పెళ్లికి ముందే ప్రియుడితో అలాంటి పని చేస్తున్న శోభాశెట్టి.. షాక్‌లో అభిమానులు!
బిగ్ బాస్ తెలుగు 7 షో పార్టిసిపేట్ చేసి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ శోభాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్బుతమైన ఆట తీరుతో మెప్పిస్తూనే.. గట్టి గట్టిగా అరుస్తూ కాస్త నెగిటివిటీని కూడా సొంతం చేసుకుందీ క్యూట్ బ్యూటీ. కార్తీకదీపం సీరియల్ లో మోనితగా కనిపించి తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈమె.. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటినీ దక్కించుకుంది. అయితే షోకు వచ్చేకంటే ముందు వరకు అందరూ ఆమె సింగిల్ అనే అనుకున్నారు. కానీ బిగ్ బాస్ షోలో తన ప్రియుడి గురించి చెప్పి షాకిచ్చింది. ఆ తర్వాత కొంత కాలానికే అతడు హౌస్ లోకి అడుగు పెట్టడంతో అంతా షాకయ్యారు.
ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ లో నిరుపమ్ తమ్ముడిగా కనిపించిన యశ్వంత్ రెడ్డినే శోభా శెట్టి ప్రేమించింది. ఆమె హౌస్ లో ఉన్నప్పుడు పదో వారం ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఆదివారం స్టేజీపైకి వచ్చి అందిరకీ షాకిచ్చాడు నటుడు. అలాగే స్టేజీపై ఉండగానే తన ప్రియురాలు శోభాశెట్టికి ఐ లవ్ యూ చెప్పి తెగ మురిసిపోయింది. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే యశ్వంత్... శోభాశెట్టి లవర్ కావడంతో చాలా మంది ఇంకా షాక్ లోనే ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య బంధం ఇప్పటికే బహిర్గతం కావడంతో తెగ రచ్చ చేస్తోందీ జంట. ముఖ్యంగా శోభా శెట్టి బయటకు వచ్చినప్పటి నుంచి అతడితోనే తిరుగుతోంది.

హౌస్ లో నుంచి అడుగు బయట పెట్టగానే ప్రియుడు యశ్వంత్ రెడ్డి అక్కడకు వచ్చాడు. ఆ తర్వాత అనేక యూట్యూబ్ ఛానెళ్లకు వీరిద్దరూ కలిసే ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే తాజాగా స్టార్ మా పరివార్ న్యూ ఇయర్ ఈవెంట్ లో కూడా కలిసే కనిపించిందీ జంట. ఈక్రమంలోనే స్పెషల్ గా ప్రపోజే చేసి చేతికి ఉంగరం కూడా తొడిగాడు. ఇక్కడే వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అలా ఎంగేజ్ మెంట్ జరిగిందో లేదో ఇలా ఈ అమ్మడు పెళ్లికి ముందే మరో అడుగు ముందుకు వేసింది. దీనికి వీరి తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పడం గమనార్హం. అయితే అసలు శోభాశెట్టి ఏం చేసింది.. వారి తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ చేస్తున్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శోభాశెట్టి ఆమె ప్రియుడు యశ్వంత్ రెడ్డిలు కలిసి పెళ్లికి ముందే ఇల్లు కొనుక్కున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఈ క్యూట్ బ్యూటీ హౌస్ కొనుక్కోవాలని నిశ్చయించుకుందట. అంతే వెంటనే ఓ పెద్ద అపార్ట్ మెంట్ లో హౌస్ కొనేసింది. తనకు హైట్ లో ఉండడం అంటే ఇష్టం అని ఏకంగా 15వ అంతస్తులో ఫ్లాట్ కొనుక్కుంది. తనకు ఇంటి గురింటి, ఇంటి ఇంటీరియర్ గురించి ఆమెకు ఎక్కువగా తెలియకపోవడంతో ప్రియుడు యశ్వంత్ రెడ్డికి ఆ పనులు అప్పజెప్పింది. అదే విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపింది.

తన తండ్రి ఇప్పటికే ఆ ఇల్లు చూశాడని... కానీ తల్లి చూడకపోవడంతో మొదటి సారి ఆమెను కూడా ఈ ఇంటికి తీసుకు వచ్చింది. అప్పటికే యశ్వంత్ ఇంట్లో ఉన్నాడు. ఇలా ఇల్లంతా తిరిగి చూపిస్తూ... తాము పెళ్లయ్యాక ఇక్కడే కలిసి ఉంటామని కూడా వెల్లడించింది. అలాగే గెస్ట్ రూంలు చూపిస్తూ.. తన తల్లిదండ్రులతో పాటు యశ్వంత్ వాళ్ల తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఇక్కడే పడుకుంటారని పేర్కొంది. ఇలా తమ డ్రీమ్ హౌస్ ను ఇప్పుడే నిర్మించుకుంటున్న ఈ జంట మరి ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











