Shobha Shetty: నాగార్జున ప్రేమగా ఇచ్చిన టీషర్టును వదులుకున్న శోభాశెట్టి.. అతడి కోసమే ఈ త్యాగం!

బిగ్ బాస్ తెలుగు 7 షో గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో పాల్గొన్న సీరియల్ నటులు అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన లు చాలా స్నేహంగా ఉంటూ కలిసే గేమ్ ఆడారు. అయితే షోలో ఉండగా.. ఇందులోంచి ఓ ఇద్దరు నాగార్జున వేసుకున్న టీషర్టును గిఫ్టుగా ఇవ్వమని అడిగారు. అయితే స్టేజీపై నో చెప్పినా శోభాశెట్టికి సీక్రెట్ గా ఆ టీషర్టును గిఫ్టుగా పంపించారు.

అయితే నాగార్జున ఎంతో ప్రేమగా శోభాశెట్టికి పంపిన ఫుల్ హ్యాండ్స్ టీర్షును చూపించి ఎంతో మురిసిపోయింది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా దీని గురింటి ఓ వీడియోను కూడా షేర్ చేసింది. అయితే శోభాకు గిఫ్టు పంపి.. నోరు తెరిచి అడిగినా అమర్ దీప్ కు నిర్మొహమాటంగా నో చెప్పేశారు కింగ్. దీంతో ఆయన చాలా ఫీల్ అయ్యారు. అయితే తాజాగా నాగ్ ఇచ్చి గిఫ్టును శోభాశెట్టి వదలుకుంది. ఎందుకు, ఎవరి కోసం వదులుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bigg Boss Telugu 7 Contestant Shobha Shetty Sacrifies Nagarjuna Gift Check Details

బిగ్ బాస్ సీజన్ 7కు హౌస్టుగా వ్యవహరించిన కింగ్ నాగార్జున ఓ ఎపిసోడ్ లో వేసుకున్న.. ఈ స్పెషల్ టీషర్టుపై శోభాశెట్టి మనసు పారేసుకుంది. చూడగానే అది నచ్చిందంటూ నాగార్జునకు చెప్పింది. తనకు ఇవ్వమని కూడా అడిగేసింది. దాంతో నాగార్జున ఆ టీషర్ట్ ను శోభా శెట్టికి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని శోభ తన యూట్యూబ్‌ ఛానల్‌లో శోభా ఓ వీడియోలో చెప్పుకువచ్చింది.

తాను ఆరో వారంలో అడిగిన మాటలు గుర్తు పెట్టుకుని.. నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా నాగార్జున గారు పంపించడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. తెగ మురిసిపోతూ టీషర్టును వేసుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆ టీషర్టును మరొకరికి ఇచ్చేసింది. నాగార్జున ఎంతో ప్రేమగా పంపించిన ఈ టీషర్టును తనకు ఎంతగానో ఇష్టమైన, ఆప్తుడు అయిన తన ప్రెండ్ కు ఓ షోలో ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది.

Bigg Boss Telugu 7 Contestant Shobha Shetty Sacrifies Nagarjuna Gift Check Details

బీబీ ఉత్సవంలో భాగంగా బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్లు అందరినీ ఒక్క చోట చేర్చారు. ఈ సీజన్ లో పాల్గొన్న వారందరినీ తీసుకు వచ్చి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే శోభాశెట్టి నాగార్జున తనకు ఇచ్చిన టీషర్టును తీసుకు వచ్చింది. నోరారా అడిగినా.. నాగార్జున నో చెప్పిన అమర్ దీప్ కు ఆ బహుమతిని అందజేసింది. అది చూసిన అమర్ దీప్ చాలా ఎగ్జైట్ అయిపోయాడు. వెంటనే శోభాను హత్తుకుని థాంక్స్ చెప్పాడు. అలాగే స్టేజీమీదే ఆ టీ షర్టు వేసుకుని సందడి చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X