వాలెంటైన్స్ డేకు ప్రియుడి అదిరిపోయే గిఫ్టులిచ్చిన శోభాశెట్టి.. కానీ ఆమెకు గట్టి షాకిచ్చిన యశ్వంత్!

బిగ్ బాస్ తెలుగు 7 షో కంటెస్టెంట్ శోభాశెట్టి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆటతో తెగ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ బయటకు వచ్చిన తర్వాత నుంచి తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తూ వీడియోలు చేస్తుంది. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వీడియోలు పెడుతూ అందరినీ అలరిస్తోంది. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రియుడికి 5 అదిరిపోయే గిఫ్టులు ఇచ్చింది. కానీ ఆయన మాత్రం శోభాకు గట్టి షాక్ ఇచ్చాడు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీక దీపం సీరియల్ లో మోనితగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న శోభాశెట్టి బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాధించుకుంది. అయితే షోకు వచ్చేకంటే ముందు వరకు తాను సింగిల్ అని చెప్పుకుని తిరిగిన ఈ బ్యూటీ.. షోలో తన లవ్ గురించి, లవర్ గురించి చెప్పి షాకిచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఈమె ప్రియుడు స్టేజీ మీదకు రావడంతో అంతా షాకయ్యారు. అంతగా షాక్ అవ్వడానికి కారణం అతడు కూడా కార్తీక దీపం సీరియల్ లో నటించడం.

 Bigg Boss Telugu 7 Contestant Shobha Shetty Special Gifrs For Yashwanth on Valentines Day Check Details

అయితే ఇటీవలే కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ ఏడాదే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది ప్రియుడికి. ముఖ్యంగా ఆయనను ఓ పార్టీకీ తీసుకు వెళ్తున్నట్లు చెప్పి.. ఇద్దరూ మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. ఇప్పటికే తన స్నేహితుడు టేస్టీ తేజతో కలిసి వెళ్లి ప్రియుడి కోసం ఐదు అదిరిపోయే గిఫ్టులను తీసుకుంది. అయితే ముందు అవేంటో రివీల్ చేయని ఆమె షోలో వాటిని ఇచ్చింది.

ముందుగా తన ప్రియుడిని చూపించింది. అతడిని చూసి ఆమే షాక్ అయింది. ఎందుకంటే ఆయన పూర్తిగా గడ్డం తీసేశాడు. క్లీన్ షేవ్ తో ప్రియుడిని చూసి షాక్ అయిన శోభా.. ఇది కూడా బానే ఉందని చెబుతూ కవర్ చేసింది. కానీ ప్రియుడి కొత్త లుక్ ను చూసి కాస్త బాధ పడినట్లు అనిపిస్తోంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఓ స్పెషల్ ప్లేస్ కు వెళ్లారు. రెడ్ రోజెస్ తో డెకరేట్ చేసి ఉన్న చోటుకి వెళ్లి లవ్ ప్రపోజ్ చేసింది. బ్యాచిలర్స్ గా తమకు ఇదే చివరి ఏడాది కావడంతోనే జీవితాంతం గుర్తిండిపోయేలా ట్రీట్ ఇవ్వాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది.

 Bigg Boss Telugu 7 Contestant Shobha Shetty Special Gifrs For Yashwanth on Valentines Day Check Details

ఆ తర్వాత గోల్డ్ చైన్, వినాయకుడి లాకెట్, సిల్వర్ బ్రేస్ లెట్, ఓ వాలెట్, అలాగే పర్ఫ్యూమ్ బాటిల్ ను బహుమతులుగా ఇచ్చింది. నేరుగా వాటిని ఇవ్వకుండా.. తన గురించి అనేక ప్రశ్నలు అడుగుతూ.. కరెక్టుగా సమాధానాలు చెప్పినవాటికే బహుమతులు ఇచ్చి వాటిని ఓపెన్ చేయించింది. ఇలా తమ లవ్ స్టోరీని మరోసారి చెప్పుకొచ్చారు ఈ జంట. అయితే యశ్వంత్ మాత్రం శోభాకు వాలెంటైన్స్ డే సందర్భంగా ఎలాంటి గిఫ్టు కూడా ఇవ్వలేదు. కనీసం పువ్వు కూడా ఇవ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X