Rathika Rose: 2 పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన రతికా.. ఏవేవో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో పాల్గొని సెన్సేషన్ క్రియేట్ చేసిన అచ్చమైన తెలుగు అమ్మాయి రతికా రోజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం కల్గిన ఈమె.. తాను చేసే పనులతో విపరీతమైన నెగిటివిటీని సొంతం చేసుకుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ పై ఆమె వ్యవహరించిన తీరుతో ఫుల్ నెగిటివిటీ రాగా.. హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చి మరీ దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేసింది.

గతంలో చాలా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ క్యూట్ బ్యూటీ.. ఇప్పుడు మెయిన్ లీడ్ లో కనిపించేందుకు సిద్ధం అవుతుంది. ముఖ్యంగా 2 సినిమాల్లో హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పింది. అయితే ఆ సినిమాలు ఏంటి, ఎలా ఆ ఆఫర్లు అందుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bigg Boss Telugu 7 Contestant Rathika Rose Get Chance as Heroine in 2 Big Movies Check Details

మొదటి వారంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో అడుగు పెట్టిన ఈమె.. రైతుబిడ్డతో వ్యవహరించిన తీరుతో నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. విపరీతమైన నెగిటివిటీ రావడం.. అందులోనూ అమ్మాయి కావడంతో ఈమెకు మరో ఛాన్స్ ఇచ్చారు. అలా రీఎంట్రీ ఇచ్చిన ఆమె శివాజీ, ప్రశాంత్, యావర్ లతో స్నేహంగా ఉంటూ తనపై వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ వచ్చేముందు వారితో మరోసారి గొడవపడి షాక్ ఇచ్చింది.

అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా కోకంటెస్టెంట్లతో కలవని ఈమె.. కెరియర్ లో ముందుకు వెళ్లేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈమె అందం, అభినయానికి ఫిదా అయిన కొందరు తనకు సినిమాల్లో.. హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారట. ముఖ్యంగా తమిళంలో ఓ పెద్ద ప్రొడక్షన్ లో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని.. అయితే దాన్ని వాళ్లు అధికారికంగా ప్రకటించిన తర్వాతే తాను కూడా రివీల్ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది.

Bigg Boss Telugu 7 Contestant Rathika Rose Get Chance as Heroine in 2 Big Movies Check Details

కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఓ మంచి సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని.. దానికి తాను సైన్ కూడా చేసినట్లు వివరించింది. అయితే ఇది కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాతే తాను చెప్తానని తెలిపింది. ఇప్పుడిప్పుడే తాను కెరియర్ లో ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశం లేదని తెలిపింది. పెళ్లి చేసుకునేందుకు చాలానే సమయం పడుతుందని వెల్లడించింది.

కేవలం పల్లవి ప్రశాంత్ తో గొడవలు మాత్రమే కాకుండా.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో బ్రేకప్ అయినట్లు కూడా ఈమె చెప్పడంతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బ్రేకప్ అయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పిన ఈమె.. ఇప్పుడిప్పుడే కెరియర్ పై ఫోకస్ చేస్తున్నట్లు వెల్లడించింది. చూడాలి మరి ఏ సినిమాల్లో ఈమె కనిపించనుంది.. మంచి మంచి సినిమాలు చేస్తూ లైఫ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X