Priyanka Jain ఫస్ట్ లవ్ ఇతడే.. శివ్‌తో కలిసి ఎక్స్‌తో లంచ్.. సీక్రెట్ వీడియో వైరల్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ కు కూడా వెళ్లింది. అక్కడ అద్బుతమైన ఆట తీరుతో అందరినీ మెస్మరైజ్ చేసి మరింత క్రేజ్ తెచ్చుకుంది. తన గురించి, తన కుటుంబం గురించి.. ముఖ్యంగా ప్రియుడు శివ్ కుమార్ గురించి కూడా చెప్పింది. అతడినే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వివరించింది. అయితే తొలిసారి తన ఫస్ట్ లవర్ ఎవరో చూపించి షాకిచ్చింది. అతడితో లంచ్ కూడా చేసింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే ప్రియాంక జైన్ తన ప్రియుడు ఎవరో చెప్పింది.. అతడిపై ముద్దుల వర్షం కురిపిస్తూ పెళ్లి ఎప్పుడు చేసుకుందామంటూ క్యూట్ అడిగి రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి రచ్చ చేస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్లినా వీరిద్దరే కలిసి తిరుగుతూ తెగ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన తొలి బాయ్ ప్రెండ్ ను కలిసింది.

 Bigg Boss Telugu 7 Contestant Priyanka Jain First Lover Name And Face Revealed Check Details

అయితే అతడికి ముందుగా మౌనరాగం సీరియల్ లో హీరోగా ఛాన్స్ వచ్చిందట. కానీ పలు కారణాలు వల్ల అతడు ఆ సీరియల్ కు నో చెప్పాడట. కానీ అక్కడే పరిచయం అయిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ తో మాత్రం స్నేహం బాగా కుదిరిందట. అది కాస్తా ప్రేమగా మారిందట. కానీ ఆ తర్వాత అతడు ప్రియాంక జైన్ కు బ్రేకప్ చెప్పాడట. అలా వీరిద్దరి ప్రేమ కథ ముగిసిపోగా.. శివ్ కుమార్ కలవడం, అతడితో ప్రేమలో పడడం జరిగిందట.

అయితే ప్రస్తుతం ప్రియాంక జైన్ తన ఫస్ట్ లవర్ తో కలిసి లంచ్ కు వెళ్లింది. ఇద్దరూ కలిసి చాలా సేపు మాట్లాడుకుని ఫుల్ గా తింటుండగా.. మధ్యలో సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పి శివ్ కుమార్ ను కూడా పిలిచాడు. అలా ఆయన రావడం చూసిన ప్రియాంక ఫస్ట్ షాక్ అయినా ఆ తర్వాత కోలుకొని నాకోసమే వచ్చావా అంటూ అడిగింది. ఆ తర్వాత నేను ప్రియాంకకు నో చెప్పడం వల్లే నీకు ఆమె దొరికిందని అన్నాడు. నేను వేసిన భిక్షే ఇదంటూ పెద్ద పెద్ద డైలాగ్ లు కూడా చెప్పాడు. అదేంటి అని శివ్ అడగ్గా.. అసలు విషయం చెప్పింది ప్రియాంక జైన్.

 Bigg Boss Telugu 7 Contestant Priyanka Jain First Lover Name And Face Revealed Check Details

అయితే అసలు ప్రియాంక జైన్ మొదటి లవర్ గా చెబుతున్నది మరెవరో కాదు.. టేస్టీ తేజ. టేస్టీ తేజతో కలిసి ప్రియాంక తింటుండగా.. మధ్యలో శివ్ కుమార్ వచ్చాడు. నా వల్లే నీకు ప్రియాంక దొరికింది.. నేను నో చెప్పడం వల్లే నీకు ఆ అవకాశం వచ్చిందని అంటాడు. అర్థం కాలేదని చెప్పగా ప్రియాంక నాకు ప్రపోజే చేస్తే నో చెప్పానని అంటాడు. మీకు బిగ్ బాస్ లో పరిచయం నాకు అంతకంటే ముందే పరిచయం అని శివ్ అనగా.. లేదు మౌనరాగం సీరియల్ పస్ట్ హీరోగా నన్నే తీసుకోవాలనుకున్నారని జోక్ చేస్తాడు టేస్టీ తేజ. ఇలా శివ్ ని ఆట పట్టిస్తూ.. ఫుల్ హ్యాపీగా పుడ్ ను ఎంజాయ్ చేశారీ ముగ్గురు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X