ఆపరేషన్ థియేటర్‌లో ప్రియాంక జైన్.. ఆందోళనలో ప్రియుడు శివ్.. అసలేం జరిగిందంటే?
బిగ్ బాస్ తెలుగు 7 షో గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురంచి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆటతో అందరినీ మెప్పిస్తూ.. టాప్ 5లో నిలిచిన వాళ్ల గురించి అయితే మరింత ఎక్కువగా తెలిసే ఉంటుంది. ముఖ్యంగా మౌనరాగం సీరియల్ లో నటించి ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన ప్రియాంక జైన్ అద్భుతంగా ఆట ఆడింది. విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ షోకు వచ్చే వరకూ సింగిల్ అని చెప్పుకున్న ఆమె అక్కడకు వచ్చాక తొలలిసారి తన ప్రేమ గురించి చెప్పింది.
అంతేకాకుండా ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లోకి అడుగు పెట్టిన అతడు ప్రియాంక జైన్ తో ఫుల్ రొమాన్స్ చేశాడు. అక్కడే పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అంటూ మాట్లాడుకుని రొమాంటిక్ కపుల్ గా నిలిచిపోయారు. ప్రియాంక హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి వారిద్దరూ కలిసే కనిపిస్తున్నారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ 2024లోనే పెళఅలి చేసుకుంటామని కూడా ప్రకటించారు. అయితే తాజాగా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేశాడు ప్రియాంక జైన్ ప్రియుడు శివ్ కుమార్. ముఖ్యంగా ఆమె ఆస్పత్రిలో ఉన్నట్లు చూపించాడు.

గత 20 సంవత్సరాలుగా ప్రియాంక జైన్ బాధ పడుతున్న ఓ సమస్యకు ఇకపై చెక్ పెట్టాలని అనుకుందట. అందులో భాగంగానే ఆస్పత్రికి వెళ్లగా.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారట. ఇక ఆలస్యం చేయకూడదని భావించిన ప్రియాంక జైన్, శివ్ కుమార్ తో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఆమె 20 సంవత్సరాలుగా బాధ పడుతున్న ఆరోగ్య సమస్య ఏంటో ఎప్పుడు శస్త్ర చికిత్స చేయించుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రియాంక జైన్ కు చాలా కాలంగా కళ్లు సరిగ్గా కనిపించవట. అందుకే ఆమె ఎక్కువగా స్పెక్స్ పెట్టుకుని కనిస్తుంది. 20 ఏళ్లుగా ఆమె కళ్ల జోటు పెట్టుకునే ఉంటుందట. ఎప్పుడైనా షూటింగ్ సమయాల్లో, ఏవైనా ఫఁక్షన్లు, పార్టీలు ఉన్నప్పుడు మాత్రం లెన్స్ పెట్టుకుంటుంద. కానీ లెన్స్ ద్వారా చాలా సమస్యలు రావడంతో కళ్లజోడుకే పరిమితం అయిందట. ఎలాగైనా సరే ఆ సమస్యను తొలగించుకోవాలని భావించిన ఆమె ఆస్పత్రికి వెళ్లగా.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

ఈక్రమంలోనే ఆమె ప్రతీసారి ఆస్పత్రికి వెళ్లడం.. అక్కడే శివ్ కుమార్ వీడియో తీయడం జరిగేది. తాజాగా దీన్నే పూర్తి వీడియోగా మలిచి తమ యూట్యూబ్ ఛానెల్ నెవర్ ఎండింగ్ టేల్స్ లో పోస్ట్ చేశారు. అందులో ప్రియాంక ఆస్పత్రికి వెళ్లిన దగ్గర నుంచి శస్త్ర చికిత్స చేయించుకోవడం వరకు అన్నీ వివరించారు. మీరూ ఓసారి ఈ వీడియో చూస్తే ఇంకా పూర్తిగా తెలుస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం నేరుగా యూట్యూబ్ లోకి వెళ్లి చూసేయండి.


Click it and Unblock the Notifications











