బిగ్‌బాస్ బ్యూటీ ప్రేమలో ప్రిన్స్ యావర్.. తనకూ ఓకే అంటూ ఇండైరెక్ట్‌గా సిగ్నల్ ఇచ్చిన ముద్దుగుమ్మ!
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ షోలో రెండు గ్రూపుల మధ్యే ఎక్కువగా పోటీ జరగ్గా.. వారంతా హైలెట్ అయ్యారు. అలా హైలెట్ అయిన వాళ్లలో శివాజీ గ్రూపు మెంబర్ ప్రిన్స్ యావర్ ఒకడు. అయితే తాజాగా ఈయన బిగ్ బాస్ బ్యూటీపై తనకు ఉన్న ప్రేమను మరోసారి వ్యక్త పరిచాడు.
తనంటే ఇష్టం అని ఇటీవలే ఆ అమ్మాయికే నేరుగా చెప్పిన ఈయనకు.. ఆ అమ్మాయి కూడా ఇండైరెక్ట్ గా తన లవ్ ను చెప్పేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈయన ప్రపోజ్ చేసిన అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఇతడి కోసం ఏం చేసి తన ప్రేమను వ్యక్త పరిచిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో టాప్ 4 కంటెస్టెంట్ గా నిలిచిన ప్రిన్స్ యావర్ కు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. పల్లవి ప్రశాంత్, శివాజిలతో కలిసి ఉంటూ అద్భుతంగా గేమ్స్ ఆడిన ఈయన.. బయటకు వచ్చినప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అయితే ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ నయని పావనితో కలిసి ఈయన కుర్చీ మడత పెట్టి సాంగ్ కు స్టెప్పులు వేశాడు. చాలా రొమాంటిక్ గా ఈ డ్యాన్స్ సాగింది.
ఈ సాంగ్ విడుదల అయిన తర్వాత నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈక్రమంలోనే నయని పావని పలు ఇంటర్వ్యూల్లో పాల్గొనగా.. ఆమెకు ఇవే ప్రశ్నలు ఎదురు అయ్యాయి. వీటికి ఆమె కూడా ప్రిన్స్ యావర్ కు నేనంటే ఇష్టం అనే చెప్పాడని చెప్పింది. అయితే తనకు కూడా అతడితో మంచి బంధమే ఉందని చెప్పింది కానీ ప్రేమ అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత నుంచి వీరిద్దరూ నీతోనే డ్యాన్స్ షోలో కూడా జోడీగా డ్యాన్స్ లు చేస్తున్నారు. అయితే తాజాగా ప్రిన్స్ యావర్ చేసిన కామెంట్లు సెన్సేషనల్ గా మారాయి.

ముఖ్యంగా యావర్ ఓ సినిమాలో లీడ్ లో చేస్తున్నాడు. ముఖ్యంగా శివభక్తుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగానే యావర్ వెంట బిగ్ బాస్ కంటెస్టెంట్లు వచ్చారు. వారిలో టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, శివాజి, నయని పావని, సింగర్ ధామినిలు వచ్చారు. ఈక్రమంలోనే ప్రిన్స్ యావర్ నయని పావని గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆమెకు ఆరోగ్యం బాలేకపోయినా తనకోసం ఇక్కడకు వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు మాత్రమే కాదు.. తనకోసం పర్సనల్ లైఫ్ లో ప్రతీసారి బ్యాక్ బోన్ గా నిలబడుతుందని చెప్పాడు. ఏ కష్టం వచ్చినా నీవెంట నేనున్నానంటూ చెప్పుకుంటూ తనను ముందుకు నడిపిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. గతంలో నయని చేసిన కామెంట్లు.. ప్రిన్స్ యావర్ కోసం ఆరోగ్యం బాగాలేకపోయినా ఇలా రావడం చూసిన ప్రతీ ఒక్కరూ వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని భావిస్తున్నారు. ఈక్రమంలోనే యావర్ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారాయి. చూడాలి మరి వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా లేక స్నేహాన్ని కొనసాగిస్తున్నారా అనేది.


Click it and Unblock the Notifications











