Bigg Boss Telugu 7 బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్‌తో ప్రేమాయణం.. ప్రియా.. రతికగా అయ్యిందిలా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ షోకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇక ఈ హౌజ్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఇందులో ఏడుగురు మగవారు కాగా.. ఏడుగురు మహిళ కంటెస్టెంట్స్. ఇక ఇందులోకి ఎంటర్ అయిన రతికా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసింది. ఆమె అసలు పేరు ప్రియ. అంతే కాదు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తో కూడా ప్రేమాయణం నడిపిందంట. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎట్టకేలకు ప్రారంభం అయింది. ఇక ఇందులోకి అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్స్... తమదైన శైలిలో గేమ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే రతిక సీక్రెట్ టాస్క్ లో భాగంగా హౌజ్ మెంబర్స్ మధ్యలో పుల్లలు పెట్టేందుకు తెగ ప్రయత్నం చేస్తోంది. అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య గొడవలు సృష్టించేందుకు ప్లాన్స్ వేస్తోంది.

ఆ విషయం పక్కన బెడితే... అసలు ఎవరీ రతికా.. ఇప్పటి వరకు మనం ఈ పేరు వినలేదు అనుకుంటున్నాం. అసలు ఆమె అసలు పేరు రతిక కాదు.. ఆమె పేరు ప్రియ. ఇక ఈ ప్రియ అందరికి సుపరిచితమే. ఈటీవీలో ప్రసారం అయ్యే పటాస్ షో లో ప్రియా ఎన్నో ప్రొగ్రామ్స్ చేసింది. ఆమె పేరు పటాస్ ప్రియ. ఆమె షోస్ ఇప్పటికి యూట్యూబ్ లో ఉన్నాయి.

ఇక ఆమె తన పేరు ప్రియను.. రతికగా మార్చుకుంది. ఎందుకు అనేది మాత్రం తెలియదు. ఇక ఈమెకు లవ్ బ్రేకప్ అయిందంట. అతను ఎవరో కాదు... బిగ్ బాస్ లో షోల్లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్. అతనితో ప్రేమలో పడి... మునిగి తేలిందంట. ఏమైందో తెలియదు.. వారికి బ్రేకప్ అవ్వడంతో... రతిక తన లైఫ్ తను లీడ్ చేస్తోంది.
ఇక ఈ భామకు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈమె సినిమాల్లో కూడా నటించింది. షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది చిత్రంలో రతికా ఓ పాత్రలో నటించింది. కానీ ఆమెకు గుర్తింపు తీసుకురాలేకపోయింది. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది.

ఇక ఆ తర్వాత బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన నేను స్టూడెంట్ సర్ చిత్రంలోనూ నటించింది రతికా. ఈమె ఈ సినిమాలో ఓ పోలీసు అధికారిగా నటించింది. ఈ పాత్రకు ఆమె మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టింది. ఇక ఈమెకు రెమ్యూనరేషన్ బాగానే ఇస్తున్నారు. వారానికి ఈమెకు రూ.2 లక్షల చొప్పున ఇస్తున్నారు బిగ్ బాస్ టీం.


Click it and Unblock the Notifications











