Shobha Shetty: అది చూసే యశ్వంత్‌ను ప్రేమించా.. అసలు విషయం బయటపెట్టిన శోభాశెట్టి!
బిగ్ బాస్ తెలుగు 7 షోలో కంటెస్టెంట్ అయిన శోభాశెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన అందంతో అంతకు మించిన నటనతో కార్తీక దీపంలో మోనితగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈమె బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాధించింది. అయితే షోకు వచ్చేకంటే ముందు వరకు తాను సింగిల్ అని చెప్పుకుని తిరిగిన ఈ బ్యూటీ.. షోలో తన లవ్ గురించి, లవర్ గురించి చెప్పి షాకిచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఈమె ప్రియుడు స్టేజీ మీదకు రావడంతో అంతా షాకయ్యారు. అంతగా షాక్ అవ్వడానికి కారణం అతడు కూడా కార్తీక దీపం సీరియల్ లో నటించడం.
అందులోనూ నిరపమ్ తమ్ముడి క్యారెక్టర్ లో కనిపించిన ఇతడితోనే శోభాశెట్టి ప్రేమ కొనసాగించడంతో ఫ్యాన్స్ అంతా ఫఉల్ షాక్ అయ్యారు. అయితే ఆ షో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఈ బ్యూటీ ప్రియుడిని వెంట పెట్టుకునే తిరుగుతుంది. ఎక్కడకు వెళ్లినా వీరిద్దరూ జంటగానే కనిపిస్తున్నారు. వేరే ఛానెల్స్ లో కనిపించకపోయినప్పటికీ.. యూట్యూబ్ లో కలిసే ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే తాజాగా ఈ జంట ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ షోకు వచ్చారు. ముందుగా శోభాశెట్టి ఈ షోకు రాగా... యశ్వంత్ ను కూడా పిలిచి ఈవెంట్ నిర్వాహకులు ఆమెకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

శోభాశెట్టికి గంతలు కట్టి స్టేజీపై ఉంచగా.. చేతిలో ఓ రెడ్ రోజ్ పట్టుకుని చాలా స్టైలిష్ గా వచ్చాడు యశ్వంత్ రెడ్డి. అతడు వచ్చి ఆమెను పట్టుకోవడం.. ఆమె కూడా తనకోసం వచ్చింది ఎవరో తెలుసుకోవడానికి ఆరాట పడడం చాలా ఆసక్తిగా అనిపించింది. ముఖ్యంగా విల్ యూ మారీ మీ అంటూ యశ్వంత్ రెడ్డి మోకాళ్లపై కూర్చుని శోభాశెట్టికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆమె చేతికి ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్త పరిచాడు. ఇదంతా చూసి చాలా థ్రిల్ అయిన శోభాశెట్టి నోటి వెంట మాటలు రాలేవు.

అయితే ఇదంతా జరిగిన వెంటనే యాంకర్ శ్రీముఖి వచ్చి.. ఈయన్ను నీవు ఒప్పుకోవాడనికి కారణం ఏంటి అని అడిగింది. దీనికి వెంటనే శోభాశెట్టి వాడు చాలా కేరింగ్ చేస్తాడు, అలాగే వాడి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ అంతా చెక్ చేశాను.. పెద్దగా అమ్మాయిలు ఎవరితో మాట్లాడడు అందుకే ఓకే చెప్పానని స్పష్టం చేసింది. శోభా ఇలా చెప్పగానే అంతా నవ్వారు. అలాగే మానస్ వెంటనే అందుకుని.. బ్రో నీ ఫ్యూచర్ ఏంటో అర్థం అయిపోతుంది బ్రో అంటూ చెప్పడంతో నవ్వులు విరబూశాయి. దీనికి యశ్వంత్ కూడా పెద్దగా ఏమీ మాట్లాడకుండా ఫుల్ గా నవ్వుకున్నాడు. ఇలా ఆద్యంతం ఆకట్టుకున్న ఈ షో ఈరోజే స్టార్ మా ఛానెల్ లో రాబోతుంది. ఇంకెందుకు ఆలస్యం షోను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











