Bigg Boss Telugu 7: బయటపడ్డ రతికా రోజ్ మోసం.. అందం కోసం అంత పని చేస్తుందా.. వీడియో వైరల్

ఎన్నో అనుమానాలతో తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల ఆదరణను అందుకున్న షోనే బిగ్ బాస్. డిఫరెంట్ కంటెంట్‌తో ప్రసారం అవుతూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోన్న ఇది.. వరుసగా సీజన్లను జరుపుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇక, ఈ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చి హైలైట్ అయిన రతికా రోజ్.. తనదైన రీతిలో సత్తా చాటుతూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసమే!

రెండు నెలల క్రితమే మొదలైన ఏడో సీజన్‌లోకి 14 మంది సెలెబ్రిటీలు వచ్చారు. అందులో తెలుగు పిల్ల రతికా రోజ్ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఈ అమ్మడు స్టేజ్‌పై నాగార్జునను విమర్శించడమే. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ముందుకు సాగుతోంది. అలాగే, తనదైన స్ట్రాటజీతో ఆడుతూ అందరినీ ఆకర్షించింది.

Bigg Boss Telugu 7 Contestant Rathika Rose Wig Video Goes Viral

ఏడో సీజన్‌ ఆరంభంలో పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ మధ్య ట్రాక్‌ను ఆరంభంలోనే బాగా ఫోకస్ చేశారు. అందుకు అనుగుణంగానే వీళ్ల మధ్య కొన్ని సీన్లను హైలైట్ చేసి చూపించి.. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే ఫీల్ కలిగించారు. ఆ తర్వాత వీళ్లకు గొడవ జరగడంతో రతికాకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఫలితంగా ఆమె షో నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన రతికా రోజ్‌కు మరో ఛాన్స్ కూడా వచ్చింది. ఫలితంగా ఆమె హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో గతంలో కంటే నెమ్మదిగా ఆడుతోంది. పైగా ప్రిన్స్ యావర్‌తో క్లోజ్‌గా ఉంటూ బ్యాడ్ ఇమేజ్‌ను కంటిన్యూ చేసుకుంటోంది. దీంతో పదో వారంలో మరోసారి నామినేషన్‌లోకి రావడంతో పాటు ఎలిమినేషన్ ప్రమాదంలో పడిపోయింది.

Bigg Boss Telugu 7 Contestant Rathika Rose Wig Video Goes Viral

పదో వారానికి గానూ జరుగుతున్న ఓటింగ్‌లో రతికా రోజ్ అందరి కంటే తక్కువ ఓట్లను తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం ఆమె ఎలిమేనేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రతికా రోజ్‌కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ఆమె విగ్ మేటర్ బయటకు రావడంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

తాజాగా బయటకు వచ్చిన వీడియోలో రతికా రోజ్ రాత్రి సమయంలో బిగ్ బాస్ హౌస్‌లో అటు ఇటు చూసింది. ఆ తర్వాత అద్దం ముందుకు వెళ్లి తన జుట్టుకు పెట్టుకున్న 'విగ్' (అచ్చ తెలుగులో చెప్పాలంటే సవరం) తీసేస్తూ కనిపించింది. దీంతో ఆమె అందంగా కనిపించడం కోసం విగ్ పెట్టుకుని జనాలను మోసం చేస్తుందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X