Shobha Shetty: బుల్లితెరకు గుడ్ బై చెప్పేసిన శోభాశెట్టి.. కొత్త బిజినెస్ స్టార్ట్.. ఏంటో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ శోభాశెట్టి గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో విపరీతమైన రచ్చ చేసి తీవ్రమైన నెగిటివిటీ తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఓన్లీ నెగిటివిటీయే కాదులెండి. పాజిటివిటీ తెచ్చుకున్నా.. నెగిటివిటీ ఎక్కువవడంతో అది ఎక్కువగా కనిపించట్లేదు. బిగ్ బాస్ షోకంటే ముందు... కార్తీక దీపం సీరియల్ లో మోనితగా అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సీరియల్స్ కు గుడ్ బై చెప్పబోతుంది. సినీ రంగానికి దూరమై బిజినెస్ ఉమెన్ గా మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి శోభాశెట్టి ఎక్కువగా ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తూ.. సుమన్ టీవీ వాళ్లకు కాఫీ విత్ శోభాశెట్టి అనే ఓ షో చేస్తోంది. ఇవి తప్ప ఆమె ఏవీ చేయట్లేదు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ అదిరిపోయే వార్త చెప్పింది. ఆ వార్త వింటే సీరియల్స్ కు ఈమె పూర్తిగా దూరం కాబోతున్నట్లు అర్థం అవుతుంది. అయితే ఇన్నాళ్లూ టీవీలో షోలు చేసిన ఈమె తాజాగా బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది.

ముఖ్యంగా మేకప్ స్కూల్ ప్రారంభించి.. అనేక మందికి మేకప్ వేయడం నేర్పించాలని డిసైడ్ అయింది. చాలా కాలం క్రితమే ఈ వార్త చెప్పేసింది. దానికి సంబంధించిన పనులు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అందుకోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. అయితే సరదాగా షాపింగ్ కు వెళ్తున్నట్లు చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. ఓ ప్లేస్ కు వెళ్లింది. అక్కడే షాపింగ్ చేస్తూ అసలు విషయాన్ని వివరించింది.
తాజాగా తన ప్రియుడు యశ్వంత్ తో కలిసి ఈమె సూరత్ వెళ్లింది. అక్కడే బట్టలు షాపింగ్ చేస్తూ కనిపించింది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా తన యూట్యూభ్ ఛానెల్ ద్వారా పోస్ట్ చేసింది. అందులో సారీస్ మానుఫ్యాక్చరర్ షాప్ కు వెళ్లిన శోభాశెట్టి హోల్ సేల్ కంటే తక్కువ ధరలకు చీరలు కొనుగులు చేసింది. అయితే తాను సారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లు అందుకోసమే షాపింగ్ కోసం సూరత్ వెళ్లినట్లు చెప్పింది. హోల్ సేల్ ధరలకు కూడా తాను చీరలు అమ్ముతానని వివరించింది.

ముఖ్యంగా తన వద్దకు మేకప్ నేర్చుకునేందుకు వచ్చే వారు బిజినెస్ పెట్టుకునేలా.. ఈ చీరలను కూడా వారికి హోల్ సేల్ ధరల్లో అందిస్తానని వెల్లడించింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇలా అదిరిపోయే బిజినెస్ ప్లాన్ లు చేస్తూ ఎక్కువగా సంపాధించాలని చూస్తోంది శోభాశెట్టి. ఇలా బిజినెస్ పైనే పూర్తిగా కాన్ సంట్రేట్ చేస్తే ఈమె సీరియల్స్ కు పూర్తిగా దూరం అవడం కచ్చితమే. చూడాలి మరి ఏం జరనగుంది అనేది.


Click it and Unblock the Notifications











