Priyanka Jain: పెళ్లికి ముందే వరుస గుడ్ న్యూస్ లు.. ప్రియాంక జైన్ దశ తిరిగిపోయిందిగా!

మౌనగారం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు వెళ్లి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ మధ్య యూట్యూబ్ లో, పలు టీవీ షోలలో తెగ సందడి చేస్తున్న ఈమె తాజాగా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా బుల్లితెరపై ఓ ప్రోగ్రాంలో పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతున్నారు. మరి ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అద్భుతంగా గేమ్ అడి అందరినీ అలరించిన ప్రియాంక జైన్ టాప్ 5కి చేరింది. ముఖ్యంగా అమర్ దీప్, శోభాశెట్టిలతో చాలా స్నేహంగా ఉంటూ చక్కగా గేమ్ ప్లే చేసింది. చూసేందుకు పొట్టిగా ఉన్నా సరే అందరు మెచ్చేలా గేమ్ ఆడుతూ అందరినీ మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా షోలో ఉండగానే తాను ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాకుండా అతడి ఫ్యామిలీ వీక్ లోభాగంగా హౌస్ లోకి రాగా ముద్దుల వర్షం కురింపించింది. పెళ్లి ఎప్పుడు చేసుకుందామంటూ అడిగి రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకుంది.

Bigg Boss Telugu 7 Contestant Priyanka Jain And Shiva Kumar Says Another Good News Check Details

ముఖ్యంగా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి తిరుగుతూ రచ్చ చేస్తోంది. పూజలు పనస్కారాలు చేయడంతో పాటు ఢిల్లీ, బెంగళూరు, గోవా వంటి ప్రాంతాలకు కూడా వెళ్తూ రచ్చ చేస్తోంది. అయితే సీరియల్స్ మానేసి యూట్యూబ్ వీడియోలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఓ షోలో భాగంగా తన ప్రియుడు శివ్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు తన కుటుంబ సభ్యులు కూడా రావడం గమనార్హం.

షోలో భాగంగానే ఈ క్యూట్ కపుల్ పెళ్లి చేసుకోగా.. నిజంగానే వాళ్ల పేరెంట్స్ రావడంతో అంతా ఈ పెళ్లి నిజం అనుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ఇదంతా ఇలా ఉండగా.. ఆ పెళ్లి తర్వాత నుంచి ప్రియాంక జైన్, శివ్ కుమార్ లు వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతున్నారు. ముఖ్యంగా తాము పెళ్లి చేసుకోవడానికి ముందే బాగా సెటిల్ అవ్వాలని.. అందుకోసం ఓ ఇల్లు కూడా కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకోసమే ఇంటి కొనుగోలు కోసం అనేక చోట్లకు తిరిగారు. అనేక అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ కొనాలని చూశారు.

Bigg Boss Telugu 7 Contestant Priyanka Jain And Shiva Kumar Says Another Good News Check Details

ఓ ఫ్లాట్ తమకు బాగా నచ్చి టోకెన్ డబ్బులు కూడా చెల్లించారట. కానీ అంత డబ్బులు పెట్టి అపార్ట్ మెంట్ లో కొనడం కంటే.. ఇండీపెండెంట్ గా ప్లేస్ తీసుకుని.. తామే దగ్గరుండా ఇల్లు కట్టించుకోవాలని ఉందని ఆ నిర్ణయాన్ని ఆపేశారట. అలా కొనుగోలు వరకూ వెళ్లిన అపార్ట్ మెంట్ హౌస్ కు బదులుగా.. హైదరాబాద్ లోనే ఓ ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారు. ముఖ్యంగా తమకు నచ్చిన ఏరియాలో... ఓ పెద్ద స్థలం తీసుకున్నారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయి.

అయితే తాజాగా తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని చెప్పడంతో పాటు.. తాము కొనుగోలు చేసిన స్థలాన్ని కూడా చూపించారు. అలాగే త్వరలోనే ఇల్లు కట్టబోతున్నట్లు చెప్పారు. అయితే జూన్ వరకు మంచి ముహూర్తాలు లేకపోవడం వల్ల కొంత కాలం తాము ఆగాల్సి వస్తోందని.. కానీ ఆ తర్వాత వెంటనే కన్ స్ట్రక్షన్ ప్రారంభిస్తామని వెల్లడించారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X