సీరియల్స్‌కు గుడ్ బై చెప్పేసిన శోభాశెట్టి.. ఎందుకు, నెక్స్ట్ ఏం చేయబోతుందో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ శోభాశెట్టి గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో విపరీతమైన రచ్చ చేసి తీవ్రమైన నెగిటివిటీ తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఓన్లీ నెగిటివిటీయే కాదులెండి. పాజిటివిటీ తెచ్చుకున్నా.. నెగిటివిటీ ఎక్కువవడంతో అది ఎక్కువగా కనిపించట్లేదు. బిగ్ బాస్ షోకంటే ముందు... కార్తీక దీపం సీరియల్ లో మోనితగా అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతుంది. ముఖ్యంగా ఆఫ్టర్ బిగ్ బాస్ సీరియల్స్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఇప్పుడు ఆమె ఏం చేయబోతుంది, ఏ ఛానెల్ లో కనిపించబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి శోభాశెట్టి ఎక్కువగా ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా ఓన్లీ పలు న్యాస్ ఛానెల్స్ తో పాటు అనేక యూట్యూబ్ ఛానెళ్లలో సందడి చేసింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కొత్తగా యాంకర్ గా మారిపోయినట్లు తెలుస్తోంది. గతంలో సీరియల్స్ లో నటించి ఈమె ఇప్పుడు సీరియల్స్ కు కొంత కాలం బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. కాస్త డిఫరెంట్ గా ఉండే ప్రోగ్రాంలలో కనిపించాలనుకుంటున్నట్లు వివరించింది.

ముఖ్యంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఓ మూడు ప్రోగ్రాంలకు ఓకే చెప్పినట్లు వివరించింది. సీరియల్ నటిగా కంటే కూడా యాంకరింగ్ చేస్తే కొంచెం కొత్తగా ఉంటుందని ఇప్పుడీమే యాంకర్ గా మారిపోయిందట. స్టార్ మా బ్యాచ్ కు గుడ్ బై చెప్పేసి సుమన్ టీవీలోకి ఎంటర్ అయిపోయింది. తానే హోస్ట్ గా.. కాఫీ విత్ శోభా అనే ప్రోగ్రాం చేయబోతుంది. అయితే ఇప్పటి వరకు ఈ షో గురించి ఎలాంటి విషయాలు తెలియదు. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ విషయాలన్నింటినీ వెల్లడించింది.
కాఫీ విత్ శోభా.. అనే ఎపిసోడ్ చేసేందుకు ముందుగా ఓ ప్రోమోలో నటించింది. ఆ ప్రోమోను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు వివరించింది. అంతే కాకుండా.. ఈషోకు మొదటి గెస్టుగా అశ్వత్థామ 2.0 గౌతమ్ కృష్ణ వచ్చాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ కమ్ హీరో అయిన ఈయనను ఈ షోకు మొదటి గెస్టుగా ఆహ్వానించగా.. ఆయన కాస్త ఆలస్యంగా వచ్చాడు. అయితే అతను వచ్చే వరకు టైం వేస్ట్ చేయడం ఎందుకని సెకండ్ ఎపిసోడ్ ను పూర్తి చేశారు. సెకండ్ ఎపిసోడ్ కు గెస్టుగా సీరియల్ నటి విష్ణు ప్రియ వచ్చింది. త్రినయని సీరియల్ లో హాసినిగా అలరించే ఈ ముద్దుగుమ్మే రెండో ఎపిసోడ్ కు గెస్టు.

అలా విష్ణుప్రియతో రెండో ఎపిసోడ్ షూటింగ్ కాగానే... మొదటి ఎపిసోడ్ గెస్టు గౌతమ్ కృష్ణ వచ్చాడు. ఆ తర్వాత అతడితో కూడా ఇంటర్వ్యూ పూర్తి అయిపోయింది. అయితే ఈ షోను చూసేందుకు.. శోభాశెట్టి కోసం టేస్టీ తేజ కూడా అక్కడకు వచ్చాడు. చాలా సందడిగా ఈ షో సాగిపోగా.. ఆమె వేసుకున్న ఔట్ ఫిట్ తో పాటు హెయిర్ స్టైల్, జ్యూవెల్లరీని కూడా చూపించింది. మీరు కూడా ఓ సారి ఈ వీడియో చూసేయండి.


Click it and Unblock the Notifications











