కష్టాల కడలిలో ప్రియాంక జైన్.. మొన్న అమ్మకు, నేడు అత్తకు అనారోగ్యం.. అయినా అదిరిన సర్‌ప్రైజ్!
బిగ్ బాస్ బ్యూటీ.. పొట్టి పిల్ల ప్రియాంక జైన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈమె బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి అనేక సమస్యలు ఎదుర్కుంటోంది. ముఖ్యంగా గతంలో తన తల్లికి క్యాన్సర్ సోకగా.. ప్రస్తుతం ఆమెకు కాబోయే అత్తగారు అనారోగ్యం పాలయ్యారు. అయితే ఆమెకు ఉన్న సమస్యలతో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా... ఇలాంటి సమయంలోనే ఆమెకు ఓ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చి తెగ సంబురపడేలా చేసింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మౌనరాగం సీరియల్ తో పాటు జానకి కలగనలేదు సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ షోకు వెళ్లి వచ్చిన ప్రియాంక అక్కడే తన ప్రియుడి గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఆయనతో రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. లివింగ్ రిలేషన్ కొనసాగిస్తున్న వీళ్లు.. బిగ్ బాస్ షో తర్వాతే తన ప్రియుడిని అందిరకీ పరిచయం చేసింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వివరించారు. ఓ రియాల్టీ షోలో కుటుంబ సభ్యుల నడుమ పెళ్లి కూడా చేసుకున్నారు.

అయితే అఫీషియల్ గా పెళ్లి చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఇటీవలే హైదరాబాద్ లో స్థలం కొనుగోలు చేసిన ఈ జంట అక్కడే ఇళ్లు కట్టుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇంత సంతోషంగా గడుపుతున్న వీళ్లు అనేక కష్టాలు కూడా ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా మొన్నటి వరకు ప్రియాంక జైన్ తల్లికి క్యాన్సర్ రావడం.. అది నయం అయ్యే వరకు చికిత్స అందించడం గురించి ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చారు. అయితే తాజాగా తనకు కాబోయే అత్త అంటే ప్రియుడు శివ్ కుమార్ తల్లి అనారోగ్యం పాలైనట్లు చెప్పుకొచ్చింది.
శివ్ కుమార్ తల్లికి ఒంట్లో ప్లేట్ లైట్స్ తగ్గి ఒళ్లంతా రెడ్ కలర్ మచ్చలు ఏర్పడుతున్నట్లు వివరించింది. అయితే ఇలా ఇప్పటికే రెండు సార్లు జరగ్గా.. ఆస్పత్రికి తీసుకెళ్లామని ప్లైట్ లైట్స్ తగ్గి రక్తం గడ్డ కడుతూ మచ్చలు ఏర్పడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇలా చాలా కాలంగా ఆమె సమస్యలు ఎదుర్కుంటుందని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అంత బాగాలేదని చెప్పారు. ఆమెకు ట్రీట్ మెంట్ ఇప్పిస్తూ వీడియో కూడా షూట్ చేశారు. అయితే రెండు వారాల పాటు మందులు వాడాకా మళ్లీ ఆస్పత్రికి రమ్మన్నట్లు చెప్పారు. ఆస్పత్రికి నుంచి బయటకు వచ్చాకా ఆమెకు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.
అలా ఆమెను కారులో ఓ చోటుకు తీసుకు వెళ్లారు. ఆమె కళ్లకు గంతలు కట్టి మరీ నీకు లైఫ్ లాంగ్ మర్చిపోలేని సర్ ప్రైజ్ అమ్మా అంటూ శివ్, అత్తమ్మా అంటూ ప్రియాంకలు చెప్పారు. అలా గంతలు కట్టే ఓ చోట కారు ఆపారు. దించి మరీ బోర్డు మీద ఏం ఉందో చదవాలని చెప్పారు. అలా అది చూసిన ప్రియాంక జైన్ అత్తగారు.. తెగ సంబురపడిపోయారు. అయితే గతంలో వీళ్లు హైదరాబాద్ లో కొన్న స్థలం గురించి ఆమెకు చెప్పలేదు. ఈక్రమంలోనే దాన్ని చూపించి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











