలిపిన పులిహోర గురించి కూడా అందరికీ తెలిసిందే.

అయితే గత కొంత కాలం క్రితం ఈయన నేరుగా నయని పావని వద్దకు వెళ్లి తన ప్రేమ గురించి చెప్పగా ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. ఈవిషయాన్ని నేరుగా నయని పావనియే తెలిపింది. అయితే తాజాగా ప్రిన్స్ యావర్ నీతోనే డ్యాన్స్ షోలోకి కంటెస్టెంట్ గా వచ్చాడు. ఈక్రమంలోనే తన ప్రేయసి తనను వదిలేసిందని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అతడిలా చెప్పడంతో అది నయని పావనియే అని అంతా అనుకుంటున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bigg Boss Telugu 7 Contestant Prince Yawar Gets Emotional For Nayani Check Details

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లిన నయని పావని అతి తక్కువ సమయంలోనే స్పై బ్యాచ్ తో క్లోజ్ అయింది. ముఖ్యంగా శివాజిని నాన్న అంటూ ఆయన తమ్ముడిగా చెప్పుకుంటున్న యావర్ తో లవ్ ట్రాక్ నడిపింది. యావర్ కూడా రతికాతో పులిహోర కలిపినట్లు కాకుండా.. ఈమె విషయంలో చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేశాడు. అయితే హౌస్ లోంచి బయటకు వచ్చినప్పుడు వీళ్లతో ఎక్కువ కాలం గడపలేకపోయినందుకు చాలా ఎమోషనల్ అయింది.

కానీ బయటకు వచ్చిన తర్వాత నుంచి మాత్రం వీరితో బాగానే టైమ్ స్పెండ్ చేస్తోంది. ముఖ్యంగా యావర్ తో కలిసి వీడియోలు చేయడం, డ్యాన్సులు చేయడం కూడా చేసింది. ఇలా అందరు మెచ్చిన జోడీగా మంచి పేరు తెచ్చుకున్న వీళ్లు ఆ తర్వాత కూడా ఇలాగే తమ రిలేషన్ కొనసాగిస్తూ కలిసి కెరియర్ లో ఎదుగుతామని చెప్పారు. అయితే తాజాగా ప్రిన్స్ యావర్ నీతోనే డ్యాన్స్ 2.0 షోకి వచ్చాడు. ఈక్రమంలోనే అంతా నయని పావనితో కలిసి వస్తాడని అనుకోగా.. తాను మాత్రం వేరే అమ్మాయితో వచ్చాడు.

ముందుగా ఒంటరిగా వచ్చిన ప్రిన్స్ యావర్.. ఏడుస్తూ కనిపించాడు. ఏమైంది ఒక్కడివే వచ్చావు, ఎందుకు ఏడుస్తున్నావు అనగా నా లవర్ నన్నొదిలేసిందని చెబుతూ మరింత ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ఆయన మాట్లాడింది నయని పావని గురించే అని అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి కాకుండా వేరే అమ్మాయితో యావర్ కనిపించగా.. నిజంగానే వీరిద్దరికి బ్రేకప్ అయిందని అనుకుంటున్నారు. చూడాలి మరి అఫీషియల్ గా వీరిద్దరూ ఈ విషయంపై స్పందించే వరకు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X