Bigg Boss Telugu 7: పెళ్లి కాకుండానే తల్లైన శోభా శెట్టి.. లైవ్‌లో నిజం చెప్పిన లవర్ యశ్వంత్ రెడ్డి
తెలుగు బుల్లితెరపైకి వచ్చిన కొత్తలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకుని సత్తా చాటింది బిగ్ బాస్. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా నిర్వహకులు వరుసగా సీజన్లను తీసుకు వస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో రసవత్తరంగా నడుపుతున్నారు. ఇందులోకి కంటెస్టెంట్‌గా వచ్చి సెన్సేషన్ అయిన వారిలో శోభా శెట్టి ఒకరు. ఆమె గురించి బాయ్‌ఫ్రెండ్ యశ్వంత్ రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో లైవ్ నిర్వహించాడు. ఇందులో శోభాకు బిడ్డ పుట్టిన విషయంపై అతడు స్పందించాడు. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!
శోభా శెట్టి సంచలనంగా:గతంలో ఎన్నడూ చూడని విధంగా బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్‌గా ఫోకస్ అయ్యారు. వారిలో కార్తీక దీపం ఫేం శోభా శెట్టి ఒకరు. ఈమె నాగార్జున వచ్చే ఎపిసోడ్లలో మంచిగా ఉంటూ.. హౌస్‌లో మాత్రం మోనితలా మారిపోతూ సంచలనంగా మారింది.

అందరితోనూ గొడవలు:ఈ సీజన్‌లో మొదట్లో కాస్త మంచిగానే గేమ్ ఆడిన శోభా శెట్టి.. ఈ మధ్య కాలంలో మాత్రం బాగా ఫైర్ అవుతుంది. తనను ఎవరైనా నామినేట్ చేసినా.. కెప్టెన్సీ కంటెండర్‌గా ఉండడానికి అర్హత లేదు అన్నా.. టాస్కుల్లో ఓడిపోయినా యమా రెచ్చిపోతుంది. ఈ క్రమంలోనే చాలా మందితో గొడవలు పడుతోంది. దీంతో ఆమె పలుమార్లు డేంజర్ జోన్‌లోకి సైతం వెళ్లిన విషయం తెలిసిందే.
బిగ్ బాస్ ముద్దు బిడ్డగా:బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శోభా శెట్టి ఎన్నో సార్లు నామినేషన్స్‌లోకి వచ్చింది. నిత్యం అందరితో గొడవలు పెట్టుకుని చెడ్డ పేరును మూటగట్టుకునేది. దీంతో ప్రతి వారం డేంజర్ జోన్‌లోకే ఉండేది. కానీ, ఆమెను ఎలిమినేట్ చేయకుండా వేరే వాళ్లను బలి చేస్తూ వచ్చారు. ఫలితంగా శోభా శెట్టికి బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనే పేరును కూడా కొందరు పెట్టారు.

లవర్ ఎంట్రీ.. సపోర్టు:బిగ్ బాస్ ద్వారా మరింత హైలైట్ అయిన శోభా శెట్టి.. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌లో తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడు ఎవరో కాదు.. కార్తీక దీపం సీరియల్‌లో నటించిన యశ్వంత్ రెడ్డి. హౌస్ లోపల శోభా శెట్టి ఎలా కష్టపడి ఆడుతుందో.. బయట ఆమెను ప్రమోట్ చేసి ఓట్లు వేయించడం కోసం యశ్వంత్ కూడా కష్టపడుతున్నాడు. ఇలా చాలా సపోర్టును అందిస్తున్నాడు.
లైవ్‌లో క్లారిటీ ఇచ్చేసి:శోభా శెట్టి బిగ్ బాస్ ఫినాలేలో 14వ వారంలోనూ కొనసాగుతోంది. దీంతో ఆమెకు సపోర్టును అందించడం కోసం యశ్వంత్ రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో లైవ్‌ను నిర్వహించాడు. ఇందులో తమ ప్రేమ కథతో పాటు బిగ్ బాస్‌లో శోభా శెట్టి వ్యవహరిస్తున్న తీరుపై అతడు మాట్లాడాడు. అలాగే, పెళ్లితో పాటు ఆమెను బిగ్ బాస్ సేఫ్ చేస్తున్నాడని వస్తున్న వార్తలపైన కూడా క్లారిటీ ఇచ్చాడు.

నేనే ఒప్పుకోలేదంటూ:తాజాగా నిర్వహించిన లైవ్‌లో యశ్వంత్ రెడ్డిని ఓ నెటిజన్ లవ్ స్టోరీ చెప్పమని అడిగాడు. దీనికతడు 'కార్తీక దీపం సెట్స్‌లో శోభా నాకు ప్రపోజ్ చేసింది. కానీ, అప్పుడు ఆమెకు ఓకే చెప్పలేదు. ఆరు నెలల తర్వాత ఒప్పుకున్నా' అన్నాడు. పెళ్లి గురించి మరో ప్రశ్న ఎదురవగా.. 'మేము ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. దానికి చాలా టైం ఉంది' అని యశ్వంత్ అన్నాడు.
కొడుకు ఎలా ఉన్నాడు:శోభా శెట్టి - యశ్వంత్ రెడ్డికి పెళ్లి కాకముందే ఓ బాబు పుట్టాడని ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ 'అన్నా మీ కొడుకు ఏం చేస్తున్నాడు' అని ప్రశ్నించాడు. దీనికి యశ్వంత్ రెడ్డి 'మాకు కొడుకు ఎక్కడున్నాడమ్మా' అని అన్నాడు. ఫలితంగా శోభా శెట్టికి కొడుకు పుట్టాడంటూ వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పెట్టేసే ప్రయత్నం చేశాడు.


Click it and Unblock the Notifications











