Shubha Shree: డాక్టర్ బాబుకు హ్యాండ్.. ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో పెళ్లికి రెడీ.. వీడియో వైరల్!
బిగ్ బాస్ తెలుగు 7 గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ క్యూట్ అడిగిన లాయర్ పాప శుభశ్రీ రాయగురు అందరికీ పరిచయచమే. అయితే హౌస్ లో ఉండగా.. డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణతో కలిసి క్లోజ్ గా మూవ్ అయిన ఈమె బయటకు వచ్చాకా అతడితో ఆన్ స్ర్కీన్ లవ్ ట్రాక్ నడుపుతోంది. అయితే తాజాగా ఆయనకు హ్యాండ్ ఇచ్చి మరో కంటెస్టెంట్ తో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ హౌస్ లో ఉండగా.. శుభశ్రీ రాయగురు వెనకాలే తిరుగుతూ తనపై ప్రేమను వ్యక్త పరిచే వాడు డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ. అయితే ఆమె వెళ్లిపోవడానికి ఓ రకంగా ఆయనే కారణం అయ్యాడు కూడా. సుబ్బును బాగానే ఏడిపించినా ఆమెపై తనకు ప్రేమ ఉందని చాలా సార్లే చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా హౌస్ నుంచి అతడు బయటకు వచ్చాకా కూడా సుబ్బునే ముందు కలిశానని పేర్కొన్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చాలా మంది లైక్ చేశారు. అందుకోసమే ఏమో.. సుబ్బు కూడా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా గౌతమ్ కృష్ణ గురించి పలు విషయాలు చెబుతుంది.

కేవలం చెప్పడమే కాదండోయ్.. గతంలో ఓసారి అతిడిని ఇంటర్వ్యూ చేయగా.. ఆ వీడియోకు ఫుల్ రీచ్ వచ్చింది. అలాగే తాజాగా ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే స్పెషల్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. అందులో కూడా గౌతమ్ తోనే కనిపించి సందడి చేసింది. తామిద్దరి మధ్య ప్రేమ లేదంటూనే.. అతడితో క్లోజ్ గా ఉంటూ వస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ తో కనిపించింది. కనిపించడమే కాదు వీడియో కూడా చేసింది.
ముఖ్యంగా ఆ వీడియోపై థంబ్ నెయిల్ లో.. ఫైనల్లీ మా పెళ్లికి షాపింగ్ స్టార్ అయిందంటూ ఫొటో పెట్టింది. ఇదంతా చూసిన వారు అతడితో ఈమె పెళ్లి ఫిక్స్ అయిందనే భావించారు. కానీ వీడియో పూర్తిగా చూసిన వారికి మాత్రం అసలు క్లారిటీ వచ్చింది. అయితే తాను పెళ్లికి రెడీ అయ్యానంటూ చెప్పుకొచ్చిన కంటెస్టెంట్ మరెవరో కాదు.. టేస్టీ తేజ. అతడితో ఓ షాపింగ్ ప్రమోషనల్ వీడియో చేసిన ఈమె ఇలా థంబ్ నెయిల్ పెట్టింది. థంబ్ నెయిల్ చూసిన ప్రతీ ఒకక్రూ ఆమె డాక్టర్ బాబుకు హ్యాండ్ ఇచ్చిందంటూ చెప్పుకొస్తున్నారు.

కేవలం ఈ థంబ్ నెయిల్ ఫొటోను మాత్రమే నెట్టింట వైరల్ చేస్తూ సుబ్బు పెళ్లి ఇతడితోనే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవమూ లేదు. కేవలం చీరలకు సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియోలో భాగంగానే.. పెళ్లి షాపింగ్ అంటూ కాస్త మసాలా యాడ్ చేసి థంబ్ నెయిల్ పెట్టారు. సుబ్బుకు ఇటు టేస్టీ తేజతో గానీ అటు గౌతమ్ కృష్ణతో కానీ ప్రేమాయణం లేదని చెబుతూనే వస్తోంది.


Click it and Unblock the Notifications











